Medical certificate
-
అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: అమర్నాథ్ వెళ్లే యాత్రికులకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్ సర్టిíఫికెట్లు జారీ చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమర్నాథ్ 2022 యాత్ర జూన్ 30 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఉంటుంది. యాత్రకు వెళ్లేందుకు నిర్దేశించిన మెడికల్ బోర్డు నుంచి తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువీకరణ పత్రం పొందాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, వయసును ధ్రువీకరించే ఇతర సర్టిఫికెట్లతో దగ్గర్లోని ప్రభుత్వ బోధనాసుపత్రికి యాత్రికులు వెళ్లాలి. అక్కడి రిసెప్షన్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వరుస క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించే తేదీని నిర్ణయిస్తారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు దరఖాస్తు చేసుకున్న వారి వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మెడికల్ సర్టిఫికెట్లు..) -
‘నకిలీ’లా.. నో ప్రాబ్లమ్!
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీల్లో రోజుకో వింత వ్యవహారం వెలుగు చూస్తోంది. ఓ వైపు విద్యాశాఖ వైఖరితో బదిలీల కౌన్సెలింగ్ తేదీలు పొడిగిస్తుండగా.. మరోవైపు నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో కొందరిపైనే చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2వేల మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ప్రాథమికంగా గుర్తించినా 30 మందిపైనే చర్యలు తీసుకోవడంపై టీచర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యాధికారులపైనా వేటు వేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది..! ఉపాధ్యాయుడి భార్యకు దీర్ఘకాలిక జబ్బులున్నా లేదా దీర్ఘకాలిక జబ్బులు, మానసిక వికలాంగులున్న పిల్లలున్నా వారికి విద్యాశాఖ 10 పాయింట్లు ఇస్తుంది. దీనికి మెడికల్ బోర్డుల నుంచి ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఇదే అదనుగా కొందరు టీచర్లు అడ్డదారిలో నకిలీ సర్టిఫికెట్లు పొంది ప్రాథమిక సీనియారిటీ జాబితాలో అదనపు పాయింట్లు సాధించారు. ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తడంతో తేరుకున్న శాఖ.. కొన్ని దరఖాస్తులను లోతుగా పరిశీలించి నకిలీవని తేల్చింది. కొందరు స్వచ్ఛందంగా మెడికల్ కేటగిరీ పాయింట్లు రద్దు చేయా లని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు ప్రాథమికంగా తేల్చారు. మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన టీచర్లపై ఆయా జిల్లా కలెక్టర్లు వేటు వేశారు. కానీ మిగతా జిల్లాల్లో ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. చర్యలు కొందరిపైనే! బదిలీ దరఖాస్తుల్లో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారందరిపై చర్యలు తీసుకోకుండా కొందరిపైనే విద్యాశాఖ వేటు వేయడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. దరఖాస్తు ల పరిశీలనలో నకిలీవని తేలితే తప్పనిసరిగా వేటు వేయాలని ఇప్పటికే డిమాండ్ చేశాయి. కానీ సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పదుల సంఖ్యలో టీచర్లపైనే చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2,000 మంది బోగస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు గుర్తించినా దాదాపు 30 మందిపైనే చర్యలు తీసుకోవడం గమనార్హం. ఆ వైద్యాధికారులపై చర్యలేవి? ఒక్కో నకిలీ సర్టిఫికెట్‌కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వైద్యాధికారులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. రంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంగనర్, నిజామాబాద్ జిల్లాల్లోనే ఎక్కువగా మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక జబ్బులతో పాటు వైకల్య నిర్ధారణలోనూ ఇదే తరహా నకిలీలు పుట్టుకొచ్చినట్లు సమాచారం. అడ్డగోలుగా సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యాధికారులపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, వీటిని ముంద స్తుగా కట్టడి చేసి ఉంటే ఇంత భాగోతం జరిగేది కాదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. టీచర్లతో పాటు వైద్యాధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి: పీఆర్టీయూ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన టీచర్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు సరోత్తంరెడ్డి, చెన్నకేశవరెడ్డి కోరారు. సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యాధికారులపైనా చర్యలు తీసుకోవాల న్నారు. మెదక్ జిల్లాలో కొందరు టీచర్లు సరైన సర్టిఫికెట్లు ఇచ్చినా వారిని కలెక్టర్ సస్పెండ్ చేశారని, సస్పెన్షన్‌ను వెనక్కు తీసుకోవాలని కోరారు. బదిలీల సమయంలో గందరగోళం నెలకొనడంతో మిగతా టీచర్లు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు లోతు గా పరిశీలిస్తే ఇబ్బందులుండవని టీఆర్టీఎఫ్ గౌరవాధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి అన్నారు. -
'టూర్‌కి వెళతారా.. ఎయిడ్స్ ఉందో లేదో చెప్పండి'
న్యూఢిల్లీ: ఓ కార్యక్రమానికి సంబంధించి ప్రాణాంతక, ధీర్ఘకాలిక వ్యాధులు లేనట్లుగా మెడికల్ సర్టిఫికెట్లు జతపర్చాల్సిందిగా కేంద్రం ఆయా సీనియర్ ప్రభుత్వాధికారులను ఆదేశించింది. వచ్చే నవంబర్ 2 నుంచి అదే నెల 30వరకు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగే ఓ అంతర్జాతీయ సదస్సుకు హాజరయ్యేందుకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. దీనికోసం ధారాళంగా ఆంగ్లంలో మాట్లాడటంతోపాటు రాయగల అనుభవజ్ఞులు, ఆరోగ్యపుష్టి కలవారు అర్హులని పేర్కొంది. దీంతోపాటు వారంతా తమకు ఎయిడ్స్, టీబీ, ట్రకోమా, చర్మవ్యాధులు లేనట్లుగా నిర్ధారించే మెడికల్ సర్టిఫికెట్లు జత చేర్చాలని షరతుగా పెట్టింది. ఇక మహిళలయితే ముందస్తు గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న సర్టిఫికెట్లు జత చేర్చాలని స్పష్టం చేసింది. దీంతోపాటు వారు ఎందుకు ఆ సదస్సుకు హాజరుకావాలనుకుంటున్నారో, ఏ విధంగా లబ్ధి పొందాలనుకుంటున్నారో వివరంగా పేర్కొనాలని తెలిపింది. ఖర్చులతోపాటు ఈ టూర్ సమయంలో కేంద్రం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆర్థిక, సామాజిక అంశాలపై బ్యాంకాక్ సదస్సులో నెల రోజులపాటు శిక్షణా కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ శుక్రవారమే ఆఖరు తేది. -
‘మనూ’లో పారా మెడికల్‌కు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్ : మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో పారా మెడికల్ సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లో చేరడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. డయాలసిస్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లో సర్టిఫికెట్ కోర్సులను, డయాలసిస్ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లో డిప్లొమా కోర్సుల కోసం దరఖాస్తులను కోరుతున్నారు. దరఖాస్తులను జూలై 2లోగా వర్సిటీలో సమర్పించాలి.