'24'కు సర్టిఫికెట్ ఇచ్చేశారు.. చూసేందుకు సిద్ధమా! | 24, Suriya sci fi film gets a U certificate | Sakshi
Sakshi News home page

'24'కు సర్టిఫికెట్ ఇచ్చేశారు.. చూసేందుకు సిద్ధమా!

Published Sat, Apr 30 2016 9:20 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

'24'కు సర్టిఫికెట్ ఇచ్చేశారు.. చూసేందుకు సిద్ధమా!

'24'కు సర్టిఫికెట్ ఇచ్చేశారు.. చూసేందుకు సిద్ధమా!

సూర్య హీరోగా ఎన్నో అంచనాలతో వస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా '24'కు సెన్సార్‌ బోర్డు 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సర్టిఫికెట్‌తో తమిళనాడులో ఈ సినిమాకు వినోదపన్ను మినహాయింపు లభించనుంది. ఈ సినిమా మే 6న దేశమంతటా విడుదల కానుంది. 'ఇష్క్‌', 'మనం' సినిమాలతో సత్తా చాటిన దర్శకుడు విక్రం కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా వినూత్నమైన రీతిలో ప్రమోషన్స్ నిర్వహించారు. 'ఆత్రేయా రన్‌' పేరిట ఓ ఆండ్రాయిడ్ గేమ్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రచారం కోసం సోషల్‌ మీడియానూ విపరీతంగా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమా విడుదల కోసం సర్వసన్నాహాలు పూర్తి చేసుకొని ఈ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నది.

24 సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. టైమ్ మిషన్ కాన్సెప్టు ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో సూర్య మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. దీనికి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, సూర్య సొంత బ్యానర్లో నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement