భారీగా పెరిగిన మెడికల్, డెంటల్ సీట్ల ఫీజులు
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సంబంధిత సీట్లకు రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో మెడికల్ మరియు డెంటల్ కాలేజీ సీట్ల ఫీజులు భారీగా పెరిగాయి. A కేటగిరికి చెందిన మెడికల్ సీటు ఫీజు మొత్తం రూ10 వేలు ఉండగా, C కేటగిరి సీటు ఫీజు మొత్తాన్ని రూ. 55 లక్షలుగా నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఫీజుల వివరాలను వెల్లడించారు.
పెరిగిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి..
మెడికల్: A కేటగిరి సీట్లకు రూ. 10 వేలు, B కేటగిరి సీట్లకు రూ.11 లక్షలు, C కేటగిరి సీట్లకు రూ.55 లక్షలు
డెంటల్: A కేటగిరీ సీట్లకు రూ. 10 వేలు, B కేటగిరి సీట్లకు 4 లక్షల 50 వేలు, C కేటగిరి సీట్లకు 22 లక్షలు