Mehidipatnam
-
నెగిటివ్ రోల్స్ ఇష్టం
ఆయన సినిమా చూస్తుంటే మన పక్కింటి బాషా భాయ్... ఎదురింటి శంకరన్న మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా హైదరాబాదీ గల్లీలు మన కళ్లకు కడతాయి. బాలీవుడ్ బాద్షాలా... హైదరాబాదీలకు ఓ ఖాన్ ఉన్నాడు. హాఫ్ ప్రై, జబర్దస్త్, గుళ్లుదాదాల్లో నెగిటివ్ రోల్స్‌లో మెప్పించి, ఏక్తా సర్దార్తో కథానాయకుడిగా హైదరాబాదీల మనసు దోచుకున్న ఆ ఖాన్.. తౌఫిక్ ఖాన్. నటుడిగానే పరిమితమవ్వకుండా మినార్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఏర్పాటు చేసి... సిటీ కల్చర్‌ను, సిటీకే సొంతమైన భాషను దృశ్యమానం చేస్తున్నాడు. త్వరలో మరో సినిమా ముహూర్తానికి రెడీ అవుతున్న ఖాన్‌ను సాక్షి సిటీప్లస్ పలకరించింది. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే... ..:: దార్ల వెంకటేశ్వరరావు తెరపై నన్ను నేను చూసుకోవాలని మెహిదీపట్నంలోని రిషి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగానే కళాశాల నాటకాల్లో నటించేవాణ్ణి. డ్రామాల్లో నన్ను చూసిన ఫ్రెండ్స్ మెచ్చుకునే వాళ్లు. అప్పుడే సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా కలిగింది. స్నేహితుల సహకారంతో మొదట నాలుగు సినిమాల్లో నటించాను. నెగిటివ్ రోల్స్ ఇష్టం. అందుకే మొదట అవి చేశాను. తరువాత సొంత బ్యానర్ ‘మినార్ ఫిల్మ్ ప్రొడక్షన్’ ఏర్పాటు చేశాను. ఈ క్రమంలో నా దోస్తులు సయ్యద్ హమీదుద్దీన్, జాఫర్ హుస్సేన్ మిరాజ్, జయంత్‌ల ప్రోత్సాహం మరువలేనిది. రియల్ స్టోరీ... నాలుగు చిత్రాల తర్వాత ఏక్తాసర్దార్ సొంత బ్యానర్‌పైనే నిర్మించాను. ఇందులో లీడ్‌రోల్ చేశాను. హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం గడిపే ఓ ఆటోడ్రైవర్ పోలీసుల వేధింపులతో సర్దార్‌గా ఎలా మారాడనేది ఆ చిత్ర సారాంశం. హైదరాబాదీ భాష, వ్యవహారంతో పాటు అచ్చ హైదరాబాదీ చిత్రంలా ఉండేందుకు నా ఫ్రెండ్స్ అక్బర్బిన్ తబర్, అద్నాన్ సాజిద్, గుళ్లుదాదా, ఆర్కే మామ, అజీజ్ నాసిర్, అల్తాఫ్ హైదర్ గ్యాంగును తీసుకున్నా. ఈ చిత్రంలో బాగా నటించేందుకు ముంబై నుంచి శిక్షకులను పిలిపించుకుని, వారి దగ్గర మూడు సంవత్సరాల పాటు శిక్షణ తీసుకున్నా. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కోసం టాలీవుడ్లో పెద్ద నటుడైన ముఖేష్ రిషీని ఒప్పించాం. ఆయన అంగీకరించడం సంతోషాన్నిస్తే... ఆ చిత్రం హైదరాబాద్‌లో 100 రోజులు ఆడటం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. దీనికి సీక్వెల్‌గా కొత్త సినిమా ప్రారంభిస్తున్నా. సొంతానికి వాడుకోను... సినిమాలో నటించినపుడు వచ్చిన డబ్బు, చిత్ర నిర్మాణం తర్వాత వచ్చిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోను. వచ్చిన డబ్బంతా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తా. ఆ అల్లా దయతో నాకు ఈ జీవితానికి కావాల్సినంత డబ్బు బిజినెస్ ద్వారా వస్తుంది. సినిమాలో వచ్చినా రాకపోయినా 365 రోజులు సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటా. బియ్యం, రంజాన్ సమయంలో దుస్తులు, పండుగ సరుకులు అందిస్తుంటా. సేవలో ఉండే ఆనందం చాలా గొప్పది. తల్లిదండ్రుల పేరుతో యాకుత్‌పుర అమన్‌నగర్‌లో అమీనా యూసుఫ్ మసీదు నిర్మించా. సినిమాల్లో నటించడం డబ్బు కోసం కాదు కాబట్టే ఇంత కాలం ఇతర సినిమాల్లో ఆఫర్లు వచ్చినా వదులుకున్నా. అయితే ఈ సారి వస్తే నటించి, ఆ డబ్బు ట్రస్టులకు ఇవ్వాలని అనుకుంటున్నా. పేరు తెచ్చుకోవాలని... ఏక్తాసర్దార్ ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా బాగా ఆడింది. దీంతో మంచి గుర్తింపు వచ్చింది. మక్కాకు వెళితే అక్కడ చాలా మంది గుర్తు పట్టి ‘సర్దార్’ అంటూ పిలిచారు. దుబాయ్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇలా అభిమానులు వచ్చి పిలుస్తూ ఫొటోలు దిగుతుంటే చాలా మజా అనిపిస్తుంది. ‘యే షహర్ మేతో సిర్ఫ్ ఏకీ రహ్సక్తా... ఓ హై సర్దార్’ డైలాగ్ లాగే హైదరాబాద్ సర్దార్‌గా ఇంకా పేరు తెచ్చుకోవాలని ఉంది. సన్నీ డియోల్, నానా పటేకర్ అంటే ఇష్టం. తెలుగులో ప్రకాష్‌రాజ్ నటన అంటే అమితమైన ప్రేమ. ప్రోత్సాహమివ్వాలి... చిన్న నిర్మాతలు ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు. మన భాష, సంస్కృతి పరిరక్షణకు ఇవి దోహదపడుతున్నాయి. వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. హైదరాబాద్‌లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఉంది. అది మారాలి! -
ఆగి ఉన్న సిటీబస్సులో మంటలు
-
ఆగి ఉన్న సిటీబస్సులో మంటలు
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతంలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి హయత్‌నగర్ నుంచి వచ్చిన ఓ బస్సు మెహిదీపట్నంలో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న సమయంలో ఆ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ బస్సు హయత్‌నగర్ డిపోకు చెందినదిగా గుర్తించారు. సిబ్బంది గుర్తించి అగ్నిమాపక విభాగాన్ని అప్రమత్తం చేసేలోపే మంటలు వ్యాపించాయి. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పూర్తిగా తగలబడిపో్యింది. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఏంటన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. పదే పదే బస్సు ప్రమాదాలు, బస్సులు తగలబడిపోతున్న సంఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. కారు ప్రమాదంలో దంపతులు మృతి చెందగా.. రోడ్డు దాటుతున్న కూరగాయల వ్యాపారిని ట్రాలీ ఆటో బలిగొంది. దూసుకువచ్చిన టిప్పర్ యువకుడ్ని కబళించగా, అదుపు తప్పిన కారు సబ్ కాంట్రాక్టర్ ప్రాణం తీసింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఓ కుటుంబ పెద్ద మృతికి కారణం కాగా.. ఓపెన్ నాలా వ్యాపారిని మింగేసింది. నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం! సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. సుల్తాన్‌బజార్ ఎస్సై ఈశ్వర్రావు కథనం మేరకు.. కరీంనగర్ జిల్లాకు చెందిన రాజయ్య (48) బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. సైదాబాద్‌లో ఉండే అతడికి భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఒక కూతురికి వివాహం జరిగింది. రాజయ్య పాత పేపర్లు, సామాన్లు కొని, విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. మంగళవారం కుద్బిగూడ దుర్గ డెయిరీ ప్రాంతం నుంచి వస్తున్నాడు. అదే మార్గంలో ఓ సర్వీసు వైరు స్తంభానికి వేలాడుతుండగా, దాన్ని గమనించని రాజయ్య స్తంభం పక్క నుంచి వెళ్తూ దాన్ని పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేపట్టారు. రాజయ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. స్థానికులు తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణం తీసిన ట్రాలీ ఆటో మెహిదీపట్నం, న్యూస్‌లైన్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. హుమాయున్‌నగర్ ఎస్సై పురందర్‌రెడ్డి కథనం మేరకు.. ఫస్ట్ లాన్సర్ సయ్యద్‌నగర్‌కు చెందిన నియాజ్ (40) తోపుడు బండిపై కూరగాయలు విక్రయిస్తుంటాడు. ప్రతి రోజూ క్రీసెంట్ ఆస్పత్రిలో సమీపంలోని హోటల్లో చాయ్ తాగిన అనంతరమే వ్యాపారం ప్రారంభిస్తాడు. మంగళవారం కూడా చాయ్ తాగిన నియాజ్ రోడ్డు దాటుతుండగా.. అదే సమయంలో మాసబ్‌ట్యాంక్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో (ఏపీ 9 సీబీ 0189) ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోడ్రైవర్ అమీర్‌తో పాటు ఆయన పక్కనే కూర్చున్న మోయిన్ గాయపడ్డారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. కారు ప్రమాదంలో భార్యాభర్తల మృతి ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందగా, నవ దంపతులతో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి గ్రామం వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా చల్లపల్లి ఠాణాలో ఏఎస్సైగా పని చేస్తున్న తిరుపతి నాగేంద్రరావు మొదటి కుమార్తె శ్రీదేవికి, హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న బోడా దుర్గాప్రసాద్(26)కి ఈ నెల 9న మచిలీ పట్నంలో వివాహం జరిగింది. సోమవారం హైదరాబాద్‌లో పెళ్లి కుమారుడి ఇంటి వద్ద రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేరోజు రాత్రి తిరిగి పెళ్లికూతురి స్వస్థలానికి కారులో బయల్దేరారు. గుంటుపల్లి వద్దకు వచ్చే సరికి డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ముందు సీట్లో కూర్చున్న పెళ్లి కుమారుడి చిన్నాన్న బోడా అంబేద్కర్ (48) చెట్టుకు, కారుకు మధ్య నలిగి మృతి చెందారు. వెనుక సీటులో కూర్చున్న ఆయన భార్య ఎలిజిబెత్ రాణి (45), నూతన దంపతులు దుర్గాప్రసాద్, శ్రీదేవి, కారు డ్రైవర్ నున్న రాజీవ్ (23)లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఎలిజబెత్‌రాణి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన అంబేద్కర్, ఎలిజిబెత్రాణిలు పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం సూరపనేనిగూడెం గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. నూతన దంపతులు కోమాలోకి చేరుకోవడంతో వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లి కుమారుడు దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో, పెళ్లి కుమార్తె శ్రీదేవి చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడ్ని బలిగొన్న టిప్పర్ బంజారాహిల్స్, న్యూస్‌లైన్: అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం మేరకు.. ఎస్పీఆర్ హిల్స్‌లో నివసించే గోరెటి ఆంజనేయులు (24) సోమవారం రాత్రి బైక్ (ఏపీ 09 సీకే 6540)పై కార్మికనగర్ నుంచి బోరబండ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ (ఏపీ 26 యూ 1041) అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఆంజనేయులుకు తీవ్ర గాయాలు కావడంతో పాటు తల పగిలింది. ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. టిప్పర్ బీభత్సంలో మరో ఇద్దరు స్కూటరిస్టులు స్వల్ప గాయాల పాలయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.