ప్రియాంక సినిమాకు 'యూ' సర్టిఫికెట్ | Priyanka Chopra-starrer 'Mary Kom' gets U certificate | Sakshi
Sakshi News home page

ప్రియాంక సినిమాకు 'యూ' సర్టిఫికెట్

Published Thu, Aug 28 2014 3:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

ప్రియాంక సినిమాకు 'యూ' సర్టిఫికెట్

ప్రియాంక సినిమాకు 'యూ' సర్టిఫికెట్

ముంబై: ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘మేరీ కోమ్’ హిందీ సినిమాకు 'యూ' సర్టిఫికెట్ దక్కింది. మహిళా బాక్సర్ మేరీ కోమ్ జీవిత చరిత్రను ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సినిమాకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) అంతకుముందు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీనిపై సినిమా రూపకర్తలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీబీఎఫ్ సీ మనసు మార్చుకుంది.

తాజాగా 'యూ' సర్టిఫికెట్ దక్కడం పట్ల ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది. తమ సినిమా యూ సర్టిఫికెట్ దక్కడంతో అందరికీ చేరువవుతుందని ట్విటర్ లో పేర్కొంది. సెప్టెంబర్ 5 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సంజయ్ లీలా నిర్మించిన ఈ సినిమాకు ఒమాంగ్ కుమార్ దర్శకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement