Matrimonial Website
-
ఐయామ్ వరుణ్ రావ్ ఫ్రమ్ యూఎస్ఏ.. త్వరలో పెళ్లి చేసుకొని కోట్లు సంపాదిద్దాం
సాక్షి, హైదరాబాద్(హిమాయత్‌నగర్): అమెరికాలో ఉన్నత ఉద్యోగం, ఇద్దరం కలసి త్వరలో ఒక్కటై కోట్లు సంపాదించవచ్చు. నేను ఇండియా వచ్చే వరకు ఆలస్యం అవుతున్న కారంగా నీకొక గిఫ్ట్ పంపుతున్నా తీసుకో అంటూ..మరుసటి రోజు నుంచి కస్టమ్స్ పేరుతో లక్షల రూపాయిలు లూటీ చేసిన నైజీరియన్ కటకటాలపాలైయ్యాడు. అతగాడి నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, 8 మొబైల్ ఫోన్లు, పది సిమ్‌కార్డులు, రెండు డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు. ఎస్సార్‌నగర్‌కు చెందిన యువతి కొద్దిరోజు క్రితం పెళ్లికోసం తన ప్రొఫైల్‌ను ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈమె ప్రొఫైల్ చూసిన నైజీరియన్ యూఎస్ఏలో సివిల్ ఇంజనీర్‌గా చేస్తున్నానని తన పేరు వరుణ్రావుగా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. గంటలకొద్దీ ఫోన్లలో మాట్లాడుకున్నారు. తాను యూఎస్ఏ నుంచి ఇండియాకు వచ్చే లోపు ఆసల్యం అవుతున్న కారణంగా ముందుగా బంగారు ఆభరణాలు, యూఎస్ డాలర్స్, ఖరీదైన ఫోన్లను గిఫ్ట్ రూపంలో పంపుతున్నాను తీసుకోమన్నాడు. మరుసటి రోజే స్టార్ట్ అయ్యింది ఢిల్లీలోని కస్టమ్స్ అధికారులమంటూ యువతికి వల వేశారు. మీకు రావాల్సిన గిఫ్టŠస్కి మీరు కొంత డబ్బు చెల్లించాలన్నారు. దీంతో యువతి పలు దఫాలుగా రూ. 18 లక్షలు చెల్లించి మోసపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ వెంకట్రామిరెడ్డి బృందం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడాలో బట్టల వ్యాపారం చేస్తున్న నైజీరియన్ అములోన్యే ప్రిన్స్ ఫ్లెక్స్(50)ను అరెస్ట్ చేశారు. ఇతగాడిని విచారించగా.. గతంలో అనేకమందికి ఇలా వల వేసి లక్షలాది రూపాయిలు దోచుకున్నట్లు ఒప్పుకున్నాడు. 2012లో నైజీరియన్ నుంచి ఢిల్లీకి వచ్చిన అములోన్యే ప్రిన్స్ ఫ్లెక్స్ వీసా గడువు ముగిసినాక కూడా ఇక్కడే ఉంటూ..ఈ విధమైన నేరాలకు పాల్పడుతున్నణట్లు నిర్థారణ అయ్యింది. ఈ విధమైన మోసాల్లో నగరవాసులు చిక్కుకోవద్దంటూ సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ సూచించారు. -
అమెరికా వెళ్లాకే పెళ్లి ...22 లక్షలకు టోకరా
సాక్షి, సిటీబ్యూరో: మాట్రిమోనియల్ సైట్స్ ద్వారా పెళ్లి పేరుతో యువకులకు ఎర వేసి మోసాలకు పాల్పడుతున్న వంశీకృష్ణపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలోనూ కేసు నమోదైంది. ఇతగాడిని మూడు రోజుల క్రితం ఇలాంటి కేసులోనే రాచకొండ అధికారులు పట్టుకున్నారు. ఇతడి వలలో పడి రూ.21.74 లక్షలు కోల్పోయిన సికింద్రాబాద్ యువతి ఫిర్యాదు మేరకు బుధవారం నగరంలో కేసు నమోదు చేశారు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన యువతి తన ప్రొఫైల్‌ను షాదీ.కామ్‌లో పొందుపరిచారు. దీన్ని లైక్ చేసిన పొట్లూరి బాల వంశీకృష్ణ అనే ప్రొఫైల్ కలిగిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు చాటింగ్ తర్వాత పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. అయితే తాను అమెరికా వెళ్లిన తర్వాతే పెళ్లని నమ్మించాడు. వీసా కోసం రూ.20 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ లేదా డిపాజిట్ అవసరమని యువతితో చెప్పాడు. దీంతోపాటు కొన్ని ఖర్చుల కోసమంటూ బాధితురాలి నుంచి రూ.21.74 లక్షలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకుని మోసం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీని పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. చదవండి : OnlinePaymentFraud: టీవీ రీచార్జ్, ఘరానా మోసం Chandan Mitra: కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం -
పెళ్లంటూ ఎర... గిఫ్టంటూ టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ యువతిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయమైన నేరగాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆపై బహుమతి పంపిస్తున్నానంటూ చెప్పి కస్టమ్స్ అధికారులుగా ఫోన్లు చేసి రూ.10.69 లక్షలు కాజేశాడు. బాధితురాలు శుక్రవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ►సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి (25) మేకప్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఈమెకు కొన్ని నెలల క్రితం భారత్‌మాట్రిమోనీ సైట్ ద్వారా రాజీవ్ మలిన్ అని చెప్పుకున్న వ్యక్తి పరిచయమయ్యాడు. ►తాను లండన్‌లో ఉంటున్న ప్రవాస భారతీయుడినని, అక్కడి వీట్స్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల పాటు వీరి మధ్య చాటింగ్ నడిచింది. ►ఈ యువతితో పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చిన రాజీవ్... బెంగళూరులో స్థిరపడదామని ఆశపెట్టాడు. తాను త్వరలో కెనడా వెళ్తున్నానని, అట్నుంచి ఇండియా వచ్చి నీతో పాటు కుటుంబసభ్యులను కలుస్తానన్నాడు. (ప్రేమ పేరుతో మాయమాటలు.. పలుమార్లు అత్యాచారం) ►ఇదంతా ఈ ఏడాది మార్చి మొదటి వారంలో జరిగింది. ఓ రోజు నీకో గిఫ్ట్ పంపిస్తున్నానంటూ రాజీవ్ నుంచి నగర యువతికి సందేశం అందింది. లండన్ నుంచే దాన్ని పార్శిల్ చేసినట్లు అందులో ఉంది. ►ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారుల పేరుతో యువతికి ఫోన్ వచ్చింది. దానిని క్లియర్ చెయ్యాలంటే వివిధ రకాలైన పన్నులు కట్టాల్సి ఉందంటూ చెప్పారు. దీనికి యువతి అంగీకరించడంతో తొలుత కేవలం రూ.27 వేలు చెల్లించమన్నారు. ఆ మొత్తాన్ని బాధితురాలు ఆన్లైన్లో బదిలీ చేసింది. ►ఈ ఏడాది మార్చి 9న ఈ చెల్లింపు జరగ్గా... కేవలం నాలుగు రోజుల్లో 12 లావాదేవీలు ఈమెతో చేయించారు. ఇలా పన్నుల పేరుతో రూ.10.69 లక్షలు కాజేశారు. మోసపోయాననే విషయం తెలుసుకున్న యువతి శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇది నైజీరీయన్ల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. -
షాదీ. కామ్‌లో ఇకపై ఆ ఆప్షన్ ఉండదు
ప్రముఖ మ్యాట్రియమోనియల్ వెబ్సైట్ షాదీ. కామ్ తన వెబ్సైట్ నుంచి కలర్ ఫిల్టర్‌ను తొలిగించింది. స్కిన్‌టోన్ ఆధారంగా భాగస్వామిని ఎంపిక చేసుకునే ఆప్షన్‌పై ఆన్లైన్లో పిటిషన్ దాఖలవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కావాలని చేసింది కాదని ఏదో పొరపాటు జరిగిందని సదరు వెబ్సైట్ వివరణ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జాత్యాంహకారంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షాదీ.కామ్ వెబ్‌సైట్‌పై వివాదం చర్చనీయాంశమైంది. దీని ప్రకారం భాగస్వామిని ఎంపిక చేసుకునేముందు సదరు వ్యక్తి వాళ్ల చర్మరంగు ఏదో సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫెయిర్, వైటీష్, డార్క్ వంటి ఆప్షన్లుంటాయి. తద్వారా స్కిన్‌టోన్ ఆధారంగా వారికి తగ్గ జోడీలు దర్శనమిస్తాయన్నమాట. దీంతో ఈ అంశంపై వివాదం తలెత్తింది. దీనికి సంబంధించి లఖాని అనే మహిళ ఆన్లైన్లో సదరు వెబ్‌సైట్‌పై పిటిషన్ దాఖలుచేసింది. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని రంగు ఆధారంగా భాగస్వామిని ఎలా సెలక్ట్ చేస్తారంటూ మండిపడింది. అంతేకాకుండా ఈ ఫిల్టర్‌ను వెబ్సైట్ నుంచి శాశ్వతంగా తొలిగించాలని డిమాండ్ చేసింది. లఖానీ దాఖలు చేసిన పిటిషన్‌పై దాదాపు 1600కి పైగానే ప్రజలు సంతకాలు చేసి తమ మద్దతు ప్రకటించారు. (మహిళ ఉద్యోగిపై దాడి.. కఠిన చర్యలు తీసుకోండి ) -
పెళ్లి పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని..
సాక్షి, కర్ణాటక : మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో పరిచయమైన యువతి ఓ టెక్కీని నిలువునా మోసగించింది. ఆమె తీయని మాటలకు పడిపోయి దాదాపు రూ. 16 లక్షలకు పైగా నగదు సమర్పించుకున్నాడు. వివరాలు...నగరానికి చెందిన అంకుర్ శర్మ నగరంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్కీగా విధులు నిర్వహిస్తున్నాడు. అంకుర్ శర్మకు మెట్రిమోనియల్ ద్వారా కిరారా శర్మ అనే యువతి పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొంతకాలం అనంతరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తరచూ ఫోన్లలో మాట్లాడుకోవడం చేశారు. ఈ సమయంలో సదరు యువతి పలు కారణాలు చూపి అంకుర్ వద్ద రూ. 16.82 లక్షల నగదు తీసుకుంది. అనంతరం యువతి అంకుర్‌కు దూరం కావడం మొదలుపెట్టింది. సదరు యువతి వివాహానికి ఒప్పుకోకపోగా డబ్బు కూడా ఇవ్వలేదు. దీంతో బాధితుడు వైట్‌ఫీల్డ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాలి కోసం గాలిస్తున్నారు. చదవండి: చుక్కేసి.. చిక్కేసిన జూడాలు వివాహం పేరుతో వంచన : మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా మహిళను పరిచయం చేసుకున్న వ్యక్తి రూ. 7 లక్షలు తీసుకుని వంచనకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బనశంకరికి చెందిన యువతి (30) ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకుంది. రెండో వివాహం చేసుకోవాలని మెట్రిమోనియల్లో వెబ్సైట్లో ప్రొఫైల్ పెట్టింది. గత ఏడాది రమేశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అనంతరం ఇద్దరు తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఆమెతో బాగా నమ్మకం కుదిరాకా వివిధ కారణాలతో రూ. 7 లక్షలు తీసుకున్నాడు. ఓ పని నిమిత్తం బయటి రాష్ట్రానికి వెళ్తున్నానని చెప్పి రమేశ్ ఆచూకీ లేదు. దీంతో బాధితురాలు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానించిన బాధితురాలు డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అతను స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: భార్యను చంపి.. ఆపై అత్త కోసం కోల్‌కతాకు.. -
రూ. 100కే ‘మ్యాచ్ ఫైండర్’ సభ్యత్వం!
హైదరాబాద్: భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న వివాహ సంబంధాల పరిచయ వేదిక మ్యాచ్ ఫైండర్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (matchfinder.in) వినియోగదారుల కోసం మరిన్ని సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ మ్యాచ్‌ఫైండర్ కస్టమర్ కేర్ సెంటర్ రూ.100కే సభ్యత్వ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తమమైన వివాహ సంబంధాల వేదికగా నిలవడం, తక్కువ ధరకే సభ్యత్వం అవకాశం కల్పించడం లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ కుమార్ రష్మి గౌతమ్ ఈ సేవలను ప్రారంభించారు. కేపీహెచ్‌బీ కాలనీలోని మ్యాచ్‌ఫైండర్ ఆఫీసులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మ్యాచ్‌ఫైండర్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రత్తయ్య, మ్యాచ్‌ఫైండర్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా మ్యాచ్‌ఫైండర్ ద్వారా ఆన్లైన్లో వివాహ సంబంధాలు కుదిర్చే సేవలు అందిస్తున్నామని తెలిపారు. తమ డాటాబేస్‌లో 2లక్షలకు పైగా ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వివాహ సంబంధాల కోసం చూస్తున్నవారికి, తమ రిజిష్టర్డ్ యూజర్ల కోసం సులభంగా వినియోగించుకోగలిగిన, సురక్షితమైన రీతిలో తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు. వివాహ పరిచయ రంగానికి సంబంధించిన వ్యాపార రంగంలో మునుపెన్నడూ లేని రీతిలో మొట్టమొదటి సారిగా రూ.100కే సభ్యత్వం అవకాశం కల్పిస్తున్నామన్నారు. మరే ఇతర మ్యాట్రిమోని సైట్ కూడా ఇంత తక్కువ ధరలో సభ్యత్వం అందివ్వడం లేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలుస్తుందని, తమను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలని భావించే వినియోగదారులు మ్యాచ్‌ఫైండర్.ఇన్ (matchfinder.in) లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం, సదరు వ్యక్తి తన ఆసక్తులకు తగిన రీతిలో భాగస్వామిని ఎంచుకోవచ్చు. ఈ సమయంలోనే వారు కేవలం రూ.100 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అనంతరం సంబంధిత సభ్యులు అందించిన డాటా ఆధారంగా వారిని సంప్రదించవచ్చు. ఈ సౌలభ్యం వివాహ సంబంధాల ప్రయత్నాల్లో ఉన్నవారికి పెద్ద వెసులుబాటుగా నిలుస్తుంది. దీంతో పాటుగా వివాహ సంబంధం కుదుర్చుకునేందుకు కావాల్సిన జాతక సంబంధ అంశాలు, హైలైటింగ్ ప్రొఫైల్స్, పలు రకాలైన ఇతర వాల్యూ యాడెడ్ సేవలను సైతం మేం అందిస్తున్నాం’’ అని తెలిపారు. ఆన్లైన్లో కుదుర్చబడుతున్నాయి: రష్మి ఇక సినీ నటి రష్మి గౌతమ్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లి సంబంధాలు స్వర్గంలో కుదుర్చబడతాయి’’ అనేవారు.. అయితే.. ప్రస్తుతం వివాహ సంబంధాలు ఆన్లైన్లో కుదుర్చబడుతున్నాయి. మన జీవనశైలి ప్రస్తుత పరిస్థితుల్లో సంక్లిష్టంగా మరియు ఒత్తిళ్లమయంగా మారిపోయింది. ఈ తరుణంలో జీవిత భాగస్వామిని అన్వేషించడం కష్టమైన అంశంగా మారింది. జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులు పిల్లలకే వదిలివేసినప్పటికీ... యువతకు సరైన సంబంధం వెతుక్కోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వివాహ సంబంధాలను కుదిర్చే సైట్లపై ఆధారపడుతున్నారు.ఫాస్ట్‌ఫుడ్ లేదా ఇన్స్టంట్ నూడుల్స్ వలె, ప్రస్తుత తరానికి వివాహం సైతం సౌకర్యవంతంగా మరియు వేగంగా పూర్తవ్వాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు ప్రతి ఒక్కరి చూపు మ్యాట్రిమోనీ వెబ్సైట్లపై పడింది. అలాంటి వెబ్సైట్లలో టాప్‌లో నిలిచేది మ్యాచ్‌ఫైండర్’’ అని పేర్కొన్నారు. ఆర్థికంగా ఏమాత్రం భారం కాదు ‘‘మ్యాచ్‌ఫైండర్.ఇన్‌లో సులభంగా ఉపయోగించే వీలున్న వెబ్సైట్. ఇతర వెబ్సైట్లతో పోలిస్తే, వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండటం, ఆర్థికంగా కూడా పెద్దగా భారం కాని రీతిలో ఉంది. రూ.100 ఫీజు అనేది నామమాత్రపు రుసుం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మ్యాచ్‌ఫైండర్ వెబ్సైట్లో అధునాతన టెక్నాలజీని వినియోగించి, అద్భుతమైన ఆప్షన్లతో మెరుగైన సేవలు అందించబడుతున్నాయి. ఈ వెబ్సైట్లో ఉన్న ఎక్స్లెంట్ ప్రొఫైల్స్ కారణంగా తమకు అత్యంత నచ్చిన వారిని ఎంచుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల మీ జీవితానికి సరైన భాగస్వామిని పొందవచ్చు, భాగస్వామితో ఎలాంటి సమస్యలు లేని జీవితం గడపవచ్చు. దీంతోపాటుగా సంబంధిత వ్యక్తి యొక్క బ్యాక్‌గ్రౌండ్ చెక్, వారి ఆసక్తులు, ఆహారపు అలవాట్లు సహా అనేక ఇతర అంశాలు వెబ్సైట్లో పొందుపర్చబడి ఉంటాయి. ఈ నేపథ్యంలో పెళ్లికాని వారు తమ జీవితానికి తగిన భాగస్వామిని మ్యాచ్‌ఫైండర్.ఇన్‌లో పొందవచ్చు. కులం, మతం, భాష, సమాజం వంటి అంశాలకు అతీతంగా అందరికీ ఉపయుక్తంగా నిలిచే వెబ్సైట్ ఇది. నూతనంగా ఏర్పాటు చేయబడిన మ్యాచ్‌ఫైండర్ కస్టమర్ కేర్ సెంటర్లో లేటెస్ట్ జనరేషన్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల వినియోగదారులు సేవలు పొందిన అనంతరం వారి సంతృప్తి స్థాయి పెరుగుతుంది. మ్యాచ్‌ఫైండర్ కస్టమర్ కేర్ సెంటర్‌ను అత్యంత సుశిక్షితులైన ఎగ్జిక్యూటివ్‌లు నిర్వహిస్తూ వినియోగదారులతో అన్ని భాషల్లోనూ ఆత్మీయ సంభాషణలు చేయగలుగుతారు. ఈ ఎగ్జిక్యూటివ్‌లు ఓపికగా వినియోగదారుల అభిప్రాయాలు వినడం, సరైన స్పందన ఇవ్వడం అనే లక్షణాలతో పాటుగా మంచి వ్యవహారిక నైపుణ్యాలు, ఉత్తమమైన నిర్వహణ సంబంధ పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే పరిజ్ఞానం సైతం కలిగి ఉన్నవారు. వినూత్నమైన ఈ రూ.100 సభ్యత్వ రుసుం ప్లాన్.. తొలిసారిగా వినియోగదారుల కోసం ప్రవేశపెట్టబడింది. వివాహ సంబంధాల విషయంలో తమకు సరైన వారిని ఎంచుకునేందుకు మెరుగైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ప్లాన్ వినియోగించుకునేందుకు రూ.100 చెల్లించడం వల్ల, సంబంధిత వ్యక్తి తమకు ఆసక్తి ఉన్న వారి యొక్క ప్రొఫైల్, సంప్రదించాల్సిన వివరాలు పొందవచ్చు. ఈ సభ్యత్వానికి 3 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఈ పరిమితి ముగిసిన అనంతరం వినియోగదారుడు సంస్థను సంప్రదించి టాప్-అప్ సేవలు పొందవచ్చు. ఈ సేవలను వినియోగించుకోవాల్సిన వారు చేయాల్సిందల్లా కేవలం మ్యాచ్‌ఫైండర్ వెబ్సైట్ (matchfinder.in) లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఈ ప్లాన్ కొనుగోలు చేయడమే. అనంతరం తమకు నచ్చిన ప్రొఫైల్‌ను సంప్రదించవచ్చు. మ్యాచ్‌ఫైండర్ యొక్క ఈ రెండు ఆవిష్కరణలు నిర్వహణ సంబంధమైన మెరుగైన సేవల అందించడమే కాకుండా వినియోగదారులకు ఆర్థికంగా కూడా భారం కాకుండా ఉపయోగపడతాయి. వివాహ సంబంధాల పరిశ్రమలో ఈ నిర్ణయాలు కొంగొత్త మార్పులకు వేదికగా నిలుస్తాయి. మ్యాచ్‌ఫైండర్ యొక్క ఈ నూతన టెక్నాలజీ వల్ల వినియోగదారులకు గొప్ప సేవల అనుభూతి రావడమే కాకుండా రాబోయే కాలంలో మ్యాచ్ఫౌండర్కు చెందిన ఖాతాదారుల నుంచి సానుకూల ఫీడ్‌బ్యాక్ రానుంది. ఈ కొత్త రూ.100 మెంబర్షిప్ ప్లాన్ వల్ల వివాహ సంబంధమైన పరిశ్రమలో అధిక చార్జీల భారం మోపే విధానానికి తెరపడనుంది. అంతేకాకుండా గతంలోనే చూసిన, పదే పదే కనిపించే ప్రొఫైళ్లను తిరిగి వీక్షించాల్సిన ఇబ్బంది కూడా తప్పుతుంది’’ అని రత్తయ్య ఈ సందర్భంగా తెలిపారు. మ్యాచ్‌ఫైండర్ గురించి.. మ్యాచ్‌ఫైండర్, భారతదేశంలో అందుబాటు ధరల్లో వివాహ సంబంధ సేవలు అందిస్తున్న వెబ్సైట్. తెలుగు, బెంగాళీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాళం, మరాఠి, ఒరియా, పంజాబీ, తమిళ్ మరియు ఉర్దూ వంటి బహుళ భాషల్లో సేవలు అందిస్తోంది. భారతదేశంలోని దాదాపు 2000 పైచిలుకు సామాజికవర్గాలకు చెందిన వధూవరులకు చెందిన సమాచారం కలిగిన సురక్షిత వేదిక. ఈ సైట్లోకి సైన్ అప్ అవడం ఉచితం. వివాహ సంబంధాల పరిచయాలతో పాటుగా వివాహ సంబంధం కుదుర్చుకునేందుకు కావాల్సిన జాతక సంబంధ అంశాలు, హైలైటింగ్ ప్రొఫైల్స్ మరియు పలు రకాలైన ఇతర వాల్యూ యాడెడ్ సేవలను సైతం మ్యాచ్‌ఫైండర్ అందిస్తోంది. వినియోగదారులకు సంబంధించిన సమాచారం అత్యంత భద్రంగా ఉంచుతామని సంస్థ స్పష్టం చేస్తోంది. ప్రతిరోజూ మరియు వారానికోమారు వివాహ సంబంధమైన సమాచారం అందించడం, సమగ్రమైన మరియు సింగిల్ పేజ్ రిజిస్ట్రేషన్ వంటి ఇతర వాల్యూ అడిషన్లను సైతం సైట్ అందిస్తోంది. ♦ (అడ్వర్టోరియల్) -
‘ఆమె’ బాధితులు 17 మంది
సాక్షి చెన్నై: పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న యువకులకు వల విసురుతుంది. మాయమాటలతో దగ్గరవుతుంది. పెళ్లి చేసుకుందామంటూ నమ్మిస్తుంది. కష్టాల కథలు చెప్పి అందినంత కాజేసి, అవసరం తీరాక మొహం చాటేస్తుంది. ఇలా ఆ కిలాడీ యువతి వలలో చిక్కుకున్న యువకులు 17 మంది. బాధిత యువకులు కొందరు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మాయలేడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తమిళనాడులోని కడలూరు జిల్లా వలయామదేవి ప్రాంతానికి చెందిన ఎంబీఏ పట్టభద్రుడైన బాలమురుగన్ (33) అనే బంగారు నగల వ్యాపారి తన వివాహం కోసం కొన్నేళ్ల క్రితం మాట్రిమోనియల్ వెబ్సైట్లో పేరు, వివరాలు నమోదు చేశాడు. సేలం జిల్లా ఆట్టయంపట్టి సమీపం మరుమలయంపాళెంకు చెందిన 25 ఏళ్ల యువతి అతడిని సంప్రదించి 2016 సెప్టెంబరు నుంచి పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుందామని నమ్మించింది. తన కుటుంబ కష్టాలు, అవసరాలు చెప్పుకుంటూ డబ్బులు, ఇంటికి కావాల్సిన వస్తువులను అతడి ద్వారా పొందేది. ఇలా రూ.23 లక్షల వరకూ యువతికి సమర్పించుకున్నాడు. ఆ తరువాత క్రమేణా అతనితో మాట్లాడడం తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలో యువతి ఇంటికి వెళ్లినపుడు ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా చాలామంది యువకులతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, అసభ్యంగా తీసుకున్న సెల్ఫీలు, ప్రేమ ముసుగులో అసభ్య చాటింగులు, ఎస్ఎంఎస్లు చూసి మోసపోయినట్లు తెలుసుకున్నాడు. తానిచ్చిన డబ్బు, నగలు తిరిగి పొందేందుకు సేలంకు చెందిన రాజా అనే వ్యక్తి ద్వారా సంప్రదించగా అతడు కూడా యువతితో చేరిపోయి బాలమురుగన్‌తో బలవంతంగా ఆమె మెడలో తాళి కట్టించి ఫొటోలు తీసి వెళ్లగొట్టారు. తరువాత ఆ దృశ్యాలను చూపుతూ మరికొన్ని లక్షలు ఇవ్వాల్సిందిగా హత్యా బెదిరింపులకు పాల్పడ్డారని బాలమురుగన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్పీ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించడంతో సదరు కిలాడీ లేడీ పారిపోయింది. పోలీసుల ప్రాథమిక విచారణలో బాలమురుగన్ తరహాలోనే కోయంబత్తూరు, మదురై, చెన్నై, తిరుచ్చిరాపల్లి ప్రాంతాలకు చెందిన 17 మంది యువకులను మోసగించి రూ.85 లక్షల వరకు కాజేసినట్లు తేలింది. -
ఆటా స్కాలర్ షిప్స్, మ్యాట్రిమోనియాల్ సర్వీసెస్
నార్త్ కరోలినా : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా ) తెలుగువారి కోసం స్కాలర్ షిప్స్, మ్యాట్రిమోనియాల్ సర్వీసెస్ ప్రారంభించింది. నార్త్ కరోలినా లోని ర్యాలీలో ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి అధ్యక్షతన ఆటా బోర్డు మీటింగ్ జరిగింది. అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి అవసరాలకి అనుగుణంగా ఆటా రూపొందించిన సేవా కార్యక్రమాలని ఈ సమావేశంలో వెల్లడించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా తెలుగువారికోసం మ్యాట్రిమోనియాల్ సైట్ (http://www.atamatrimony.com/) ని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి ప్రారంభించారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ విధానాన్ని బోర్డు సభ్యులకి చూపించారు. తెలుగు యువతకు విద్యావసరాల కోసం స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ని కూడా బోర్డు ఆమోదించింది. అమెరికాలో ఉన్న 10మంది తెలుగు వారి పిల్లలకు కాలేజీ అవసరాల కోసం ఒక్కొక్కరికి 1000 డాలర్ల చొప్పున అందిస్తామని పరమేష్ తెలిపారు. భువనేశ్ బుజాల (ప్రెసిడెంట్ ఎలెక్ట్) ని ఆటా వేడుకల చైర్‌గా ఆయన నియమించారు. అమెరికాలో ఉంటున్న తెలుగు వారికోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలంటే ఆటాలో తెలుగువారి సభ్యత్వం మరింత పెరగాలని, అందుకోసం ఇక్కడ ఉంటున్న తెలుగువారందరినీ ప్రోత్సహించి సభ్యత్వం చేయించాలని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆటా బోర్డు సమావేశానికి అమెరికాలోని వివిధ నగరాల నుంచి రీజనల్ కోఆర్డినేటర్స్ , రీజనల్ డైరెక్టర్స్ , రీజనల్ అడ్వయిర్స్, ఉమెన్స్ కమిటీ చైర్స్, కో చైర్స్, స్టాండింగ్ కమిటీ చైర్స్, కోచైర్స్, ఆటా సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 150 మంది వరకు హాజరైన ఈ సమావేశానికి ఏర్పాట్లు చేసిన బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మధు బొమ్మినేని, సాయి సుదిని, స్టాండింగ్ కమిటీ చైర్స్ పవన్ నోముల, వెంకట్ ఏటుకూరి , రీజనల్ కోఆర్డినేటర్స్ అజయ్ మద్ది, నిహారిక నవలగా కు బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. -
సరైన భాగస్వామిని వెదకలేకపోయారుగా.. అందుకే
చండీగఢ్ : ‘మంచి సంబంధం కోసం వెదుకుతున్నారా.. అయితే మీరు మా సైట్లో వివరాలు అప్లోడ్ చేసుకోవాల్సిందే. మీరు కోరుకున్న లక్షణాలున్న భాగస్వామిని వెదికి పెట్టే బాధ్యత మాది’ అంటూ మ్యాట్రిమొనీలు యాడ్లతో యువతను ఆకర్షించడం మామూలే. చండీగఢ్ కేంద్రంగా పనిచేసే వెడ్డింగ్ విష్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన ఇలాంటి యాడ్ చూసి తాను మోసపోయానంటూ ఓ యువతి కన్జ్యూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించింది. తనకు జీవిత భాగస్వామిని వెదకలేకపోయిన సదరు మ్యాటిమొనీ నుంచి 70 వేల రూపాయల పరిహారం పొందింది. వివరాలు.. చండీగఢ్‌లోని సెక్టార్ 27 నివాసి అయిన ఓ యువతి రెండేళ్ల క్రితం వెడ్డింగ్ విష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మ్యాట్రిమోనియల్ సైట్లో తన వివరాలు అప్లోడ్ చేసింది. ఇందుకుగానూ 58, 650 రూపాయలు చెల్లించింది. రాయల్ ప్లాన్ కింద పన్నెండు నెలల పాటు ఆమె ప్రొఫైల్‌కు సరిపోయే యువకుల ప్రొఫైల్స్‌ను ఎంపిక చేసి వారితో మాట్లాడేలా ఏర్పాట్లు చేసింది సదరు మ్యాట్రిమొని. ఈ క్రమంలో సుమారు 21 మంది ప్రొఫైల్స్ చూసిన ఆ యువతికి ఒక్కరు కూడా నచ్చలేదు. దీంతో విసిగెత్తిపోయిన ఆమె.. 2016, జూన్ 2న కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేసింది. నెలరోజుల తర్వాత లీగల్ నోటీసులు రావడంతో విషయాన్ని గ్రహించిన మ్యాట్రిమొని యాజమాన్యం ఆమెకు మరలా ప్రొఫైల్స్ పంపడం ప్రారంభించింది. కానీ అవి కూడా ఆమెకు నచ్చకపోవడంతో కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. ప్రొఫైల్ అప్లోడ్ చేసే సమయంలో చెల్లించిన ఫీజుకు తోడు అదనంగా 11 వేల రూపాయలు యువతికి చెల్లించాలంటూ బుధవారం కోర్టు ఆదేశించింది. ఉద్దేశపూర్వరంగానే ఫిర్యాదు చేసింది...! ఎన్ని ప్రొఫైల్స్ పంపినా తిరస్కరించిన ఆ యువతి ఉద్దేశపూర్వకంగానే తమకు చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించిందని మ్యాట్రిమొని యాజమాన్యం వాదించింది. ‘ఎవరైనా కావాలని ఎందుకు అలా చేస్తారు. ఆమెకు సరిపోయే ప్రొఫైల్స్ మీరు పంపించనందు వల్లే ఫిర్యాదు చేసింది. సరైన జీవిత భాగస్వామిని వెదుకుతామని చెప్పి అలా చేయకపోవడం మీ తప్పే కదా’ అంటూ కోర్టు పేర్కొనడంతో షాక్ తినడం వారి వంతైంది. -
అమ్మను ఓ అయ్య చేతిలో పెట్టింది
నాన్న హఠాత్తుగా చనిపోయారు. అమ్మ ఒంటరి అయింది. పిల్లలు ఎంతమంది చుట్టూ ఉన్నా ఆ ఒంటరితనం పోయేది కాదు. అందుకే ఆ కూతురు అమ్మకు ఒక తోడును వెతికి తెచ్చింది. పెళ్లి చేసింది. తల్లిని ఓ అయ్యచేతిలో పెట్టింది. ‘సంహిత మీరేనా’ అడిగాడు, అడ్రస్ వెతుక్కుంటూ జైపూర్ వచ్చిన కృష్ణ గోపాల్ గుప్తా. ‘అవును, రండి కూర్చోండి’ అంటూ అతడిని ఆహ్వానించి సోఫా చూపించింది పాతికేళ్ల సంహిత. ‘‘మాట్రిమోనియల్ వెబ్సైట్లో మీ అమ్మగారి కోసం మీరు పెట్టిన వివరాలన్నీ చదివాను. నాకు సమ్మతమే. నాకు యాభై ఐదేళ్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ని’’ అని నేరుగా విషయంలోకి వచ్చేశాడతడు. ‘ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని మేమసలు ఊహించనే లేదు. అంతా హటాత్తుగా జరిగిపోయింది. ఆరోగ్యంగా ఉన్న మా నాన్నగారు ఉన్నట్లుండి పోయారు’.. అంది సంహిత. ‘భవిష్యత్తు ఎటు నడిపిస్తుందో ఊహించలేం. దేవుడు నిర్ణయిస్తాడు, తాననుకున్న దారిలో మనల్ని నడిపిస్తాడు... మనం నడుస్తాం అంతే’ అన్నాడతను. ఇలాంటి పరిణతి ఉన్న వ్యక్తి కోసమే సంహిత ఎదురు చూసింది. ఇతడి సహచర్యంలో తల్లి దుఃఖానికి దూరం కాగలుగుతుంది అనుకుంది. తర్వాత కొద్దిరోజులకే.. గత డిసెంబర్ మూడవ తేదీన ఆర్యసమాజం సంప్రదాయంలో గీతకు (సంహిత తల్లి), కృష్ణగోపాల్‌కూ పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల నుంచి నాలుగు వందల మంది మిత్రులు, బంధువులు హాజరయ్యి దంపతులను అభినందనలు తెలిపారు. అంతకంటే ఎక్కువగా సంహిత చొరవను ప్రశంసలతో ముంచెత్తారు. సంహిత గుర్గావ్లో ఉద్యోగం చేస్తోంది. తల్లి ఎలా ఉందో చూడ్డానికి రెండు వారాలకోసారి జైపూర్ వచ్చి వెళుతోంది. – మంజీర -
పెళ్లి పేరుతో లక్షల్లో టోపీ
► మ్యాట్రిమొనీ వెబ్సైట్లలో తప్పుడు వివరాలు ► ఎన్ఆర్ఐతో వివాహం ► లక్షల్లో వసూలు హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించి పెళ్లి చేసుకొని మోసగించడమే కాకుండా ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన ప్రశాంత్ పరాంకుశం పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీ వెబ్సైట్లో రిజిష్టర్ చేసుకున్నాడు. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలోని హ్యుటెంట్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్‌గా పని చేస్తున్నానని, ఏడాది రూ.40 లక్షలు సంపాదిస్తానని, యూఎస్ వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు వివరాలు పొందుపరిచాడు. కాగా విదేశాల్లో ఉంటున్న బాధితురాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరానికి వచ్చిన సమయంలో అదే వెబ్సైట్లో పేరు రిజిష్టర్ చేసుకుంది. నిందితుడి ప్రొఫైల్ చూసి ఇష్టపడటంతో ఆమె కుటుంబసభ్యులు నేరుగా ప్రశాంత్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా అతను తనపేరున భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు చెప్పడంతో నమ్మిన వారు పెళ్లికి ఆమోదం తెలుపుతూ మార్చి 20న పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం చేతిలో నగదు లేదని నిందితుడు చెప్పడంతో బాధితురాలు రూ. నాలుగు లక్షలు అతని ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసింది. రూ. లక్ష నగదు చేతికిచ్చారు. బ్రాస్లెట్, రింగ్, దుస్తుల కోసం మరో రూ. 2 లక్షలు ముట్టజెప్పడంతో మియాపూర్‌లోని శ్రీకృష్ణ గ్రాండ్ హోటల్లో మార్చి 20న వారికి వివాహం జరిగింది. వివాహం అయిన వెంటనే బాధితురాలు మార్చి 25న అమెరికాకు వెళ్లింది. వీసా ప్రాసెసింగ్ చేసుకొని తాను కూడా అమెరికా వస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి అనారోగ్యంతో స్టార్ ఆస్పత్రిలో చేరానని రూ.30 లక్షల వరకు డబ్బు అవసరమని చెప్పడంతో బాధితురాలు విచారణ చేయగా అబద్ధమని తేలడమేగాక, మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడినట్లు తెలుసుకుంది. తప్పుడు వివరాలు పొందుపరిచి పెళ్లిళ్ల పేరిట అమ్మాయిలను వంచిస్తున్నట్లు గుర్తించి డిసెంబర్ 7న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి 1,80,000 విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.