massive attack
-
మాసివ్ హార్ట్ఎటాక్తోనే కుప్పకూలిన తారకరత్న!
సాక్షి, చిత్తూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు కుప్పం పీఈఏస్ మెడికల్ కాలేజీలో చికిత్స అందుతుండగా.. బెంగళూరు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శుక్రవారం కుప్పంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మొదలు సందర్భంగా.. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు. ‘తారకరత్నకు స్టంట్లు వేయలేదు. యాంజియోగ్రామ్ మాత్రమే పూర్తైంది. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కోలుకున్న తర్వాత స్టంట్స్ వేస్తారా?.. ఇతర ట్రీట్మెంట్లు అందిస్తారా? అనేది వేచిచూడాలి. తారకరత్నకు భారీగా గుండెపోటు వచ్చిందని, అయితే ఆస్పత్రిలో వైద్యులు 40 నిమిషాలపాటు తీవ్రంగా ప్రయత్నించడంతో పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారాయన. బాలకృష్ణ రాకతో ఆయన రికవరీ కావడం ఆశ్చర్యంగా ఉందని, బాలకృష్ణే దగ్గరుండి చూసుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తారకరత్నకు ప్రాణాపాయం తప్పిందని భావనలో ఉన్నామని బుచ్చయ్యచౌదరి చెప్పారు. అవసరమైతేనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు ఎయిర్‌లిఫ్ట్ చేస్తారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని వెల్లడించారు. నందమూరి అభిమానులు ఆందోళన చెందవద్దని, తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఇక పరిస్థితిపై సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ లెఫ్ట్ సైడ్ వచ్చిందని తెలిపారు. ఎడమ వైపు 90 శాతం బ్లాక్ అయ్యింది. అయితే మిగతా రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయని బాలకృష్ణ వెల్లడించారు. డాక్టర్ల పర్యవేక్షణలో పరిస్థితి మెరుగవుతోందని, వైద్యులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయినప్పటికీ బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి పాజిటివ్‌గానే ఉందని, దేవుడి దయతో పాటు కుటుంబం సభ్యుల ప్రార్థనతో అతని ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల చేయడంతో.. ఆయన మండిపడ్డారు. అంతకు ముందు.. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటారని భావిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తారకరత్నను గ్రీన్‌ఛానల్ ద్వారా కుప్పం ఈపీఎస్ ఆస్పత్రి నుంచి బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. -
కశ్మీర్‌పై ఉగ్రదాడికి కుట్ర..!
శ్రీనగర్: కశ్మీర్లో ఈద్ పండుగ సంబరాలపై లేదా స్వాతంత్య్ర దినోత్సవాలపై భారీ దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారనీ, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఏడుగురు ఉగ్రవాదుల బృందం భారత్‌లోకి ప్రవేశించిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత ప్రభుత్వంపై నిందను మోపేందుకు మసీదుల్లో ప్రార్థనలపై ఈ దాడులు జరగొచ్చని తెలిపాయి. ప్రపంచ ఉగ్రవాదిగా ముద్రపడ్డ మసూర్ అజార్ ఈ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు. ఉగ్రవాద దాడి జరిపి వీలైనంత ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) జైషే మహ్మద్‌కు సూచించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ కేంద్రం సరిగ్గా వారం క్రితం సంచలన, చారిత్రక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. మరోవైపు ఆదివారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ, కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందనీ, సైనిక బలగంతో స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయలేరని పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయంగా పాక్‌కు ముస్లిం దేశాలు సహా ఏ ఒక్కరూ మద్దతు తెలపకపోవడంతో, తాజాగా ఉగ్రవాద దాడికి దిగి, భారత్‌కు చెడ్డపేరు తీసుకురావాలని అనుకుంటోందని నిఘా వర్గాలు తెలిపాయి. బనిహల్, పిర్ పంజాల్ పర్వతాల దక్షిణ భాగం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారనీ, రాజౌరీ లేదా పూంచ్ జిల్లాల్లోకి వాళ్లు చొరబడి ఉంటారని చెప్పాయి. వ్యాపారులకు వెయ్యి కోట్ల నష్టం.. శ్రీనగర్‌లో ఆంక్షల కారణంగా వారం రోజుల్లో వ్యాపారులు రూ. వెయ్యి కోట్లు నష్టపోయుంటారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆంక్షల కారణంగా ప్రజలెవ్వరూ బటయకు రాకపోవడంతో రోజుకు రూ. 175 కోట్ల నష్టం వచ్చిందని కశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యుడొకరు చెప్పారు. పండుగ నేపథ్యంలో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. బ్యాంకులు, ఏటీఎంలు, కొన్ని మార్కెట్లు ఆదివారం తెరిచే ఉన్నాయి. -
భారత్ ప్రతీకార దాడి, పాక్ జవాన్లు హతం
న్యూఢిల్లీ: ఓ భారత జవాను తల నరికి, మరో ఇద్దరు జవాన్లను కాల్చి చంపడంతో భారత భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ పోస్టులపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 12మంది పాకిస్తాన్ జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది. భారత్ దాడులతో ఒక్కసారిగా షాక్ కు గురైన పాకిస్తాన్ మిలటరి ఇరు దేశాల కమాండర్లు సంప్రదింపులు జరపాలని కోరింది. బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర మధ్య ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ మిలటరీ పోస్టులపై దాడులు చేశాయి. మెషీన్ గన్స్, 120ఎంఎం హెవీ మోటార్లతో పాక్ పోస్టులను తునాతునకలు చేశాయి. దీంతో కంగుతిన్న పాక్ ఆర్మీ సంప్రదింపులు జరపాలని కోరింది. అయితే ఈ సంప్రదింపులు ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. లెఫ్టినెంట్ జనరల్ రణ్ బీర్ సింగ్ తో మాజ్ జనరల్ సహీర్ షంషాద్ మీర్జా మాట్లాడినట్లు భారత్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత దళాలు జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్ పౌరులు ప్రయాణిస్తున్న ఓ బస్సుకు మంటలు అంటుకున్నట్లు మీర్జా పేర్కొన్నారని తెలిపింది. మీర్జా వ్యాఖ్యలకు స్పందించిన సింగ్.. భారత్ పై తరచూ కాల్పులకు పాల్పడుతున్న పాకిస్తాన్ పోస్టులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నట్లు సమాధానం ఇచ్చారని చెప్పింది. పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్ లో చొరబాటుకు సాయం చేస్తున్నారని ఆరోపించినట్లు పేర్కొంది. ప్రతి మంగళవారం భారత్-పాకిస్తాన్ ఆర్మీ అధికారుల మధ్య సంభాషణలు జరుగుతున్నాయి. పెద్ద స్ధాయిలో కాకపోయినా అప్పటి పరిస్ధితిని బట్టి చర్చలు జరిపే అధికారులు స్ధాయి మారుతోంది. బుధవారం కాల్పులపై స్పందించిన పాకిస్తాన్ హై కమిషన్ భారతీయ డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ వరుసగా మూడో రోజు సమన్లు జారీ చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి ఉద్రిక్తలు లేకపోయినా భారతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సర్తాజ్ అజీజ్ అమృత్ సర్ జరగబోయే హార్ట్ ఆఫ్ ఏసియా సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిసింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించనున్నారు. ఆప్ఘనిస్తాన్ లో శాంతి, భద్రతల స్ధాపనపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో 40 దేశాల పత్రినిధులు పాల్గొంటారు.