మీరాకుమార్‌పై మేనకోడలు పోటీ
పాట్నా: దివంగత కాంగ్రెస్ నేత జగ్జీవన్‌రామ్ కుమార్తె, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌పై ఎన్నికల్లో పోటీకి ఆమె మేనకోడలు మేధావి కీర్తి బరిలోకి దిగింది. బీహార్‌లోని సాసారామ్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మీరాకుమార్‌పై బీఎస్పీ అభ్యర్థిగా కీర్తి పోటీకి దిగనుంది.
మంగళవారం ఢిల్లీలో బీఎస్పీ చీఫ్ మాయావతిని కలిసి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న అనంతరం ఆమెకు సాసారమ్ నియోజకవర్గ టికెట్‌ను మాయావతి కేటాయించారు. బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేస్తారని బీఎస్పీ బీహార్శాఖ చీఫ్ భారత్ బింద్ తెలిపారు. కీర్తి...జగ్జీవన్‌రామ్ కుమారుడైన దివంగత సురేశ్ రామ్ కూతురు. ఆమె 1987లో హర్యానాలో నాటి బన్సీలాల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.