సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలన్న లక్ష్యంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారు.
పట్టణ పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని అందించడం కోసం పట్టణ ప్రాథమిక వైద్యాన్ని సీఎం జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. తద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పట్టణ ప్రజలు జీజీహెచ్, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇందుకోసం నగర, పట్టణ ప్రాంతాల్లో 542 డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను వైద్య శాఖ నెలకొల్పింది.
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, నగర ప్రాంతాల్లో 40 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. వీరికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 73 మున్సిపాలిటీల్లో 259 అర్బన్ హెల్త్ సెంటర్లు మాత్రమే ఉండేవి. ఇవి పేరుకే హెల్త్ సెంటర్లు. ప్రజలకు అందించిన వైద్య సేవలు మాత్రం శూన్యం. వీటిలో ఎటువంటి సౌకర్యాలూ ఉండేవి కావు. చిన్న చిన్న వైద్య పరీక్షలు కూడా చేసే అవకాశం ఉండేది కాదు. అపరిశుభ్ర వాతావరణం, వైద్యులు, వైద్య సిబ్బంది కొరత కారణంగా ప్రజలు వీటివైపు కన్నెత్తి చూసే వారే కాదు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.
గతంలో నగరాలు, పట్టణాల్లో 50 వేల జనాభాకు ఒకటి చొప్పున ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ల సంఖ్యను పెంచారు. ప్రతి 25 వేల మంది జనాభాకు ఒకటి తప్పనిసరిగా ఉండేలా డాక్టర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా విశాఖ నగరంలో గతంలో 24 ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఇప్పుడు 63కు పెరిగాయి. అదే విధంగా విజయవాడలో 29 ఉండగా ప్రస్తుతం 41 ఉన్నాయి. ఇలా అన్ని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
47.14 లక్షల ఓపీలు నమోదు
గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని సౌకర్యాలతో కూడా వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు పట్టణ పేదలకు ప్రయోజనకరంగా ఉన్నాయి. దీంతో ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య వీటిలో 47,14,261 ఓపీలు నమోదయ్యాయి. డిజిటల్ వైద్య సేవల్లో భాగంగా 30.77 లక్షల హెల్త్ రికార్డులను వీటిలోడిజిటలైజేషన్ చేశారు. 8,99,946 మంది టెలీ మెడిసన్ ద్వారా బోధనాస్పత్రుల్లోని హబ్‌లో ఉండే స్పెషలిస్ట్ వైద్యుల సేవలు పొందారు.
42.06 లక్షల ల్యాబ్ టెస్ట్‌లను ఆరోగ్య కేంద్రాల్లో చేశారు. ల్యాబ్ టెస్ట్‌ల ఫలితాలను ఎస్‌ఎంఎస్ రూపంలో రోగుల మొబైల్ నంబర్లకు పంపుతున్నారు. గర్భిణులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ సేవలూ అందుబాటులోకి తెచ్చారు ప్రతి ఆరు ఆరోగ్య కేంద్రాలను ఒక క్లస్టర్‌గా చేసి ఒక చోట అల్ట్రా సౌండ్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో మిషన్ కొనుగోలుకు రూ. 2.45 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది.
అత్యున్నత ప్రమాణాలతో
నాడు–నేడు కార్యక్రమం కింద పట్టణ ఆరోగ్య కేంద్రాలన్నింటికీ ప్రభుత్వం సొంత భవనాలను సమకూరుస్తోంది. 188 పాత భవనాలకు మరమ్మతులు చేసింది. మరో 344 కొత్త భవనాలు నిర్మిస్తోంది. వీటిలో 248 భవనాల నిర్మాణం పూర్తయింది. 240 భవనాలను వైద్య శాఖ స్వా«దీనం చేసుకుంది. మిగిలిన భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త భవనం నిర్మాణానికి రూ. 80 లక్షలు, పాత వాటి మరమ్మతులకు రూ.10 లక్షల చొప్పున ఖర్చు పెట్టారు.
ఈ భవనాలన్నింటినీ నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్(ఎన్‌క్వా‹Ù) ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఇప్పటికే 11 ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు కూడా లభించింది. ఓ వైపు పక్కా భవనాలను సమకూర్చుకుంటూనే, తాత్కాలిక భవనాల్లో 542 ఆరోగ్య కేంద్రాల కార్యకలాపాలను 2020–21లోనే వైద్య శాఖ ప్రారంభించింది. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీíÙయన్, ఇతర సిబ్బందిని నియమించారు.
అన్ని కేంద్రాల్లో వందశాతం మానవ వనరులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 3,760 మంది ఉద్యోగులను అర్బన్ హెల్త్ సెంటర్లలో కొత్తగా నియమించింది. గతంలో ఓపీ మాత్రమే ఉండగా, ఇప్పుడు ప్రతి ఆరోగ్య కేంద్రంలో పది పడకలతో ఇన్‌పేòÙంట్ విభాగం ఏర్పాటు చేసింది. 63 రకాల ల్యాబ్ వైద్య పరీక్షలు, 172 రకాల మందులు అందుబాటులో ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment