Mary Kom movie
-
'ఆ సినిమాకు ప్రత్యేక స్థానముంది'
ముంబై: 'మేరీ కోమ్' సినిమాకు తన హృదయంలో ప్రత్యేక స్థానముందని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇంత మంచి సినిమాలో నటించేందుకు తనకు సహకరించిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. 62వ జాతీయ అవార్డుల్లో 'బెస్ట్ పాపులర్ ఫిలిమ్'గా మేరీ కోమ్ చిత్రం ఎంపికైంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని, దానికి ఫలితం దక్కిందని ట్విటర్ లో సంతోషం వ్యక్తం చేసింది. తనతో పాటు నటించిన నటీనటులతో పాటు ప్రొడక్షన్ యూనిట్ కు ఆమె ధన్యవాదాలు తెలిపింది. భారత మహిళా బాక్సర్ ఎంసీ మేరీకోమ్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. -
ప్రియాంక సినిమాకు 'యూ' సర్టిఫికెట్
ముంబై: ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘మేరీ కోమ్’ హిందీ సినిమాకు 'యూ' సర్టిఫికెట్ దక్కింది. మహిళా బాక్సర్ మేరీ కోమ్ జీవిత చరిత్రను ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సినిమాకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) అంతకుముందు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీనిపై సినిమా రూపకర్తలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీబీఎఫ్ సీ మనసు మార్చుకుంది. తాజాగా 'యూ' సర్టిఫికెట్ దక్కడం పట్ల ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది. తమ సినిమా యూ సర్టిఫికెట్ దక్కడంతో అందరికీ చేరువవుతుందని ట్విటర్ లో పేర్కొంది. సెప్టెంబర్ 5 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సంజయ్ లీలా నిర్మించిన ఈ సినిమాకు ఒమాంగ్ కుమార్ దర్శకత్వం వహించారు.