medical and dental seats
-
15, 16 తేదీల్లో వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ పీజీ వైద్య, దంత కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 16న సాయంత్రం 7 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది. తుది మెరిట్ జాబితాను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది. అట్టి మెరిట్ జాబితాలోని అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొనాలని పేర్కొంది. ఆర్మీ డెంటల్ కాలేజీ సీట్లను తదుపరి విడత కౌన్సెలింగ్లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాలకు knruhs.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించింది. -
పీజీ మెడికల్ డెంటల్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్మెంట్ కోటా సీట్లకు నీట్–2020లో అర్హత సాధించిన అభ్యర్థులు శనివారం ఉదయం 11 నుంచి 15వ తేదీ సాయంత్రం 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఆన్లైన్ దరఖాస్తులు https://pvttspgmed.tsche.in వెబ్సైట్లో ఉంటాయని, ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం ప్రొవిజనల్ మెరిట్ జాబితాను యూనివర్సిటీ విడుదల చేస్తుందని తెలిపింది. దరఖాస్తుకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు 9704093953, 8466924522లను సంప్రదించాలని సూచించింది. పూర్తి సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs. telangana.gov.in ను సందర్శించవచ్చని పేర్కొంది. -
నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష
-
భారీగా పెరిగిన మెడికల్, డెంటల్ సీట్ల ఫీజులు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సంబంధిత సీట్లకు రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో మెడికల్ మరియు డెంటల్ కాలేజీ సీట్ల ఫీజులు భారీగా పెరిగాయి. A కేటగిరికి చెందిన మెడికల్ సీటు ఫీజు మొత్తం రూ10 వేలు ఉండగా, C కేటగిరి సీటు ఫీజు మొత్తాన్ని రూ. 55 లక్షలుగా నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఫీజుల వివరాలను వెల్లడించారు. పెరిగిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.. మెడికల్: A కేటగిరి సీట్లకు రూ. 10 వేలు, B కేటగిరి సీట్లకు రూ.11 లక్షలు, C కేటగిరి సీట్లకు రూ.55 లక్షలు డెంటల్: A కేటగిరీ సీట్లకు రూ. 10 వేలు, B కేటగిరి సీట్లకు 4 లక్షల 50 వేలు, C కేటగిరి సీట్లకు 22 లక్షలు