'ఆ సినిమాకు ప్రత్యేక స్థానముంది' | 'Mary Kom' a piece of my heart, says Priyanka Chopra | Sakshi
Sakshi News home page

'ఆ సినిమాకు ప్రత్యేక స్థానముంది'

Published Mon, May 4 2015 7:05 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

'ఆ సినిమాకు ప్రత్యేక స్థానముంది'

'ఆ సినిమాకు ప్రత్యేక స్థానముంది'

ముంబై: 'మేరీ కోమ్' సినిమాకు తన హృదయంలో ప్రత్యేక స్థానముందని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇంత మంచి సినిమాలో నటించేందుకు తనకు సహకరించిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది.

62వ జాతీయ అవార్డుల్లో 'బెస్ట్ పాపులర్ ఫిలిమ్'గా మేరీ కోమ్ చిత్రం ఎంపికైంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని, దానికి ఫలితం దక్కిందని ట్విటర్ లో సంతోషం వ్యక్తం చేసింది. తనతో పాటు నటించిన నటీనటులతో పాటు ప్రొడక్షన్ యూనిట్ కు ఆమె ధన్యవాదాలు తెలిపింది. భారత మహిళా బాక్సర్ ఎంసీ మేరీకోమ్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement