మయూరీని పిక్నిక్ స్పాట్‌గా తీర్చిదిద్దుతా
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మయూరీపార్క్‌ను పెద్ద పిక్నిక్ స్పాట్‌గా తీర్చిదిద్దుతానని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మయూరీ పార్క్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా పర్యాటకులను కలిసి పార్క్ గురించి ముచ్చటించారు. ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలని.. అడిగి తెలుసుకున్నారు. కోట్ల రుపాయలతో పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, అడ్వైంచర్ ఈవెంట్లను మరింత పెంచడానికి కృషి చేస్తామన్నారు.
హైదరాబాద్ తరహాలో పార్న్ను తయారుచేస్తానని, పార్క్‌ను సందర్శించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి మెచ్చుకున్నారని, ఇక్కడి తరçహాలో సిద్దిపేట జిల్లాలో తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కాసేపు చిన్నారులతో సెల్ఫీలకు ఫోజులుఇచ్చారు. అనంతరం మహిళలు ఎమ్మెల్యే రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, శివకుమార్, శివశంకర్ పాల్గొన్నారు.