U Certificate
-
Vyuham: ఆర్జీవీ వ్యూహానికి తొలగిన అడ్డంకులు
రాం గోపాల్ వర్మ ‘వ్యూహం’ రిలీజ్‌కు అడ్డంకులు తొలిగాయి. సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ విషయాన్ని ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్వయంగా పంచుకున్నారు. ఈ నెల 29వ తేదీన సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారాయన. ఇక సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించడంపై వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్ అంటూ ఎక్స్‌లో సందేశం ఉంచారాయన. BAD NEWS for BAD GUYS 💪 VYUHAM censor CERTIFICATE 🙌 DECEMBER 29 th in THEATRES 😌 pic.twitter.com/LBBKAt977s — Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2023 వర్మ డైరెక్షన్లో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. ఈ సినిమాను అడ్డుకునేందుకు కొందరు విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ సైతం రాశారు. ఆ సమయంలో ఆర్జీవీ తీవ్ర స్థాయిలోనే స్పందించారు. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని ఛాలెంజ్‌ను స్వీకరించారాయన. ఇదీ చదవండి- ‘వ్యూహం’ ఏ పార్టీకి చెందింది కాదు.. కేవలం.. : ఆర్జీవీ -
మంచివాడు
కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ని పొందింది. సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్. -
ఆత్రేయ వస్తున్నారు
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రల్లో స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ‘మళ్ళీరావా’ చిత్రాన్ని నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా రూపొందించిన ఈ సినిమా ‘యు/ఎ’ సర్టిఫికెట్ అందుకుంది. ఈనెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. నవీన్ ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో నటించాడు. డిఫరెంట్ టేకింగ్, స్క్రీన్‌ప్లేతో సాగే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. మార్క్ కె.రాబిన్ సంగీతం, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. -
మధ్య తరగతి అమ్మాయి కథ
రాజకిరణ్ సినిమా పతాకంపై ఫణి తిరుమల శెట్టి సమర్పిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్నారు. ’గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించారు. ‘‘సాధారణ మధ్యతరగతి అమ్మాయి జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోని సమస్యలు ఆమెను వేధిస్తాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఆ సమస్యలను పరిష్కరిస్తాడు. అతడు ఎవరు? ఆమె కథలో మనిషి మేథస్సుకు అందని సృష్టి రహస్యాలు ఏంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించిన ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రాజకిరణ్ మాట్లాడుతూ– ‘‘ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే అని చెప్పే ప్రయత్నమే ‘విశ్వామిత్ర’. మధ్యతరగతి అమ్మాయి పాత్రలో నందితా రాజ్ చేశారు. ‘సత్యం’ రాజేశ్, అశుతోష్ రానా, ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా లవ్ థ్రిల్లర్ జానర్లో సినిమా రూపొందింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
మోదీ బయోపిక్కు బ్రేక్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ’చిత్ర విడుదలకు బ్రేక్ వేసింది. దేశంలో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ నాయకుల బయోపిక్‌లను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఆదేశించింది. దీంతో గురువారం (11న) విడుదల కావాల్సిన మోదీ బయోపిక్ వాయిదాపడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ బయోపిక్ విడుదలను నిలిపివేయాలని కోరుతూ.. కాంగ్రెస్ కార్యకర్త ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చిత్రం విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా ఈసీ ఆదేశాలతో సినిమా విడుదల వాయిదా పడింది. కాగా ఇదే నిబంధనలు ‘నమో టీవీ’ విషయంలోనూ వర్తించే అవకాశం ఉందని ఎన్నికల ప్యానెల్ అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో నమో టీవీలో ప్రసారాలు నిలిపివేయాలన్నారు. ఈసీ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి సంబంధించిన విషయాలను పోస్టర్ లేదా సినిమాల రూపంలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేయకూడదు. మోదీ బయోపిక్కు ‘యూ’సర్టిఫికెట్.. పీఎం నరేంద్ర మోదీ సినిమాకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ‘యూ’సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాకు యూ సర్టిఫికెట్ రావడంపై చిత్ర నిర్మాత సందీప్æ సంతోషం వ్యక్తం చేశారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ ఈ చిత్రంలో మోదీగా నటించారు. -
ఒకటే జీవితం
ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకటే లైఫ్’. ఎం.వెంకట్ దర్శకుడు. శ్రుతియుగల్ కథానాయిక. లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. వెంకట్ మాట్లాడుతూ– ‘‘నేటితరం టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోంది. హ్యూమన్ రిలేషన్స్‌కు, ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అమ్రీష్ పాటలు, రీ–రికార్డింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాను వెంకట్ తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావుగారు మా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని నారాయణ్ రామ్ అన్నారు. -
ప్రజలంటే భయం ఉండాలి
‘‘నా ‘అన్నదాత సుఖీభవ’ సినిమా సెన్సార్‌కు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా సెన్సార్ రివైజింగ్ కమిటీ అన్నదాత సుఖీభవ అని ప్రకటించింది’’ అన్నారు దర్శక– నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి. స్నేహ చిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. సెన్సార్ రివైజింగ్ కమిటీ ‘యు’ సర్టిఫికెట్‌ను అందజేసింది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు పరిస్థితి నేడు దారుణంగా ఉంది. అన్నదాత సుఖీభవలా లేదు.. దుఃఖీభవ అనేలా ఉంది. పాలకులకు ప్రజలంటే భయం ఉండాలి. అప్పుడే వ్యవస్థ బాగుంటుంది. ఈ చిత్రానికి రైతు సంక్షేమ సంఘాలు, వామపక్షాలు సహకరించాయి. ఈ నెల 14న పాటలను విడుదల చేసి జూన్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. -
కాటమరాయుడుకు 'యూ' సర్టిఫికెట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన కాటమరాయుడు చిత్రానికి 'యూ' సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ బృందం బుధవారం ఈ చిత్రానికి 'యూ' సర్టిఫికెట్ జారీ చేసింది. కాటమరాయుడు మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నిడివి 2 గంటల 24 నిమిషాలు ఉండనుందట. ప్రస్తుతం టాలీవుడ్లో కాటమరాయుడు ఫీవర్ నడుస్తోంది. ఈ చిత్రం గురించి రోజుకో వార్త వెలువడుతున్న విషయం తెలిసిందే. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకుడు. ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తుండగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. కాటమరాయుడు చిత్రంలో పవన్ పక్కా మాస్ లుక్ లో ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌కు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలో ఆన్లైన్లో వ్యూస్ దక్కాయి. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు మార్చి 18న భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అదే రోజున థియట్రికల్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. -
మరగదనాణయంకు యూ సర్టిఫికెట్
మరగదనాణయం చిత్రానికి సెన్సార్‌బోర్డు యూ సర్టిఫికెట్ అందించింది.ఆది, నిక్కీగల్రాణి జంటగా నటించిన చిత్రం మరగదనాణయం.ఆనందరాజ్, మునీష్కాంత్, కాళీవెంకట్, అరుణ్ రాజ కామరాజ్, డేనీ, కోటాశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎంఎస్.భాస్కర్, మైమ్‌గోపి ము ఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నవదర్శకుడు ఏఆర్కే.శరవణ్ దర్శకత్వంలో యాక్సెస్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై డిల్లీబాబు నిర్మిస్తున్నారు.యాక్షన్, ఎండ్వెచర్, వినోదం కలగలిపిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని చిత్ర వర్గాలు వెల్లడించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మరగదనాణయం చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిపారు. చిత్రాలకు యూ సర్టిఫికెట్ రావడమే గగనంగా మారిన తరుణంలో తమ చిత్రానికి యూ సర్టిఫికెట్ రావడం సంతోషంగా ఉందని చిత్ర నిర్మాత ఢిల్లీబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.మంచి కథా చిత్రాలను నిర్మాంచాలన్న ఒక ఆశయంతో ఈ రంగంలోకి వచ్చామని, మరగద నాణయం ఆ స్థాయిలో ఉంటుందని చెప్పారు. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను పొందుతోంది.చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుందన్నది గమనార్హం. -
తిరి చిత్రానికి యూ సర్టిఫికెట్
తిరి చిత్రానికి సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ అందించడంతో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. నవ దర్శకుడు అశోక్ తెరకెక్కించిన చిత్రం తిరి. అశ్విన్ కాక్కమను హీరోగా నటించిన ఇందులో నటి స్వాతిరెడ్డి హీరోరుున్‌గా నటించారు. సీషోర్ గోల్డ్ ప్రొడక్షన్స పతాకంపై ఏకే.బాలమురుగన్, ఆర్పీ.బాలగోపి సంయు క్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.వెట్రికుమార్, ఎస్.ఆంటోన్ రంజిత్, ఎస్.జాన్ పీటర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ తిరి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజుల్లో ఒక జనరంజకమైన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రానికి యూ సర్టిఫికెట్ లభించడం కష్ట సాధ్యంగా మారిందనే చెప్పాలన్నారు.అలాంటిది తమ తిరి చిత్రానికి యూ సర్టిఫికెట్ లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది తండ్రి కొడుకుల మధ్య సాగే విభిన్న కథా చిత్రం అని తెలిపారు. తిరి చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం తమకు ఉందని దర్శకుడు అశోక్ అన్నారు. -
యూ సర్టిఫికెట్ కోసం బతిమాలుతున్నారు
చిత్రాలకు యూ సర్టిఫికెట్ కావాలంటూ నిర్మాతలు బతిమలాడుతున్నారని సీనియర్ నటుడు,సెన్సార్ బోర్డు సభ్యుడు ఎస్వి.శేఖర్ వ్యాఖ్యానించారు. ఎంఎస్‌జీ. మూవీస్ పతాకంపై జి.హరి నిర్మించిన చిత్రం జంబులింగం. 3డీ ఫార్మెట్లో రూపొందిన ఈ చిత్రానికి హరి అండ్ హరీష్ ద్వయం కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. వీరు ఇంతకు ముందు జంబులి 3డీ తదితర ప్రయోగాత్మక సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రానికి మహిళా సంగీత దర్శకురాలు శ్రీవిద్య సంగీతాన్ని అందించడం విశేషం. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్వీ.శేఖర్ మాట్లాడుతూ నిర్మాతలు బాగుంటేనే చిత్ర పరిశ్రమ బాగుంటుందన్నారు.అయితే చాలా మంది నిర్మాతలు చిత్ర నిర్మాణంపై అవగాహన లేకుండానే చిత్రాలు నిర్మించడానికి సిద్ధం అవుతున్నారన్నారు. విదేశాల్లో చిత్రీకరణ అంటూ స్క్రిప్ట్ లేకుండానే అక్కడ చిత్ర నిర్మాణాలు చేస్తున్నారన్నారు. చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలకు ఎలాగైనా యూ సర్టిఫికెట్ కావాలంటూ సెన్సార్ బోర్డు సభ్యులను బతిమలాడుతున్నారన్నారు. నిజానికి అలా బతిమలాడాల్సిన అవసరం లేదన్నారు. మంచి స్క్రిప్ట్‌తో ప్రణాళిక ప్రకారం చిత్రాలు చేసుకోవాలని హితవు పలికారు. మరో విషయం ఏమిటంటే నిర్మాతలు ము సర్టిఫికెట్ల కోసం బతిమలాడడానికి ప్రభుత్వం కూడా ఒక కారణం అని పిస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసమే యూ సర్టిఫికెట్ కోసం పడరాని పాట్లు పడుతున్నారని, అసలు ప్రభుత్వం యూ, యూఏ అనే భేదాలు లేకుండా చిత్రానికి ఇంత సబ్సిడీ అని చెల్లిస్తే నిర్మాతలకు ఈ సమస్యలు ఉండవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక జంబులింగం చిత్రం గురించి చెప్పాలంటే ఈ చిత్ర యూనిట్ జపాన్‌లో చిత్రీకరణ నిర్వహించినా మంచి స్క్రిప్ట్‌ను తీసుకెళ్లినట్లుందన్నారు. జంబులింగం ఈ వేసవి కాలంలో కుటుంబ సభ్యులు పిల్లలను తీసుకుని చూసి ఆనందించే చిత్రం అన్నారు. దర్శకుడు పి.వాసు, వైజీ.మహేంద్రన్, సంగీత దర్శకుడు గంగై అమరన్, కృష్ణ స్వీట్స్ మురళి, జపాన్ దేశ కోఆర్డినేటర్ సుహానో జెనిసీ పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ఎంపీఎస్ ఫిలింస్ సంస్థ ఈ నెల 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. -
'24'కు సర్టిఫికెట్ ఇచ్చేశారు.. చూసేందుకు సిద్ధమా!
సూర్య హీరోగా ఎన్నో అంచనాలతో వస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా '24'కు సెన్సార్ బోర్డు 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సర్టిఫికెట్తో తమిళనాడులో ఈ సినిమాకు వినోదపన్ను మినహాయింపు లభించనుంది. ఈ సినిమా మే 6న దేశమంతటా విడుదల కానుంది. 'ఇష్క్', 'మనం' సినిమాలతో సత్తా చాటిన దర్శకుడు విక్రం కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా వినూత్నమైన రీతిలో ప్రమోషన్స్ నిర్వహించారు. 'ఆత్రేయా రన్' పేరిట ఓ ఆండ్రాయిడ్ గేమ్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రచారం కోసం సోషల్ మీడియానూ విపరీతంగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా విడుదల కోసం సర్వసన్నాహాలు పూర్తి చేసుకొని ఈ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నది. 24 సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. టైమ్ మిషన్ కాన్సెప్టు ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో సూర్య మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. దీనికి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, సూర్య సొంత బ్యానర్లో నిర్మించారు. -
ప్రియాంక సినిమాకు 'యూ' సర్టిఫికెట్
ముంబై: ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘మేరీ కోమ్’ హిందీ సినిమాకు 'యూ' సర్టిఫికెట్ దక్కింది. మహిళా బాక్సర్ మేరీ కోమ్ జీవిత చరిత్రను ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సినిమాకు సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) అంతకుముందు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీనిపై సినిమా రూపకర్తలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీబీఎఫ్ సీ మనసు మార్చుకుంది. తాజాగా 'యూ' సర్టిఫికెట్ దక్కడం పట్ల ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది. తమ సినిమా యూ సర్టిఫికెట్ దక్కడంతో అందరికీ చేరువవుతుందని ట్విటర్ లో పేర్కొంది. సెప్టెంబర్ 5 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సంజయ్ లీలా నిర్మించిన ఈ సినిమాకు ఒమాంగ్ కుమార్ దర్శకత్వం వహించారు.