యూజర్లకు తగ్గట్లు ఫీచర్స్ అందులో క్వాలిటీ కెమెరాలతో ఫోన్లను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి కంపెనీలు. అయితే రాబోయే రోజుల్లో 200 మెగాపిక్సెల్‌తో కెమెరాలు రాబోతున్నాయని, ఈ మేరకు షియోమీ-శాంసంగ్ కంపెనీలు పోటాపోటీ ఉండబోతున్నాయని, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయబోతున్నాయని.. ఓ ఇలా రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఏ కంపెనీ నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే..
సాక్షి, వెబ్‌డెస్క్: శాంసంగ్ ఎస్ సిరీస్‌లో భాగంగా.. గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ కెమెరాను ఇంట్రెడ్యూస్ చేయనుందని ప్రచారం ఇప్పుడు నడుస్తోంది. అయితే ప్రచారానికి బలం చేకూరేలా ఇప్పుడు మరో వాదన తెర మీదకు వచ్చింది. గెలాక్సీ ఎస్21 అల్ట్రాలో కెమెరా కెపాసిటీ 108 మెగాపిక్సెల్. అయితే ఎస్22 మోడల్‌తో శాంసంగ్ అరుదైన ప్రయోగానికి తెర తీయబోతోందని, ఐదు కెమెరాల వ్యవస్థ(అర్రే) తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటూ కొరియాకు చెందిన ప్రముఖ బిజినెస్ వెబ్‌సైట్‘పల్స్’ ఓ కథనం ప్రచురించింది.
ఇక ఈ కెమెరా ఫిట్టింగ్ కోసం జపాన్‌కు చెందిన కెమెరా లెన్స్‌ల కంపెనీ ఒలింపస్‌తో శాంసంగ్ ఒప్పందం కూడా కుదుర్చుకుందని పేర్కొంది. అయితే ఈ కథనంపై ఒలింపస్ కానీ, శాంసంగ్ కానీ స్పందించలేదు. 200 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటికీ అవుట్‌స్టాండింగ్ ఫొటోలు తీయడం కష్టమని కొందరు అభిప్రాయపడుతుండగా.. అది వీలుపడొచ్చని టెక్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్21లో 108 మెగాపిక్సెల్ సెన్సార్, వైడ్ యాంగిల్‌లో క్వాలిటీ ఫొటోలు తీయడానికి వీలుపడుతోంది.
కాబట్టి, 200 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేది నిజమే అయితే వైడ్ యాంగిల్ షాట్స్‌లో క్వాలిటీ ఫొటోలు తీయడం వీలు అవుతుందని చెబుతున్నారు. టెలిఫొటో లెన్స్ ద్వారా ఆప్టికల్, డిజిటల్ జూమ్ కాంబోలో క్వాలిటీ ఫొటోలు తీయొచ్చని.. తద్వారా పిక్చర్ క్లియర్‌గా వచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 2022 ఆరంభంలో 200మెగాపిక్సెల్ కెమెరా, ఎస్ పెన్‌తో రావొచ్చు.. లేదంటే లేదు.
షియోమీ సంగతి!
షియోమీ ఎంఐ 12 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోందని ‘డిజిటల్ చాట్ స్టేషన్’ పేర్కొంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ఎస్ఎం 8450 సాస్‌ని ఇవ్వగా.. 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కెమెరాను ఇస్తుందని ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై షియోమీ సైతం స్పందించడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment