ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కర్ణాటక : మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పరిచయమైన యువతి ఓ టెక్కీని నిలువునా మోసగించింది. ఆమె తీయని మాటలకు పడిపోయి దాదాపు రూ. 16 లక్షలకు పైగా నగదు సమర్పించుకున్నాడు. వివరాలు...నగరానికి చెందిన అంకుర్ శర్మ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెక్కీగా విధులు నిర్వహిస్తున్నాడు. అంకుర్ శర్మకు మెట్రిమోనియల్ ద్వారా కిరారా శర్మ అనే యువతి పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొంతకాలం అనంతరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో తరచూ ఫోన్లలో మాట్లాడుకోవడం చేశారు. ఈ సమయంలో సదరు యువతి పలు కారణాలు చూపి అంకుర్ వద్ద రూ. 16.82 లక్షల నగదు తీసుకుంది. అనంతరం యువతి అంకుర్‌కు దూరం కావడం మొదలుపెట్టింది. సదరు యువతి వివాహానికి ఒప్పుకోకపోగా డబ్బు కూడా ఇవ్వలేదు. దీంతో బాధితుడు వైట్‌ఫీల్డ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాలి కోసం గాలిస్తున్నారు. చదవండి: చుక్కేసి.. చిక్కేసిన జూడాలు
వివాహం పేరుతో వంచన : మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా మహిళను పరిచయం చేసుకున్న వ్యక్తి రూ. 7 లక్షలు తీసుకుని వంచనకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బనశంకరికి చెందిన యువతి (30) ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకుంది. రెండో వివాహం చేసుకోవాలని మెట్రిమోనియల్‌లో వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ పెట్టింది. గత ఏడాది రమేశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అనంతరం ఇద్దరు తరచూ మాట్లాడుకునేవారు.
ఈ క్రమంలో ఆమెతో బాగా నమ్మకం కుదిరాకా వివిధ కారణాలతో రూ. 7 లక్షలు తీసుకున్నాడు. ఓ పని నిమిత్తం బయటి రాష్ట్రానికి వెళ్తున్నానని చెప్పి రమేశ్ ఆచూకీ లేదు. దీంతో బాధితురాలు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానించిన బాధితురాలు డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అతను స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: భార్యను చంపి.. ఆపై అత్త కోసం కోల్‌కతాకు..
Comments
Please login to add a commentAdd a comment