Mattayya
-
మత్తయ్యకు భద్రత కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో జెరూసలేం మత్తయ్యతో మాట్లాడి అతడికి తగిన భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను దరఖాస్తు చేసుకున్నప్పటికీ డీజీపీ భద్రత కల్పించలేదని, తాను కలిసేందుకు వెళ్లినప్పటికీ డీజీపీ నిరాకరించారని మత్తయ్య సుప్రీంకోర్టుకు నివేదించడంతో జస్టిస్ ఎస్ఎ.బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావుల ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మె ల్యే స్టీఫెన్సన్కు ఏపీ సీఎం చంద్రబాబు బృందం కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపిన కేసులో నిందితుల పేర్ల నుంచి మత్తయ్య పేరును హైకోర్టు తొలగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టులో 2016లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యను ఆదేశిస్తూ 2017 జనవరి 16న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా ఈ కేసు గురువారం మరోసారి విచారణకు వచ్చింది. అక్టోబర్ 26న విచారణకు వచ్చినప్పుడు మత్తయ్య వాదనలు వినిపిస్తూ తనకు రక్షణ లేదని, ఏపీ పోలీసులు తనను సుప్రీంకోర్టుకు రానివ్వకుం డా అడ్డుకున్నారని ఫిర్యాదు చేయగా ‘మత్తయ్య రక్షణ కోసం చేసుకునే దరఖాస్తును తెలంగాణ డీజీపీ పరిగణనలోకి తీసుకోవాలి..’అని ధర్మాసనం ఆనాడు ఆదేశించింది. ఉదయమే నా భార్యను బెదిరించారు.. తాజా విచారణలో మత్తయ్య తాను దరఖాస్తు చేసుకున్నప్పటికీ భద్రత కల్పించలేదని, గురువారం ఉదయం కూడా ఏపీ పోలీసులు తన ఇంటికి వెళ్లి భార్యను బెదిరించారని నివేదిం చారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కావాలని తెలంగాణ డీజీపీని కలిసేందుకు ప్రయత్నించినా సానుకూలంగా స్పందించలేదన్నారు. జస్టిస్ ఎస్ఎ.బాబ్డే స్పందిస్తూ.. ‘మేం చెప్పాం కదా.. భద్రత కల్పించడంలో వచ్చిన నష్టమేంటి?’అని తెలంగాణ తరఫు న్యాయవాది హరీన్ రావల్‌ను ప్రశ్నించారు. దీనికి రావల్ స్పందిస్తూ ‘మత్తయ్యకు హైదరాబాద్‌లో ఎలాంటి బెదిరింపులు, అభద్రత, ప్రాణహాని గానీ లేదు..’అని చెప్పారు. ఏపీ, తెలంగాణ పోలీసుల కుమ్మక్కు.. అయితే దీనిపై మత్తయ్య స్వయంగా వాదనలు వినిపిస్తూ.. ఓటుకు కోట్లు కేసులో ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులు కుమ్మక్కయ్యారని, ఇద్దరూ కలసి నాటకం ఆడుతున్నారని కోర్టుకు చెప్పారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు దీనిపై స్పందిస్తూ క్రితం సారి విచారణలో న్యాయవాదితో రావాలని చెప్పామని, న్యాయవాదితో రావాలని సూచించారు. అయి తే తనకు న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేదని విన్నవించడంతో అక్కడే ఉన్న సిద్ధార్థ దవే అనే న్యాయవాదిని ‘మీరు మత్తయ్య తరపున వాదిస్తారా?’అని జస్టిస్ నాగేశ్వరరావు ప్రశ్నించగా అందుకు ఆయన సమ్మతించారు. కోర్టు దవేను మత్తయ్య తరఫున వాదనలు వినిపించేందుకు అమికస్ క్యూరీ (కోర్టుకు సహాయకారి)గా నియమించిందని, మత్త య్య తన పత్రాలను దవేకు ఇవ్వాలని ఆదేశించారు. మత్తయ్య తానొక మధ్యంతర దరఖాస్తు చేసుకునేం దుకు అనుమతించాలని కోరగా.. ఏదైనా న్యాయ వాది దవే ద్వారా చేసుకోవాలని సూచించారు. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన ఉదయసింహ ఓటుకు కోట్లు కేసులో నిందితుడు ఉదయసింహ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసు విచారణను ఆలస్యం చేసేందుకు పిటిషన్లు వేస్తున్నారని తెలంగాణ తరఫు న్యాయవాది రావల్ వాదించారు. దీనిపై ఉదయసింహ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇరువురు న్యాయవాదులు వాదులాడుకోగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఉదయసింహ ఇంప్లీడ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు. కేసు తదుపరి విచారణను జనవరి 29కి వాయిదావేసింది. విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉదయకుమార్ సాగర్ పాల్గొన్నారు. -
రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి
ఓటుకు కోట్లు కేసులో మత్తయ్యకు సుప్రీంకోర్టు ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని జెరుసలెం మత్తయ్యను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విచారణ నుంచి మత్తయ్య పేరును తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. -
మత్తయ్య పిటిషన్‌పై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా వేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: తనపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన జెరుసలేం మత్తయ్య దాఖలు చేసుకున్న పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు తీర్పును వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏసీబీ విచారణకు మత్తయ్య డుమ్మా
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో కొత్త ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్‌రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య అంశం మరో మలుపు తిరిగింది. కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) ఫిబ్రవరి 12న 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఏసీబీ ఇచ్చిన 8 రోజుల గడువు ముగిసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే మత్తయ్య తనకు ఆరోగ్యం బాగోలేదంటూ శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. తాను హై బీపీ కారణంగా ఏపీ గుంటూరు జిల్లా నరసారావుపేటలోని మధర్ థెరిస్సా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని, ఆ తర్వాత విచారణకు హాజరవుతానన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏసీబీ అతన్ని అరెస్టు చేయమని స్పష్టం చేసినా, విచారణకు హాజరుకాకుండా వ్యవహరిస్తున్న తీరును న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తోంది. అయితే మరోవైపు మత్తయ్య మాత్రం ఏసీబీ తనకు నోటీసులు జారీ చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందంటున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 15న హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. -
మత్తయ్య కేసు విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్
సాక్షి, హైదరాబాద్: ఓ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం హైకోర్టులో జరిగిన వాద, ప్రతివాదనలను ఆడియో, వీడియోల్లో రికార్డ్ చేశారు. విచారణ ప్రక్రియను ఇలా రికార్డ్ చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. అంతేకాక పిటిషనర్, ప్రతివాదుల తరఫు న్యాయవాదులు మినహా, మీడియా ప్రతినిధులతో సహా మిగిలిన వారందరినీ బయటకు పంపి, ఇన్ కెమెరా (రహస్య పద్ధతిన) ద్వారా విచారణ చేపట్టడం విశేషం. ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన జెరుసలెం మత్తయ్య.. ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ బులుసు శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. మత్తయ్య గత జూన్ 17న పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి శివశంకరరావు తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు మత్తయ్యను అరెస్ట్ చేయవద్దని ఏసీబీ అధికారులను ఆదేశిస్తూ జూన్ 18న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అయితే 18న విచారణ జరిగిన తీరును, ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి.. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ శివశంకరరావుపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ, కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనల అనంతరం స్టీఫెన్సన్ అభ్యర్థనను న్యాయమూర్తి కొట్టేశారు. అదే సమయంలో ప్రధాన న్యాయమూర్తి అనుమతినిస్తే ఈ కేసులో పారదర్శకత కోసం కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్‌ను ఆడియో, వీడియో ద్వారా రికార్డ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు తగిన అనుమతులు తీసుకుని ఏర్పాట్లు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. వెబ్ కెమెరాల్లో రికార్డింగ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అనుమతిని వ్వడంతో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు వీలుగా రిజిస్ట్రీ కోర్టు హాలులో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మత్తయ్య పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాదులు కనకమేడల రవీంద్రకుమార్, జి.సుబ్బారావు, మరొకరిని న్యాయమూర్తి శివశంకరరావు అనుమతించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి, ఆయన సహాయకులు, ఏసీబీ న్యాయవాది వి.రవికిరణ్రావును అనుమతించినట్లు సమాచారం. రవికిరణ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేశామ ని, కాబట్టి విచారించడానికి ఏమీ లేదని తెలిపా రు. ఈ మేరకు ఓ మెమోను కోర్టు ముందుంచా రు. అయితే మెమోను రిజిస్ట్రీలో దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తి సూచించారు. మెమో దాఖలు చేసిన విషయాన్ని మాత్రం రికార్డ్ చేశా రు. తర్వాత మత్తయ్య తరఫున కనకమేడల రవీంద్రకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇదే కేసులోని మరో నిందితుడి బెయిల్ పిటిషన్ విచార ణకొచ్చిన సమయంలో చార్జిషీట్ దాఖలు చేయలేదని ఏసీబీ అధికారులు కోర్టుకు నివేదించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9కల్లా చార్జిషీట్ కాపీని పిటిషనర్ తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని రవికిరణ్‌రావుకు న్యాయమూర్తి సూచించారు. 12వ తేదీకి అభ్యంతరాలను దాఖ లుచేయాలని సుబ్బారావుకు చెప్పారు. -
'ఆ ముగ్గురూ మా పార్టీకి చెందిన వారే'
-
స్టీఫెన్సన్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా
-
యూరేనియం ప్లాటినంలా తిరిగొస్తా..
-
సమస్యలున్నాయి.. డేటా ఇవ్వలేం
విజయవాడ: ఓటుకు నోటు కేసుకు సంబంధించి మత్తయ్య ఫోన్ కాల్ డేటా వివరాలను ఏపీ సీఐడీ టెలికాం కంపెనీలను కోరింది. అయితే తమకు న్యాయపరమైన చిక్కులు ఉన్నందున వివరాలు ఇవ్వలేమంటూ టెలికం కంపెనీలు తేల్చేశాయి. అందుకు ఒప్పుకున్న ఏపీ సీఐడీ ఇవ్వకుంటే సరేగానీ.. సమాచారం మాత్రం భద్రపరచాలని కంపెనీలను కోరింది. -
'మత్తయ్య కాల్‌డేటా ఇప్పించండి....'
-
నేనెక్కడికి పారిపోలేదు : మత్తయ్య