Maryada Ramanna Film
-
రాజమౌళి సినిమాను త్రిష తిరస్కరించిందా.. కారణం ఆ హీరోనేనా..?
సౌత్ ఇండియాలో 25 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గుర్తింపును త్రిష కొనసాగిస్తుంది. మోడలింగ్ నుంచి హీరోయిన్గా 'జోడి' (తమిళ్) సినిమాతో 1999లో ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ సిమ్రన్‌కు స్నేహితురాలిగా మెప్పించింది. ఈ సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించింది. 'నీ మనసు నాకు తెలుసు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన త్రిషకు కొన్నేళ్ల తర్వాత అవకాశాలు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి భారీ అవకాశాలను దక్కించుకుంటుంది.డైరెక్టర్ రాజమౌళి సినిమాను త్రిష కాదన్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. వరుస హిట్లతో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజమౌళి.. 2009లో 'మగధీర' చిత్రం తర్వాత 'మర్యాద రామన్న' తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రంలో సునీల్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించే ఛాన్స్‌ను మొదట త్రిషకు రాజమౌళి ఆఫర్ చేశారట. అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. దీంతో కమెడియన్‌గా కొనసాగిన సునీల్‌తో నటించడం వల్ల తన మార్కెట్ పడిపోతుందని సున్నితంగా తిరస్కరించిందట. అయితే, ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన సలోని పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో వచ్చిన అవకాశాన్ని కాదని పెద్ద తప్పు చేశానే అని ఆలోచనలో త్రిష పడిపోయిందట. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. -
మర్యాద రామన్న సినిమా తర్వాత నా జీవితం...!
-
రాజమౌళితో హిట్ కొట్టిన హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..!
సాధారణంగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం చాలా కష్టమే. కొందరు తక్కువకాలంలోనే స్టార్డమ్ సొంతం చేసుకుంటే మరికొందరేమో మరిన్ని అవకాశాల కోసం వెయిట్ చేస్తారు. ఇండస్ట్రీలోకి అలా వచ్చి ఇలా వెళ్లేవారిని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి వారిలో ముందువరుసలో ఉంటుంది ఆ నటి. దర్శకధీరుడు రాజమౌళితో హిట్ కొట్టిన హీరోయిన్ ఆ తర్వాత కనుమరుగైనపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? మర్యాద రామన్నలో మెప్పించిన సలోని. తాజాగా హైదరాబాద్‌లోని ఓ జువెలరీ ర్యాంప్ షోలో కనిపించింది భామ. ఆమెను చూసిన చాలామంది అభిమానులు మొదట గుర్తు పట్టలేకపోయారు. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినా అంత ఈజీగా మరిచిపోయే గ్లామర్ కాదు. సునీల్‌తో మర్యాద రామన్నలో కనిపించిన నటి ఇప్పుడు చూస్తే షాకవ్వడం ఖాయం. అప్పుడు సన్నగా ఉన్న సలోని ఇప్పుడేమో కాస్త బొద్దుగా కనిపించే సరికి గుర్తుపట్టడం కష్టమైంది. ఈ సినిమాకు ముందు సలోని గురించి ఎవరికీ తెలియదు. అంతుకుముందు ఆమె చేసిన కొన్ని సినిమాలు కూడా ఎప్పుడొచ్చి వెళ్లాయనేది కూడా తెలీదు. సునీల్ హీరోగా నటించిన ఈ సినిమాతో రాజమౌళి హిట్ కొట్టారు. View this post on Instagram A post shared by salloniasvwani🧚♀️😇 (@saloniaswani_official) -
ఈ టాకీకి మూలం... ఆ మూకీ!
ఆ సీన్- ఈ సీన్ ‘అవర్ హాస్పిటాలిటీ’ అనే సినిమా గురించి మామూలుగా అయితే గొప్ప సినీ ప్రేమికులకు తప్ప ఎవరికీ తెలియకపోవచ్చు. అద్భుతమైన హాలీవుడ్ సినిమాలను వెదికి వెదికి చూసే వారికి తప్ప ఈ సినిమా గురించి మరొకరికి అవగాహన లేకపోవచ్చు. ఎందుకంటే అది దాదాపు 90 సంవత్సరాల కిందట వచ్చిన ఒక అమెరికన్ సెలైంట్ సినిమా అది! యూట్యూబ్‌లో నిక్షిప్తం అయినప్పటికీ ఈ సినిమా గురించి తెలుగు వారికి తెలిసే తక్కువ. అయితే ఎప్పుడైతే ‘మర్యాదరామన్న’ సినిమా వచ్చిందో అప్పటినుంచి ‘అవర్ హాస్పిటాలిటీ’ సినిమా తెలుగువారికి బాగా పరిచయం అయింది. సునీల్ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాదరామన్న’ సినిమాలో హాలీవుడ్ సెలైంట్ సినిమా మూలాలున్నాయనే ప్రచారం ‘అవర్ హస్పిటాలిటీ’ సినిమాను చూడాలనే ఆకాంక్షను చాలా మందిలో పెంచింది. మరి ఇలా చూసిన వారు స్టన్ అయ్యేలా ఉంటుంది రాజమౌళి అండ్ కో చేసిన అనుకరణ. బస్టర్ కీటన్ స్వీయదర్శకత్వంలో నటించిన ‘అవర్హాస్పిటాలిటీ’ సినిమాకు రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన ‘మర్యాదరామన్న’కు తేడాలు చెప్పాలంటే... మొదటి మూకీ, రెండోది టాకీ! బాగా ఆలోచించి మరోటి చెప్పమంటే... హాలీవుడ్ సినిమా బ్లాక్అండ్ వైట్, టాలీవుడ్ సినిమా కలర్. కథ, కథనాల్లో పెద్ద తేడాలు లేవు. రెండు సినిమాలనూ చూస్తే తెలుగు వెర్షన్లో కొత్త మలుపులేవీ కనిపించవు. ‘అవర్హాస్పిటాలిటీ’ కథ చెప్పాలంటే... అమెరికా దక్షిణప్రాంతం నుంచి న్యూయార్క్‌కు వలస వచ్చిన కుటుంబానికి చెందిన హీరో తమ పూర్వీకుల ఆస్తుల కోసం స్వగ్రామానికి బయలుదేరతాడు. మార్గమధ్యంలో రైల్లో హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరో వెళ్లాల్సిన ఊరికే చెందిన ఆమె అతడిని తనింటికి తీసుకెళ్లడం, హీరో నేపథ్యం తెలియక హీరోయిన్ తండ్రి అతడికి ఆశ్రయం ఇవ్వడం... తర్వాత శత్రువు అని గుర్తించాక చంపేయాలని నిర్ణయించుకోవడం... ఆ హత్య ఇంట్లో మాత్రం జరగకూడదు, ఎందుకంటే అతిథిని హత్య చేయడం ‘మర్యాద’ కాదని ఇంటి బయట గడపదాటి అడుగుపెట్టాకే చంపడానికి నిర్ణయించుకోవడం... ఈ విషయం తెలిసి హీరో వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం... చివరకు కథ సుఖాంతం కావడం... అంతా ఏ మలుపు లేకుండా మొత్తంగా ‘మర్యాదరామన్న’లో కనిపించేదే! మూలకథను తీసుకొని ఆ పాయింట్‌ను డెవలప్ చేసుకోవడం ఒక ఎత్తు. అయితే ‘మర్యాదరామన్న’ రూపకర్తలు మాత్రం ఎక్కడా మొహమాటపడలేదు. మర్యాదరామన్న... ఆ చిత్రానికి మూలమైన ఇంగ్లిష్ సినిమా ‘అవర్ హాస్పిటాలిటీ’ గడప దాటితే తనను చంపేస్తారని అర్థం చేసుకొన్న హీరో... ఇంట్లోనే మకాం పెట్టడానికి వేసే ఎత్తులన్నీ ‘అవర్హాస్పిటాలిటీ’ మూకీ సినిమాలోనివే! కొత్త ఐడియాలు రాలేదో ఏమో కానీ... దేన్నీ వదలకుండా అన్నింటినీ వాడేసుకొన్నారు. అయితేనేం... ‘మర్యాద రామన్న’ పెద్ద హిట్. తెలుగు వరకూ ఈ సినిమా ఒక సంచలనం. హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రూపొందించినదనే ప్రచారం ఈ సినిమా స్థాయిని ఏమీ తగ్గించదు. రాజమౌళి దర్శకత్వ శైలి అసలు కథను చక్కటి సినిమాగా మార్చింది. తెలుగులో ఈ సినిమా హిట్ అయిన తర్వాత కన్నడ మొదలు తమిళ, హిందీ, బెంగాళీ, మలయాళ భాషల్లో ఈ సినిమా రీమేక్ అయింది. హిందీలో తప్ప అన్ని చోట్లా హిట్ అయింది. అయితే ఎక్కడకు వెళ్లినా ‘ఈ సినిమా కాపీ అనీ, హాలీవుడ్ మూకీ సినిమాను కాపీ కొట్టి ఈ సినిమాను రూపొందించారని’ విమర్శకుల కామెంట్ కామన్‌గానే వినిపించింది. పీఎస్: ‘మర్యాదరామన్న’ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే ఇది ఒక ‘మారుమూల’ కథ అని వేస్తారు. మరి ఆ మారుమూల కథ క్రెడిట్‌ను దాన్ని రాసిన వారికే ఇచ్చేస్తే మరింత గౌరవంగా ఉండేదేమో! - బి.జీవన్ రెడ్డి -
ప్రత్యేక పాటలో...
రాజమౌళి ‘మర్యాద రామన్న’లో తెలుగు అమ్మాయిగా అందరినీ ఆకట్టుకున్న సలోని కొంత విరామం తర్వాత తెలుగు తెరపై కనిపించనున్నారు. సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని ముఖ్య తారలుగా కళానిలయ క్రియేషన్స్ పతాకంపై బి. రమేశ్ నిర్మించిన చిత్రంలో ఆమె ఓ ప్రత్యేక పాటకు కాలు కదిపారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ వర్మ దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘‘థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. త్వరలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. -
అలా సెట్ అయింది
మర్యాదరామన్న సినిమా గుర్తుందా.. ? ప్రాణరక్షణ కోసం అందులో హీరో గడప దాటని ఇల్లు గుర్తొచ్చిందా..! రాయలసీమ ఠీవి అణువణువూ కనిపించే ఆ ఇల్లు ఒక్క మర్యాదరామన్న సినిమాలోనే కాదు.. ఆపై ఎన్నో సినిమాల్లో మరెన్నో యాంగిల్స్‌లో కనిపించింది. మర్యాదరామన్న స్టోరీలైన్లా.. ఆ ఇంటి సెట్ వేసి ఏళ్లవుతున్నా.. సినీజనాలు నిత్యం ఆ గడప తొక్కుతూనే ఉన్నారు. మర్యాదగా షూటింగ్ చేసుకుంటున్నారు. పావు ఎకరం లోగిలిలో నిండుగా కనిపిస్తూ పల్లె వాతావరణాన్ని గుర్తుతెచ్చే విధంగా నిర్మించిన ఆ సెట్‌కు పేటెంట్ సంపాదించి అందరి మన్ననలు పొందారు ఆర్ట్ డెరైక్టర్ ఎస్.రవీంద్రారెడ్డి. సెట్ ఏమిటి..? పేటెంట్ ఏమిటి..? అని ఆశ్చర్యపోతున్నారా..! కొత్తరకం కెమికల్స్ వాడి చెక్కు చెదరని ఇంటి సెట్ వేసిన మొదటి కళాదర్శకుడిగా గుర్తింపు పొందిన రవీంద్రారెడ్డి చేసిన మ్యాజిక్ గురించి వివరంగా.. - భువనేశ్వరి నగర శివార్లలో ఉన్న కోకాపేటకు వెళ్లి.. ఇక్కడ మర్యాదరామన్న ఇల్లు ఎక్కడని ఎవర్ని అడిగినా.. ఆ సెట్‌కు రూట్ చెబుతారు. ఆ రూట్లో వెళ్లి చూస్తే.. ఆ మండువా లోగిలి మీకు కనిపిస్తుంది. మర్యాదరామన్న కథ ప్రకారం.. అందమైన ఇల్లొకటి కావాలి. ఆ ఇల్లు, ఇంటి పరిసరాలు అన్నీ అనంతపురంలోని పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించాలి. తలుపులు, దూలాలు, వాసాలు, మెట్లు అన్నీ ఒరిజినల్‌గా కనిపించాలి. దానికోసం రవీంద్రారెడ్డి పెద్ద కసరత్తే చేశారు. రెండువందల పేజీల పేపర్ వర్క్, 300 మంది పనివాళ్లతో రెండు నెలలు శ్రమిస్తే ఆ సెట్ కుదిరింది. అందుకే మర్యాదరామన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ ఇల్లు కూడా అంత పెద్ద హిట్ అయింది. ఆ సినిమా తర్వాత కూడా ఈ సెట్‌కు పాపులారిటీ తగ్గలేదు. ఈ ఇంటిలో ఇప్పటి వరకూ దాదాపు 600 సినిమాలకు పైగా షూటింగ్ చేసుకున్నాయి. పేటెంట్ ఏమిటి? ఒక సీన్ కోసం.. ఒక పాట కోసం.. వేసే భారీ సెట్టింగులు సైతం.. పని అయిపోయాక పీకేస్తారు. మరీ భారీ సెట్టింగ్‌లు అయితే రెండు మూడు సినిమాలకు వాడుకుంటారు. మర్యాదరామన్న సెట్ ఇందుకు భిన్నమైంది. మామూలు సెట్‌లా కాకుండా దీన్ని వేసేటప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు రవీంద్రారెడ్డి. రెండు టన్నుల బరువుండే అకెలా క్రేన్స్ కూడా ఈ ఇంటి రెండో అంతస్తులోకి తీసుకెళ్లి షూటింగ్ చేయొచ్చు. అంత ధృడంగా దీన్ని వేశారు. ‘ఇలాంటి సెట్ వేయడం మన దగ్గర మొదటి ప్రయోగం. మామూలుగా సెట్ల నిర్మాణానికి వాడే ఫ్లైవుడ్నే నేనూ వాడాను. కాకపోతే వాటిని అతికించడానికి కొత్తరకం మెటీరియల్ వాడాను. దాన్ని తయారు చేసిందీ నేనే. లేటెక్స్, ఇసుక, ఫెవికాల్‌కు తోడు కొన్ని రకాల కెమికల్స్ కలిపి తయారు చేసిన ఆ మెటీరియల్ నేను ఊహించిన దానికంటే మంచి ఫలితాన్ని ఇచ్చింది. మిగతా వస్తువుల తయారీలో కూడా నా బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోగలిగాను. ఇంటి సెట్ క్వాలిటీని చూసిన చాలా మంది పేటెంట్ కోసం అప్లయ్ చేయమని చెప్పారు. దాంతో అన్ని వివరాలతో చెన్నైకి చెందిన పేటెంట్ కంపెనీకి అప్లికేషన్ పంపాను. వాళ్లు ఆరునెలలు ఈ ఇంటికి సంబంధించిన పరిశోధన జరిపారు. మన దేశంలోనే కాదు.. ఇంకెక్కడా కూడా ఇంత నాణ్యమైన ఇంటిసెట్ లేదని, నేను వాడిన మెటీరియల్ యూనిక్ అని గుర్తించి నాకు పేటెంట్ హక్కుల్ని కల్పించారు’ అని చెప్పారు రవీంద్రారెడ్డి. మెటీరియల్ చుట్టూ పొలాలు.. ‘మర్యాదరామన్న చిత్రంలో పొలాల్లో కనిపించే సీన్ల కోసం ఆ ఇంటిపక్కనే రెండు ఎకరాల్లో జొన్నపంట పండించి మరీ షూటింగ్ చేశారు రాజమౌళి. ఆ సీన్లలో ఈ ఇంటి నీడైనా కనిపించకపోవడం జక్కన్న పనితనానికి మచ్చుతునక. కథ చెప్పి పక్కకు తప్పుకుంటారు. ఆర్ట్ విషయంలో అసలు కల్పించుకునేవారు కాదు. నిర్మాత సహకారం కూడా మరువలేనిది. ఇంటి సెట్ ఒకెత్తయితే.. ఆ ఇంట్లో కనిపించే వస్తువులు మరోఎత్తు. ఊయల నుంచి వంటింటి సామాన్ల వరకూ అన్నిట్లో ఆ తరం నేటివిటీ కనిపించేలా డిజైన్ చేశాను. ఇవన్నీ ప్లైవుడ్, థర్మాకోల్, ఫైబర్ వాడి తయారు చేశాను. చివరికి పశువుల కొట్టంలో కనిపించే నీళ్ల తొట్టెలతో సహా. కథకు జీవం పోసిన ఆ సెట్‌ని ఆ తర్వాత కొన్ని వందల సినిమాలకు వాడడం, ఇప్పటికీ మర్యాదరామన్న ఇంటి సెట్ అనే పదం వాడడం.. వింటుంటే గర్వంగా అనిపిస్తుంది’ అంటూ చిరునవ్వుతో చెప్పారు రవీంద్రారెడ్డి. కొన్ని వందల సినిమాలు... గబ్బర్‌సింగ్‌లో విలన్ ఇల్లు, బృందావనంలో శ్రీహరి ఇల్లు, కందిరీగ, పూలరంగడు, మిర్చి.. ఇలా చాలా సినిమాల షూటింగులు ఆ ఇంట్లోనే జరిగాయి. తమిళ విక్రమార్కుడు కూడా ఇక్కడే షూట్ చేశారు. నాలుగేళ్లలో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు ఆరువందల సినిమాల చిత్రీకరణ జరిగిన ఆ ఇంట్లో ప్రస్తుతం తెలుగులో ఓ టాప్‌హీరో షూటింగ్ జరుగుతోంది. దానికి కూడా రవీంద్రారెడ్డి ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ ఇంటిని చిన్న చిన్న మార్పులు చేసి వాడుకుంటే ఈసారి రవీంద్రా ఇంటి రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. తమిళ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథనం కోసం ఆ ఇంటికి ద్రవిడ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఎంట్రన్స్ లుక్ కూడా మారిపోయింది. రిచ్ అండ్ లేటెస్ట్గా కనిపించేలా కలర్ఫుల్గా తీర్చిదిద్దారు. అదీ సెట్టే.. ‘మర్యాదరామన్న సినిమాలోనే ట్రైన్ జర్నీ సీన్ చూశారుగా.. ఆ ట్రైన్ కూడా సెట్టే. ఈ ఇంటి పక్కనే రెండు బోగీలు సెట్ వేసి.. ట్రైన్ సీన్‌ను లాగించేశారు. రాయలసీమలో కనిపించే నేటివిటీని చూపిన ఆ సెట్ తర్వాత ఓ ట్రెండ్‌ని సెట్ చేసింది. ఈగ మూవీలో ఇల్లు, అత్తారింటికి దారేది, జులాయి.. ఇలా మిగితా సినిమాల్లో ఇళ్ల సెట్లనూ ఆ దృష్టితో వేసినవే’ అంటూ ముగించారు.