Medical Agency
-
పట్టణ పేదలకు ఆరోగ్య భరోసా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలన్న లక్ష్యంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారు. పట్టణ పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని అందించడం కోసం పట్టణ ప్రాథమిక వైద్యాన్ని సీఎం జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. తద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పట్టణ ప్రజలు జీజీహెచ్, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇందుకోసం నగర, పట్టణ ప్రాంతాల్లో 542 డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను వైద్య శాఖ నెలకొల్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, నగర ప్రాంతాల్లో 40 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. వీరికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 73 మున్సిపాలిటీల్లో 259 అర్బన్ హెల్త్ సెంటర్లు మాత్రమే ఉండేవి. ఇవి పేరుకే హెల్త్ సెంటర్లు. ప్రజలకు అందించిన వైద్య సేవలు మాత్రం శూన్యం. వీటిలో ఎటువంటి సౌకర్యాలూ ఉండేవి కావు. చిన్న చిన్న వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశం ఉండేది కాదు. అపరిశుభ్ర వాతావరణం, వైద్యులు, వైద్య సిబ్బంది కొరత కారణంగా ప్రజలు వీటివైపు కన్నెత్తి చూసే వారే కాదు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో నగరాలు, పట్టణాల్లో 50 వేల జనాభాకు ఒకటి చొప్పున ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ల సంఖ్యను పెంచారు. ప్రతి 25 వేల మంది జనాభాకు ఒకటి తప్పనిసరిగా ఉండేలా డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా విశాఖ నగరంలో గతంలో 24 ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఇప్పుడు 63కు పెరిగాయి. అదే విధంగా విజయవాడలో 29 ఉండగా ప్రస్తుతం 41 ఉన్నాయి. ఇలా అన్ని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 47.14 లక్షల ఓపీలు నమోదు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని సౌకర్యాలతో కూడా వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు పట్టణ పేదలకు ప్రయోజనకరంగా ఉన్నాయి. దీంతో ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య వీటిలో 47,14,261 ఓపీలు నమోదయ్యాయి. డిజిటల్ వైద్య సేవల్లో భాగంగా 30.77 లక్షల హెల్త్ రికార్డులను వీటిలోడిజిటలైజేషన్ చేశారు. 8,99,946 మంది టెలీ మెడిసన్ ద్వారా బోధనాస్పత్రుల్లోని హబ్‌లో ఉండే స్పెషలిస్ట్ వైద్యుల సేవలు పొందారు. 42.06 లక్షల ల్యాబ్ టెస్ట్‌లను ఆరోగ్య కేంద్రాల్లో చేశారు. ల్యాబ్ టెస్ట్‌ల ఫలితాలను ఎస్ఎంఎస్ రూపంలో రోగుల మొబైల్ నంబర్లకు పంపుతున్నారు. గర్భిణులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ సేవలూ అందుబాటులోకి తెచ్చారు ప్రతి ఆరు ఆరోగ్య కేంద్రాలను ఒక క్లస్టర్‌గా చేసి ఒక చోట అల్ట్రా సౌండ్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో మిషన్ కొనుగోలుకు రూ. 2.45 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది. అత్యున్నత ప్రమాణాలతో నాడు–నేడు కార్యక్రమం కింద పట్టణ ఆరోగ్య కేంద్రాలన్నింటికీ ప్రభుత్వం సొంత భవనాలను సమకూరుస్తోంది. 188 పాత భవనాలకు మరమ్మతులు చేసింది. మరో 344 కొత్త భవనాలు నిర్మిస్తోంది. వీటిలో 248 భవనాల నిర్మాణం పూర్తయింది. 240 భవనాలను వైద్య శాఖ స్వా«దీనం చేసుకుంది. మిగిలిన భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త భవనం నిర్మాణానికి రూ. 80 లక్షలు, పాత వాటి మరమ్మతులకు రూ.10 లక్షల చొప్పున ఖర్చు పెట్టారు. ఈ భవనాలన్నింటినీ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్(ఎన్‌క్వా‹Ù) ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఇప్పటికే 11 ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు కూడా లభించింది. ఓ వైపు పక్కా భవనాలను సమకూర్చుకుంటూనే, తాత్కాలిక భవనాల్లో 542 ఆరోగ్య కేంద్రాల కార్యకలాపాలను 2020–21లోనే వైద్య శాఖ ప్రారంభించింది. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీíÙయన్, ఇతర సిబ్బందిని నియమించారు. అన్ని కేంద్రాల్లో వందశాతం మానవ వనరులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 3,760 మంది ఉద్యోగులను అర్బన్ హెల్త్ సెంటర్లలో కొత్తగా నియమించింది. గతంలో ఓపీ మాత్రమే ఉండగా, ఇప్పుడు ప్రతి ఆరోగ్య కేంద్రంలో పది పడకలతో ఇన్పేòÙంట్ విభాగం ఏర్పాటు చేసింది. 63 రకాల ల్యాబ్ వైద్య పరీక్షలు, 172 రకాల మందులు అందుబాటులో ఉంచింది. -
భారీగా శ్యాంపిల్ మందుల విక్రయాలు
–ఔషధ నియంత్రణ శాఖ అధికారుల దాడులు –రూ.2లక్షల విలువ చేసే మందుల స్వాధీనం కర్నూలు(హాస్పిటల్): నగరంలోని వన్‌టౌన్ ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి ఔషధ నియంత్రణ శాఖ అధికారులు భారీగా శ్యాంపిల్ మందులను స్వాధీనం చేసుకున్నారు. కుమ్మరివీధిలోని సుంకులమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న కె.గిరిధర్‌సింగ్ కొన్నేళ్ల క్రితం ఓ మెడికల్ ఏజెన్సీలో పనిచేసేవాడు. మందులపై తనకున్న పరిజ్ఞానంతో పలువురు మెడికల్ రెప్స్‌తో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి తదితర ప్రాంతాల నుంచి శ్యాంపిల్ మందులను తెచ్చుకునేవాడు. వీటిని జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల వంటి ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. ఆర్ఎంపీలు ఇతని వద్ద తక్కువ ధరకు మందులను కొని రోగులకు ఎక్కువ ధరకు అంటగడుతున్నారు. విషయం తెలుసుకున్న ఔషధ నియంత్రణ శాఖ ఏడీ చంద్రశేఖరరావు నేతృత్వంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు అబిద్‌అలి, జె. విజయలక్ష్మి మంగళవారం ఆయన ఇంటిపై దాడులు నిర్వహించారు. గిరిధర్‌సింగ్ ఇంట్లో లేకపోవడంతో అతనికి ఫోన్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను రాకపోవడంతో వీఆర్వో టి.సుదర్శన్‌రెడ్డి సమక్షంలో గోడౌన్ తాళాలు పగులగొట్టి వంద రకాలైన రూ.2లక్షల విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మందుల వివరాలు సేకరించి పంచనామా చేశారు. కాగా నిందితుడు గిరిధర్‌సింగ్ పరారీలో ఉన్నాడు. -
తీగలాగితే.. డొంక కదిలింది!
కామారెడ్డి : దేశ సరిహద్దులు దాటిన దగ్గుమందు అక్రమ దందా రాకెట్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోంది. కామారెడ్డి కేంద్రంగా సాగిన ఈ స్మగ్లింగ్‌తో ఇతర ప్రాంతాల మెడికల్ ఏజెన్సీలకూ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై గుంటూరులోనూ సోదాలు నిర్వహించారని ఔషధ నియంత్రణ శాఖ అధికారుల ద్వారా తెలిసింది. ఫెన్సిడిల్ అక్రమదందా వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించారు. ఫెన్సిడిల్ అక్రమ రవాణా కేసులో ఇప్పటికే కామారెడ్డి అజంతా మెడికల్ ఏజెన్సీ అనుమతులను రద్దు చేసిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. దందాతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించారు. ఈ రాకెట్లో గుంటూరుకు చెందిన శేషు ఏజెన్సీకీ భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. అక్కడికి వెళ్లి రికార్డులను సీజ్ చేశారు. ఆ ఏజెన్సీ నుంచి 3.20 లక్షల ఫెన్సిడిల్ బాటిళ్లు అక్రమ రవాణ అయినట్టు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలో ప్రముఖ మెడికల్ ఏజెన్సీగా శేషు ఏజెన్సీకి గుర్తింపు ఉంది. ఈ ఏజెన్సీకి ఫెన్సిడిల్ అక్రమదందాలో భాగస్వామ్యం ఉందని అనుమానించిన అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. అలాగే భీమవరం, నర్సరావుపేట ప్రాంతాలకు చెందిన డ్రగ్ వ్యాపారులకూ ఈ అక్రమ దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఇటీవల గుంటూరుకు వెళ్లి అక్కడి అధికారుల సాయంతో శేషు ఏజెన్సీ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫెన్సిడిల్ అక్రమ రవాణా వ్యవహారంలో సదరు ఏజెన్సీకి చెందిన బిల్లులు, రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని కోర్టులో సమర్పించినట్టు సమాచారం. అజంతాకు ఆగిపోయిన బిల్లుల చెల్లింపులు ఫెన్సిడిల్ అక్రమ దందా కేసులో అనుమతులు రద్దయిన అజంతా ఏజెన్సీకి వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన బిల్లులు నిలిచిపోయినట్టు సమాచారం. అజంతా ఏజెన్సీ నుంచి నాలుగైదు జిల్లాలకు చెందిన వందలాది ఏజెన్సీలు, దుకాణాలకు మందులు సరఫరా చేసేవారు. కోట్ల రూపాయల్లో వ్యాపారం నడిచేది. అయితే అజంతా ఏజెన్సీ కేసుల్లో ఇరుక్కోవడం, అందులో తమ వద్ద మందులు తీసుకునే రిటైలర్లకు ఫెన్సిడిల్ సరఫరా చేసినట్టు బోగస్ బిల్లులు తయారు చేసుకున్న వ్యవహారంలో ఆయా మెడికల్ షాప్‌ల వారు విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. తమకు సంబంధంలేని వ్యవహారంలో ఇరికించి ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహంతో ఉన్న సదరు దుకాణాదారులు అజంతాకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. బిల్లుల వసూళ్ల కోసం అజంతా ఏజెన్సీ యజమానులు ఒత్తిడి తెచ్చినా చాలా మంది ససేమిరా అంటున్నట్టు సమాచారం. -
కామారెడ్డిలో ‘డ్రగ్స్’ కలకలం
కామారెడ్డి : జిల్లాలో తాజాగా డ్రగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఈ మాఫియా మత్తును కలిగించే దగ్గు మందులతోనే దందా నిర్వహిస్తున్న వైనం జిల్లాలో కలకలం రేపుతోంది. కామారెడ్డికి చెందిన ఓ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు దగ్గు మందు (పెన్సిడిల్)ను పెద్ద ఎత్తున తెప్పించి ఎక్కువ లాభాల కోసం ఇతర దేశాలకు సరఫరా చేస్తూ ఇటీవలే నిఘా సంస్థలకు చిక్కారు. ఈ సిరప్ మోతాదుకు మించి తాగితే మత్తులోకి జారుకునే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం తయారీ కంపెనీలకు కూడా పరిమితులు విధించింది. ఏం జరిగింది కొద్ది రోజుల క్రితం ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించి కామారెడ్డిలో ఉన్న డీలర్ రెండు లక్షల పైచిలుకు కాఫ్ సిరప్ సీసాలకు ఆర్డర్ చేశా డు. సదరు కంపెనీ వారు డీలర్ సూచించిన ఏజెన్సీల పేర్లపై దగ్గు మందును సరఫరా చేశారు. కంపెనీలో పనిచేసే ఉన్నతాధికారులు ఏజెన్సీ నిర్వాహకునితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా దగ్గుమందు సీసాలను సరఫరా చేశారు. వీటిని బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తుండగా పట్టుబడిన వ్యవహారంలో విచారణ చేపట్టిన ఔషధని యంత్రణ అధికారులు వివరాలను గోప్యంగానే ఉంచుతున్నారు. మందు బాటిళ్ల తయారీ తేదీ, బ్యాచ్ నంబర్లతో పాటు వాటివెంట ఉన్న బిల్లుల ఆధారంగా ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరపగా కామారెడ్డికి చెందిన ఏజెన్సీ వివరాలు బయటపడ్డాయి. దగ్గుమందు లో ఉండే మత్తును సొమ్ము చేసుకుంటున్న డ్రగ్ మాఫియా ప్రభుత్వానికి చిక్కినా, ఆ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. బినామీ బిల్లులతో ఏజెన్సీ నిర్వాహకులు తమ ఏజెన్సీ నుంచి ఇతర ఏజెన్సీలు, దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టుగా బినామీ బిల్లులను రూపొందించి బం గ్లాదేశ్‌కు తరలిస్తున్నట్టు తేలింది. దీంతో కేసును రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు బదిలీ చేసినట్టు సమాచారం. నార్కో డ్రగ్స్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా వ్యవహరిస్తున్నా యి.డ్రగ్ కంట్రోల్ అధికారులు కామారెడ్డి, హైదరాబాద్‌లోని సదరు ఏజెన్సీలపై దాడులు జరిపి రికార్డులను సీజ్ చేసినట్టు తెలిసింది. కాగా రికార్డుల ప్రకారమే కోటి రూపాయల విలువ కలిగిన మందు సీసాలు సదరు ఏజెన్సీకి కంపెనీ నుంచి చేరినట్లు అధికారులు గుర్తిం చారు. పట్టుబడిన దగ్గు మందు 50 మి.లీ. బాటిల్ ధర ప్రింట్ రేట్ ప్రకారంగా రూ. 51.50 ఉండగా, బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తే రెండు వందల రూపాయల వరకు పలుకుతుందని సమాచారం. -
బ్లేడుతో భార్యపై భర్త దాడి
కాగజ్‌నగర్ రూరల్ : భార్యపై భర్త బ్లేడ్‌తో దాడిచేసి గాయపర్చిన సంఘటన కాగజ్‌నగర్‌లోని డీఎస్పీ కార్యాలయం ఎదుట శనివారం జరిగింది. బా ధితులు, పోలీసుల కథనం ప్రకారం.. బెజ్జూర్ మండలం ఖర్జెల్లి గ్రామానికి చెందిన రాచకొండ లచ్చన్న వివాహం 1999లో మంచిర్యాలకు చెందిన శారదతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు మణికంఠ, రామకృష్ణ. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో 2011 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. లచ్చన్న బల్లార్షాలో ఉంటుండగా.. శారద పిల్లలతో కలిసి వరంగల్‌లో ఉంటూ మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఖర్జెల్లిలోని లచ్చన్నకు చెందిన ఆస్తి విషయమై శారద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా వీరు వినకపోవడంతో కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు వద్దకు కౌన్సెలింగ్ నిమిత్తం పంపించారు. శనివారం వీరిద్దరికి డీఎస్పీ తన కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పిల్లలు ఉన్నందున కలిసి ఉండాలని డీఎస్పీ సూచించారు. మధ్యాహ్నం వరకు ఆలోచించి నిర్ణయం చెప్పాలని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయం నుంచి బయటకు రాగానే అప్పటికే తన వద్ద ఉన్న బ్లేడ్‌తో శారద మెడపై లచ్చన్న దాడి చేశాడు. శారద తన చేయి అడ్డుపెట్టగా చేతికీ తీవ్ర గాయమైంది. అక్కడే ఉన్న కాగజ్‌నగర్ రూరల్ సీఐ రవీందర్ లచ్చన్నను అదుపులోకి తీసుకుని శారదను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని టౌన్ ఎస్‌హెచ్‌వో రవికుమార్ తెలిపారు.