mass murders
-
ప్రియురాలిని ఇంటికి తెచ్చి.. ఆపై ఇంట్లోవాళ్లని హతమార్చి!
కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలి మీద దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. అతని తల్లి, ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తిరువనంతపురం సమీపంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. వెంజరమూడు(Venjaramoodu) పీఎస్‌కు సోమవారం సాయంత్రం ఓ యువకుడు వచ్చాడు. తాను తన కుటుంబ సభ్యులను చంపినట్లు చెబుతూ పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. అది నిజమేనని తేలడంతో షాక్‌కి గురయ్యారు. ఈలోపు ఆ యువకుడు తనతో తెచ్చుకున్న ఎలుకల మందు తాగి పీఎస్‌లోనే పడిపోయాడు. దీంతో.. అతన్ని చికిత్స కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.పెర్ములాలో నివాసం ఉంటున్న అఫన్(Afan).. స్థానికంగా బీఎస్సీ చదివే ఫర్సనాతో ప్రేమలో ఉన్నాడు. వాళ్ల ప్రేమకు ఫర్సనా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట ఆమెను అఫన్ తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఏం జరిగిందో తెలియదు.. సోమవారం తన ఇంట్లో తల్లి షమీ, సోదరుడు అఫ్సన్(13), ఫర్సనాపై దాడి చేశాడు. అక్కడి నుంచి బైక్ మీద ఎన్ఎన్ పురంలో ఉన్న మేనమామ లతీఫ్(69) ఇంటికి వెళ్లి ఆయన్ని, ఆయన భార్య షాహిదా(59)ను హతమార్చాడు. అక్కడి నుంచి పాంగోడ్లో ఉన్న బామ్మ సల్మా బీవీ దగ్గరకు వెళ్లి ఆమెను కూడా చంపేశాడు. 16 కిలోమీటర్ల పరిధిలోనే ఈ దారుణాలకు తెగబడ్డాడు. ఆపై నేరుగా పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అఫన్.. పక్కన దాడి కోసం బైక్‌పై వెళ్తు క్రమంలో రికార్డైన దృశ్యంఅఫన్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తల్లి షమీ, ప్రియురాలు ఫర్సనా తీవ్ర గాయాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లిద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మరోవైపు.. ఆత్మహత్యాయత్నం చేసిన అఫన్ ఆస్పత్రిలోనూ హల్చల్ చేశాడు. ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగి చికిత్సకు నిరాకరించాడు. దీంతో.. పోలీసుల సాయంతో బేడీలు వేయించి మరి బలవంతంగా అతనికి చికిత్స అందించారు.అఫన్కు డ్రగ్స్ అలవాటు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మత్తులోనే అఫన్ ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. తిరువనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. మరోవైపు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని, మంగళవారం అఫన్ను విచారణ జరుపుతామని వెంజరమూడు పోలీసులు చెబుతున్నారు. -
కత్తులతో మారణకాండ.. 10మంది మృతి.. 15మందికి గాయాలు
ఒట్టావా: కెనడాలో ఇద్దరు దుండగులు కత్తులలో రెచ్చిపోయారు. సంప్రదాయ తెగలు నివసించే ప్రాంతాలే లక్ష్యంగా విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. కన్పించిన వారినళ్లా పొడుచుకుంటూ వెళ్లారు. మొత్తం రెండు ప్రాంతాల్లో 13 చోట్ల విధ్వంసం సృష్టించారు. ఈ మారణకాండలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. కెనడా చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి దారుణ ఘటన జరగలేదు. అమెరికాలో మాత్రమే తరచూ మాస్ షూటింగ్‌లు, హత్యలు జరగుతుంటాయి. ఈ ఘటనపై కెనడా ప్రధాని ట్రుడో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన హృదయం ముక్కలైందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఇద్దరు నిందుతులు డెమియన్ సాండర్సన్(31), మైల్స్ సాండర్సన్(30) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. వీరి ఫోటోలను కూడా విడుల చేశారు. అయితే నిందితులు ఏ కారణంతో దాడి చేసి ఉంటారనే విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. మృతులంతా జేమ్స్ స్మిత్ క్రీ నేషన్, వెల్డన్ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. జేమ్స్ స్మిత్ క్రీ నేషన్‌లో 3,400 మంది మాత్రమే నివసిస్తారు. వ్యవసాయం, వేట, చేపలు పట్టడమే వీరి వృత్తి. వెల్డన్‌లో 200మంది మాత్రమే జీవిస్తారు. ఈ ప్రాంతాల్లో ఎవరినో లక్ష్యంగా చేసుకునే దుండృగులు ఈ కిరాతక చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. చదవండి: మనం మళ్లీ పిల్లల్లా మారిపోతే! శాస్త్రవేత్తల అధునాతన ప్రయోగం -
ఖ్మేర్ రోజ్ నేతలకు జీవితఖైదు
ఫనోమ్ పెన్హ్: కాంబోడియాలో 1975–79 కాలంలో పోల్‌పాట్ నేతృత్వంలో జరిగిన ఖ్మేర్ రోజ్ సామూహిక హత్యాకాండకు సంబంధించి నాడు అధికారంలో ఉన్న ఇద్దరు కీలక నేతలకు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. నాటి ప్రధాని పోల్‌పాట్ నేతృత్వంలోని ఖ్మేర్ రోజ్ పార్టీ అనేక దారుణాలకు ఒడిగట్టింది. నాటి దేశ జనాభాలో దాదాపు పాతిక శాతం (20 లక్షలు) మందిని చంపేసింది. కార్మికుల చేత విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల కొందరు, ఆకలికి తాళలేక మరికొందరు మరణించగా ప్రభుత్వం ఉరిశిక్షలు విధించి మరికొంత మందిని పొట్టనబెట్టుకుంది. నాడు ప్రభుత్వ దారుణాలకు సూత్రధారులుగా, కీలక పదవుల్లో ఉన్న ఖీయూ సంఫన్ (87)కు, నువోన్ చియా (92)కు ప్రస్తుతం కోర్టు శిక్షలు విధించింది. -
శవాలను ఒకదానిపై ఒకటి పేర్చి...
సాక్షి, తిరువనంతపురం: కనిపించకుండా పోయిన ఓ కుటుంబం దారుణంగా హత్యకు గురైన ఘటన కేరళలో కలకలం రేపింది. ఇడుక్కి జిల్లా తోడోపుజా గ్రామానికి చెందిన కృష్ణన్, అతని భార్య ఇద్దరు పిల్లలు గత నాలుగు రోజులుగా అదృశ్యమైనట్లు బంధువులు ఫిర్యాదు చేశారు. వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు ఇంటి పెరట్లోనే వారి మృతదేహాలను వెలికి తీశారు. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నాలుగు రోజులుగా ఆ కుటుంబం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఇంట్లోకి వెళ్లిన బంధువులు ఇంటి గోడలకు రక్తపు మరకలు ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డాగ్ స్క్వాడ్ సాయం తీసుకోగా.. అవి పెరట్లోని ఓ గుంత వద్ద ఆగిపోయాయి. అక్కడ తవ్వి చూసిన పోలీసులు నాలుగు మృత దేహాలు ఒకదానిపై ఒకటి పేర్చి ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. మృతులను కృష్ణన్(56), సుశీల(52), ఆర్ష(21), అర్జున్(19) గా గుర్తించారు. ఇంట్లో ఓ సుత్తి, కత్తికి రక్తపు మరకలు ఉండటంతో వారిని వాటితోనే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంటిపై గాయాల ఆధారంగా వారిని కిరాతకంగా హత్య చేశారని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణన్‌కు భూత వైద్యుడిగా, జ్యోతిష్యుడిగా ఆ ప్రాంతంలో పేరుంది. పలువురు ప్రముఖులు కూడా అతన్ని కలుస్తుంటారని తెలుస్తోంది. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపే ఆ కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కల వారితో కూడా కలివిడిగా ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. చేతబడి, కోణంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొట్టాయం మెడికల్ కాలేజీకి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తరలించిన పోలీసులు.. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కేసును త్వరగా చేధిస్తామని అంటున్నారు. బురారీ కేసు; ఊహించని ట్విస్ట్ -
ఇల్లిల్లూ గాలిస్తూ గ్యాంగ్ రేప్‌లు, హత్యలు
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలకు, హింసకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ఉత్తర కుండజ్ ప్రావిన్స్‌లో పౌరులపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతూ.. కిరాతకంగా చంపేస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. ఆఫ్థాన్ దళాలు కుండజ్ ప్రావిన్స్‌లోని ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిశోధకుడు హోరియా మొసాధిక్ కోరారు. 'కుండజ్లో తాలిబన్ ఉగ్రవాదులు నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ, ఇతర ప్రభుత్వ, ఎన్జీవో ఆఫీసులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రత దళాలు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, ఎన్జీవో కార్యకర్తలు పేర్లు, ఫొటోలతో కూడిన హిట్ లిస్ట్‌ను తయారు చేశారు. వారి అడ్రెస్లు, ఫోన్ నెంబర్లూ సేకరించారు. ఉగ్రవాదులు యువకుల సాయంతో ఇంటింటికి వెళ్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇళ్లలో ఉన్న మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతూ, పిల్లలతో సహా కుటుంబ సభ్యులను కిరాతకంగా చంపేస్తున్నారు. బాధితుల్లో సైనికులు, పోలీసులు ఉన్నారు. ఇళ్లల్లో దోపిడీకి పాల్పడుతూ కుటుంబాలను హతమారుస్తున్నారు' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తాలిబన్ల దారుణాలను వెల్లడించింది. తాలిబన్ల ఉగ్రవాదుల అరాచకాలను కుండజ్ మెటర్నిటీ ఆస్పత్రిలో బాధితులు ఏకరువుపెట్టారు. ఉగ్రవాదులు తమ వద్ద బందీలుగా ఉన్న మగవాళ్లకు తుపాకీలు ఇచ్చి భద్రతదళాలపై దాడికి ప్రేరేపించడం, మహిళలను చిత్రహింసలు పెడుతూ సామూహిక అత్యాచారాలకు పాల్పడటం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.