mega pixel
-
సంచలనం, భారత్‌లోకి మొదటి 200 మెగా పిక్సల్ కెమెరా ఫోన్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే!
అమెరికా స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా (Motorola) అదిరిపోయే స్పెసిఫికేషన్లతో రెండు మొబైల్స్‌ని భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా (Motorola Edge 30 Ultra), మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ (Motorola Edge 30 Fusion) పేరుతో ఈ రెండు సెప్టంబర్ 13న ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ విషయాన్ని మోటోరోలా అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా 200 మెగాపిక్సెల్ కెమెరా కావడం.. ఈ ఫోన్ ప్రత్యేకతని చెప్పచ్చు. మరోరకంగా చెప్పలంటే ఇంత భారీ స్థాయిలో పిక్సల్ కెమెరాతో దేశంలో లాంచ్ కానున్న తొలి మొబైల్ కూడా ఇదే. అదిరిపోయే దీని ప్రత్యేకతలు, ఫీచర్లను ఓ లుక్కేద్దాం. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ప్రత్యేకతలు ►క్వాల్కామ్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్. ►ఎడ్జ్ 30 అల్ట్రా ట్రిపుల్ కెమెరా సెటప్, 200-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ సెన్సార్. ముందు భాగంలో, 60-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ►6.67-అంగుళాల పూర్తి-HD+ OLED డిస్ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ►4,160mAh బ్యాటరీ, 125వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, వైర్లెస్ చార్జింగ్. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు. మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ప్రత్యేతలు ►స్నాప్‌డ్రాగన్ 888+ (Qualcomm Snapdragon) ప్రాసెసర్, ►6.55 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ pOLED డిస్ప్లే. 144Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్. ►Motorola Edge 30 Fusion వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. కెమెరా పరంగా, ఎడ్జ్ 30 ఫ్యూజన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ►4,400mAh బ్యాటరీ, 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్. ఇప్పటికే ఈ రెండు స్మార్ట్ఫోన్లు యూరోపియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యాయి. ఎడ్జ్ 30 ప్యూజన్ ఐరోపాలో 600 యూరోలు (సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ. 48,000) ఉంటుందని అంచనా. ఇది ఫ్యూజన్ కాస్మిక్ గ్రే, అరోరా వైట్, సోలార్ గోల్డ్, నెప్ట్యూన్ బ్లూ వంటి కలర్స్‌లో లభ్యమవుతుంది. అదేవిధంగా, ఎడ్జ్ 30 అల్ట్రా ధర 899.99 యూరోలు (సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ. 72,900) ఉంటుందని అంచనా. ఈ మొబైల్ స్టార్‌లైట్ వైట్, ఇంటర్స్టెల్లార్ బ్లాక్ రంగులలో వస్తోంది. చదవండి: ట్విటర్‌పై మరో బాంబు వేసిన ఎలాన్ మస్క్ -
Samsung Vs One Plus: కెమెరాల పని అయ్యింది ఇక డిస్ప్లేల వంతు!
సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఉన్న ఇండియాలో కొత్త యుద్దానికి తెర లేచింది. ఇంత కాలం చిప్సెట్స్, కెమెరాల విషయంలో పోటాపోటీగా మోడళ్లు విడుదల చేసిన ఫోన్ తయారీ కంపెనీలు ఇప్పుడు డిస్ప్లే కేంద్రంగా వార్ రెడీ అయ్యాయి. బ్రాండ్ వార్ స్మార్ట్‌ఫోన ఇండస్ట్రీలో గడిచిన ఐదేళ్లలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. శామ్సంగ్, యాపిల్ వంటి బడా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ చైనాకు చెందిన వన్‌ప్లస్, షావోమీ, రియల్మీ, ఒప్పో, వివోలు మార్కెట్‌పై పట్టు సాధించాయి. మైక్రోమ్యాక్స్, సెల్కాన్ వంటి దేశీ కంపెనీలను చైనా మొబైల్ బ్రాండ్స్ వెనక్కి నెట్టాయి. నోకియా ఇంకా ఫీచర్ ఫోన్లను దాటి ముందుకు రాలేకపోయింది. హ్యువావే, ఎల్జీ, సోనిలు పత్తా లేకుండా పోయాయి. ప్రస్తుతం శామ్సంగ్, చైనా కంపెనీల మధ్యనే ప్రైస్‌వార్, ఫీచర్ వార్ జరుగుతోంది. ఎన్ని కెమెరాలు, పిక్సెల్ ఎంత స్మార్ట్ఫోన్లకు సంబంధించి గడిచిన నాలుగేళ్లుగా వెనుక వైపు ఎన్ని కెమెరాలు ఉన్నాయి. వాటి మెగాపిక్సెల్ ఎంత అనే అంశం చుట్టూనే ఇటు శామ్సంగ్, అటు షావోమీ వంటి చైనా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ పోటీ పెరిగి వెనుక వైపు నాలుగు, ముందు వైపు రెండు కెమెరాలు అందించే స్థాయికి చేరుకున్నాయి. ఇక కెమెరా సామర్థ్యానికి సంబంధించి 16 మెగా పిక్సెల్స్ దగ్గర మొదలైన పోటీ 48 మెగా పిక్సెల్స్ మీదుగా 108 మెగా పిక్సెల్స్ వరకు చేరుకుందీ. ఇదే సమయంలో ర్యామ్ కెపాసిటీ విషయంలోనూ పోటీ నెలకొని ఉండేది. ఇక్కడ కూడా ఇరు వర్గాలు సమస్థాయికి చేరుకున్న బ్యాటరీ సామర్థ్యం మీద ఫోకస్ చేశాయి. టాప్ నాచ్, డ్రాప్ నాచ్ అంటూ మోడళ్లు విడుదల చేసినా అవి లాంగ్‌రన్‌లో ప్రభావం చూపలేదు. కెమెరా, ర్యామ్, ప్రాసెసర్లే ప్రధానంగా పోటీ నెలకొంది. డిస్ప్లే క్వాలిటీ విషయంలో పోటీ ఉన్నా హెచ్డీ, ఫుల్హెచ్డీ దగ్గరే చైనా కంపెనీలు ఆగిపోగా శామ్సంగ్ అమోల్డ్ డిస్ప్లే తో అదరగొట్టింది. శామ్సంగ్ నోట్, ఎస్ సిరీస్‌లో 4కే డిస్ప్లేలు ఇచ్చి టాప్‌గా నిలవగా వన్‌ప్లస్ సైతం బరిలోకి దిగింది. వీడియో కంటెంట్‌కి గిరాకీ జియో రాకతో ఒక్కసారిగా ఇండియాలో నెట్ కంటెంట్ వాడకం పెరిగింది. దీనికి తోడు లాక్డౌన్ కారణంగా వీడియో కంటెంట్‌కి డిమాండ్ పెరిగింది. రోజుకో వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ అందుబాటులోకి వస్తోంది. దీంతో డిస్ప్లే క్వాలిటీతో పాటు సైజుకి కూడా ప్రాధాన్యత పెరిగింది. గతేడాదే శామ్సంగ్ జెడ్ సిరీస్‌లో ఫ్లిప్ అంటూ డబుల్ డిస్ప్లే ఫోన్లను అందుబాటులోకి తెచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో జెడ్ సిరీస్‌కే మరిన్ని హంగులు జోడించి ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. జెడ్ సిరీస్‌లో రెండు తెరలు కలిపితే స్క్రీన్ సైజు 7.30 ఇంచులుగా ఉంది. దాదాపు ట్యాబ్ స్థాయిలో ఈ స్ర్రీన్ ఉండనుంది. శామ్సంగ్ వర్సెస్ వన్ ప్లస్ నాణత్య పాటిస్తూ తక్కువ బడ్జెట్లో హై ఎండ్ ఫీచర్లు అందిస్తూ వన్ ప్లస్ బ్రాండ్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకుంది. హై ఎండ్ సెగ్మెంట్లో యాపిల్, శామ్‌సంగ్‌కి ధీటుగా ఎదిగింది. బడ్జెట్‌కి ప్రాముఖ్యత ఇచ్చే ఇండియన్ మార్కెట్లో స్థిరమైన స్థానం సాధించింది. అన్నింటా శామ్సంగ్, యాపిల్‌కు పోటీ ఇచ్చే వన్‌ప్లస్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదంటోంది. ఆగస్టులో బిగ్ స్క్రీన్ ఫోన్ రిలీజ్ చేస్తామంటూ శామ్సంగ్ దాదాపు రెండు నెలల ముందు నుంచే లీకులు ఇస్తూ వచ్చింది. చివరకు ఆగస్టు 11న డేట్ ఫిక్స్ చేసింది. సరిగ్గా శామ్సంగ్ ఈవెంట్‌కి ఒక్క రోజు ముందే వన్‌ప్లస్ సప్రైజింగ్ న్యూస్ చెప్పింది. తమ బ్రాండ్ నుంచి కూడా బిగ్ స్క్రీన్ ఫోన్ వస్తోందంటూ వన్‌ప్లస్ యూఎస్ఏ ట్విట్టర్ పేజీలో టీజర్ రిలీజ్ అయ్యింది. దీంతో రెండు కంపెనీల మధ్య ఆసక్తికర పోరుకి తెరలేచింది. 8.11 10am EThttps://t.co/mmPi4jlrhx pic.twitter.com/U6lPdrFnjf — OnePlus➕ (@OnePlus_USA) August 10, 2021 ప్రభావం చూపుతుందా ? మొబైల్ బ్రాండ్ల మధ్య ధర, కెమెరా, ర్యామ్, చిప్సెట్, బ్యాటరీ బ్యాకప్ విషయంలోనే గట్టి పోటీ నెలకొంది. వీటి ఆధారంగానే అమ్మకాలు సాగాయి. మధ్యలో ఫింగర్ ప్రింట్ స్కానర్, నాచ్, డిస్ ప్లే రి ఫ్రెష్ రేటు విషయంలో కంపెనీలు ప్రయోగాలు చేసినా అవేమీ అమ్మకాలపై గణనీయమైన ప్రభావం చూపలేదు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ వార్ నిజంగానే ప్రభావం చూపుతుందా లేక కొద్ది కాలం హడావుడి తర్వాత సద్దుమణుగుతుందా అనేది తేలాల్సి ఉంది. -
బాప్రే! ఇది నోకియా ‘బాహుబలి’
ఒకప్పుడు మొబైల్ ఫోన్ బ్రాండ్లలో నోకియా అంటే మన్నికకు మరో పేరు. ఈ కంపెనీ ఫోన్లు కొంటే త్వరగా రిపేరుకు రావని ఎక్కువ కాలం వాడుకోవచ్చనే నమ్మకం ప్రజల్లో ఉండేది. ఇంతకాలం ఫీచర్లపై దృష్టి పెడుతూ వచ్చిన నోకియా ఈసారి రూటు మార్చి ఎక్కువ కాలం వాడుకునేలా ధృఢమైన ఫోన్‌ని మార్కెట్లోకి తేనుంది. పూర్వ వైభవం కోసం ఒకప్పుడు ఇండియా మొబైల్ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన నోకియా మరోసారి పునర్వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నోకియా యాజమాన్య బాధ్యతలు హెచ్ఎండీ గ్లోబల్‌కి మారిన తర్వాత గత ఐదేళ్లుగా రకరకాల మోడల్స్‌ని ప్రవేశ పెట్టినా పెద్దగా మార్కెట్ సాధించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మార్కెట్లో పట్టు సాధించే లక్ష్యంతో కొత్త మొబైల్‌ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ ఫీచర్లతో ఎస్ఆర్ 20 మొబైల్‌ని నోకియా మార్కెట్లోకి తెచ్చింది. కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ ఎక్కువ కాలం మన్నిక ఉండేలా ఫోన్‌ను డిజైన్ చేసింది. ఈ మొబైల్‌కి ఐపీ 68 సర్టిఫికేట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడంతో డస్ట్ ఫ్రూఫ్, వాటర్ ప్రూఫ్‌గా పని చేస్తుంది. అంతేకాదు 1.8 ఎత్తు నుంచి కింద పడినా పగిలిపోకుండా ఉండేలా డిస్ప్లే ధృడంగా తయారు చేసింది. లేటెస్ట్ 5జీ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 480 ఇంటర్నల్ ఫీచర్లకు సంబంధించి నోకియా కొంత మేరకు కాంప్రమైజ్ అయ్యింది. స్నాప్‌డ్రాగన్ 480 చిప్సెట్ని ఉపయోగించింది. 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజీ వేరియంట్లలో అందిస్తోంది. వెనుక వైపు 48 మెగా పిక్సెల్, 13 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన రెండు కెమెరాలను అందించింది. వీటికి విడివిడిగా ఎల్ఈడీ ఫ్లాష్‌లను ఇచ్చింది. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్. ప్రస్తుతం మార్కెట్లో 4కే డిస్ప్లేల హవా నడుస్తుండగా నోకియా 6.7 అంగులాల ఫుల్హెచ్డీ డిస్‌ప్లేకే పరిమితమైంది. కాకపోతే తడి చేతులతో ముట్టుకున్నా ‘టచ్’ పని చేసేలా డిజైన్ చేసింది. వైర్లెస్ ఫాస్ట్ ఛార్జర్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌పై ఈ మొబైల్ ఫోన్ పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్తయం 4,630 ఎంపీఎహెచ్గా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వాడుకోవచ్చని నోకియా హామీ ఇస్తోంది. ఈ మొబైల్‌కు సపోర్ట్‌గా 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జర్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జర్‌ను అందిస్తోంది. సెక్యూరిటీగా ఫ్రింగర్ ప్రింట్ స్కానర్‌ని ఫోన్ డిస్పై వైపు కాకుండా పవర్ బటన్ ఉండే వైపున ఏర్పాటు చేసింది. ఆగస్టు 24న నోకియా ఎక్స్ఆర్ 20 మోడల్ని ఆగస్టు 24 మార్కెట్లో అమ్మకానికి రానుంది,. మొబైల్ ధర రూ.43,800ల నుంచి ప్రారంభం కానుంది. ఈ మొబైల్‌కి సంబంధించి నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని నోకియా తెలిపింది. -
స్మార్ట్ ఫోన్లో 200 మెగాపిక్సెల్ కెమెరా!.. సాధ్యమేనా?
యూజర్లకు తగ్గట్లు ఫీచర్స్ అందులో క్వాలిటీ కెమెరాలతో ఫోన్లను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి కంపెనీలు. అయితే రాబోయే రోజుల్లో 200 మెగాపిక్సెల్‌తో కెమెరాలు రాబోతున్నాయని, ఈ మేరకు షియోమీ-శాంసంగ్ కంపెనీలు పోటాపోటీ ఉండబోతున్నాయని, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయబోతున్నాయని.. ఓ ఇలా రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఏ కంపెనీ నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే.. సాక్షి, వెబ్‌డెస్క్: శాంసంగ్ ఎస్ సిరీస్‌లో భాగంగా.. గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ కెమెరాను ఇంట్రెడ్యూస్ చేయనుందని ప్రచారం ఇప్పుడు నడుస్తోంది. అయితే ప్రచారానికి బలం చేకూరేలా ఇప్పుడు మరో వాదన తెర మీదకు వచ్చింది. గెలాక్సీ ఎస్21 అల్ట్రాలో కెమెరా కెపాసిటీ 108 మెగాపిక్సెల్. అయితే ఎస్22 మోడల్‌తో శాంసంగ్ అరుదైన ప్రయోగానికి తెర తీయబోతోందని, ఐదు కెమెరాల వ్యవస్థ(అర్రే) తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటూ కొరియాకు చెందిన ప్రముఖ బిజినెస్ వెబ్సైట్‘పల్స్’ ఓ కథనం ప్రచురించింది. ఇక ఈ కెమెరా ఫిట్టింగ్ కోసం జపాన్‌కు చెందిన కెమెరా లెన్స్‌ల కంపెనీ ఒలింపస్‌తో శాంసంగ్ ఒప్పందం కూడా కుదుర్చుకుందని పేర్కొంది. అయితే ఈ కథనంపై ఒలింపస్ కానీ, శాంసంగ్ కానీ స్పందించలేదు. 200 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటికీ అవుట్‌స్టాండింగ్ ఫొటోలు తీయడం కష్టమని కొందరు అభిప్రాయపడుతుండగా.. అది వీలుపడొచ్చని టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్21లో 108 మెగాపిక్సెల్ సెన్సార్, వైడ్ యాంగిల్లో క్వాలిటీ ఫొటోలు తీయడానికి వీలుపడుతోంది. కాబట్టి, 200 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేది నిజమే అయితే వైడ్ యాంగిల్ షాట్స్‌లో క్వాలిటీ ఫొటోలు తీయడం వీలు అవుతుందని చెబుతున్నారు. టెలిఫొటో లెన్స్ ద్వారా ఆప్టికల్, డిజిటల్ జూమ్ కాంబోలో క్వాలిటీ ఫొటోలు తీయొచ్చని.. తద్వారా పిక్చర్ క్లియర్‌గా వచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 2022 ఆరంభంలో 200మెగాపిక్సెల్ కెమెరా, ఎస్ పెన్‌తో రావొచ్చు.. లేదంటే లేదు. షియోమీ సంగతి! షియోమీ ఎంఐ 12 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోందని ‘డిజిటల్ చాట్ స్టేషన్’ పేర్కొంది. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ ఎస్ఎం 8450 సాస్ని ఇవ్వగా.. 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కెమెరాను ఇస్తుందని ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై షియోమీ సైతం స్పందించడంలేదు. -
64 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ 64 మెగా పిక్సెల్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తోంది. శామ్సంగ్ జీడబ్ల్యూ1 సెన్సార్‌తో అభివృద్ధి చేసిన ఈ కెమెరాతో తీసిన చిత్రాన్ని కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ ట్వీట్ చేశారు. మొదటిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేస్తారు. ప్రపంచంలో తొలిసారిగా 64 మెగా పిక్సెల్ కెమెరాను పొందుపరిచిన స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం. శామ్సంగ్ టెట్రాసెల్ టెక్నాలజీతో తయారైన ఈ కెమెరాతో తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన చిత్రాలను తీయవచ్చు. వెనుకవైపు నాలుగు కెమెరాలు పొందుపరిచారు. కాగా, రియల్మీ జనవరి– మార్చి కాలంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 7.25 శాతం వాటా దక్కించుకుంది. డిసెంబర్ నాటికి 12–15 శాతం వాటాను లక్ష్యంగా చేసుకుంది. -
భారత్‌లోకి 41 ఎంపి నోకియా లూమియా 1020
న్యూఢిల్లీ: ఫొటోగ్రఫీ ప్రియుల కోసం నోకియా కంపెనీ 41 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్, లూమియా 1020ను త్వరలో మార్కెట్లోకి తేనున్నది. వచ్చే నెల 11 నుంచి వీటి విక్రయాలు ప్రారంభిస్తామని, ధరను వచ్చే నెల 10న ప్రకటిస్తామని నోకియా కంపెనీ పేర్కొంది. అయితే ఈ ఫోన్ ధర రూ.47,000-48,000 ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. విదేశాల్లో ఈ ఫోన్‌ను నోకియా కంపెనీ 800 డాలర్లకు విక్రయిస్తోంది. తమ లూమియా ఫోన్లకు మంచి స్పందన లభిస్తోందని, ఈ లూమియా 1020కు కూడా అదే స్థాయి ఆదరణ లభించగలదని నోకియా ఇండియా ఎండీ పి.బాలాజీ చెప్పారు. డ్యుయల్ కాప్చర్ ఫీచర్ ఉన్న ఈ ఫోన్లో ఉన్న నోకియా ప్రో కెమెరా యాప్‌తో ఎవరైనా ప్రొఫెషనల్ క్వాలిటీ ఫొటోలు తీయవచ్చని పేర్కొన్నారు. విండోస్ 8 ఓఎస్‌పై పనిచేసే లూమియా 1020లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 11.43 సెం.మీ. డిస్ప్లే, క్వాల్కామ్ స్పాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, సూపర్ సెన్సిటివ్ టచ్‌స్క్రీన్ వంటి ప్రత్యేకతలున్నాయి. లూమియా రేంజ్లో లూమియా 520 చౌక ఫోన్ అని, ఆన్లైన్ అమ్మకాల్లో ఈ ఫోన్ల హవా అధికంగా ఉందని నోకియా ఇండియా డెరైక్టర్ విపుల్ మెహరోత్రా చెప్పారు. ఈ కంపెనీ లూమియా రేంజ్లో మొత్తం 13 మొబైల్ ఫోన్లను విక్రయిస్తోంది. మరికాస్త పుంజుకున్న రూపీ ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో వరుసగా రెండవ రోజూ బలపడింది. బుధవారం ముగింపుతో పోల్చితే 37 పైసలు లాభపడి 62.07 వద్ద ముగిసింది. ఇది వారం గరిష్టస్థాయి. ఎగుమతిదారుల అమెరికా కరెన్సీ అమ్మకాలు, ఈక్విటీ మార్కెట్ల లాభాలు రూపాయి ట్రేడింగ్‌పై సానుకూల ప్రభావం చూపాయి. పండుగల సీజన్ నేపథ్యంలో వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) ఇబ్బందులు లేకుండా రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందన్న వార్తలు సైతం రూపాయి బలోపేతానికి కారణమని ట్రేడర్లు పేర్కొన్నారు.