Mehidy Hasan
-
Ind Vs Ban: టీమిండియా అంటే ఆ మాత్రం ఉండాలి! వాళ్లు రాణిస్తేనే..
India tour of Bangladesh, 2022: ‘‘అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడటం ఎల్లప్పుడూ సవాలుతో కూడుకున్నదే! నా వరకైతే సవాళ్లు ఎదుర్కోవడం ఎంతో ఇష్టం. ఇక ఇండియాతో మ్యాచ్ అంటే మేము మానసికంగా కూడా మరింత బలంగా తయారవ్వాలి. ఒక బౌలర్‌కు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏమిటంటే.. ఒత్తిడిని అధిగమించడమే! మేము కొన్ని విభాగాల్లో వెనుకబడి ఉన్న మాట వాస్తవం. ఆ సమస్యలను అధిగమించి.. మా ఆట తీరు మెరుగపరచుకుంటే కచ్చితంగా ఈ సిరీస్‌లో విజయవంతమవుతాం’’ అని బంగ్లాదేశ్ యువ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ అన్నాడు. బంగ్లా పర్యటనకు టీమిండియా కాగా డిసెంబరు 4 నుంచి స్వదేశంలో టీమిండియాతో మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లా చానెల్‌తో ముచ్చటించిన మిరాజ్.. పటిష్టమైన భారత జట్టును ఢీకొట్టాలంటే బ్యాటర్లు రాణించాల్సిన ఆవశ్యకతను నొక్కి వక్కాణించాడు. బాధ్యత వాళ్లదే కనీసం 280కి పైగా స్కోరు చేయనట్లయితే.. వన్డే మ్యాచ్‌లో గెలుపుపై ఆశలు పెట్టుకోకూడదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుల్లో వన్డే ఫార్మాట్లో 280- 300 వరకు స్కోర్ చేస్తేనే బౌలర్ల పని కాస్త సులువవుతుంది. నిజానికి మా జట్టు గత కొన్ని రోజులుగా మేము 300 వరకు స్కోర్ చేస్తుండటం సానుకూల అంశం. బ్యాటర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా టాప్-5లో బ్యాటింగ్‌కు దిగే వాళ్లు త్వరగా వికెట్లు పారేసుకోకూడదు. అప్పుడే 300 స్కోరు చేయడం సాధ్యమవుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియాతో మ్యాచ్ అంటే ఆ మాత్రం ఉండాలని.. మానసికంగా కూడా మేటి జట్టును ఎదుర్కోనేందుకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. కాగా మిరాజ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇక టీమిండియా మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడే నిమిత్తం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుతం కివీస్ పర్యటనతో బిజీగా గడుపుతోంది. చదవండి: ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ Suryakumar Yadav: సూర్య అత్యుత్తమ టీ20 బ్యాటర్ కాదా!? కివీస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
WI Vs Ban: విండీస్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఈ సిరీస్ వాళ్లదే!
WI Vs Ban 2nd ODI: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో బంగ్లాదేశ్‌తో ఘన విజయం సాధించింది. ఆతిథ్య విండీస్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా 2-0తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్.. వెస్టిండీస్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో టెస్టు, టీ20 సిరీస్‌లను విండీస్ కైవసం చేసుకుంది. ఇక ప్రపంచకప్-2023 నేపథ్యంలో సూపర్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్ పర్యాటక బంగ్లా సొంతమైంది. కాగా గయానా వేదికగా బుధవారం(జూలై 13) వెస్టిండీస్- బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే జరిగింది. విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 108 పరుగులకే కుప్పకూలింది. కీమో పాల్(25- నాటౌట్) మినహా ఎవరూ కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. కెప్టెన్ నికోలస్ పూరన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 35 ఓవర్లలోనే పూరన్ బృందం కథ ముగిసింది. TOSS🪙: Captain @nicholas_47 is second best at toss today. 🇧🇩 have sent West Indies in to 🏏 in this 2nd One-Day International at Providence stadium 🇬🇾. #WIvBAN pic.twitter.com/AyYdD0vxJR — Windies Cricket (@windiescricket) July 13, 2022 బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్ 4 వికెట్లు తీయగా.. నాసుమ్ అహ్మద్ 10 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ శుభారంభం అందించాడు. అదరగొట్టిన బంగ్లా కెప్టెన్ అర్ధ శతకంతో రాణించి సత్తా చాటాడు. మరో ఓపెనర్ శాంటో 20 పరుగులు చేసి నిష్క్రమించగా.. లిటన్ దాస్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో 20.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసిన బంగ్లాదేశ్ భారీ విజయం సాధించింది. నాసుమ్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. Not the #MenInMaroon day at the office. Well played to 🇧🇩 @BCBtigers #WIvBAN pic.twitter.com/gj6rJ26tM0 — Windies Cricket (@windiescricket) July 13, 2022 చదవండి: Ind Vs WI: టీ20 సిరీస్‌కు కోహ్లి దూరం! ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! వైస్ కెప్టెన్ వచ్చేస్తున్నాడు! Ind Vs Eng 2nd ODI: తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం వివరాలు! రోహిత్ సేన గెలిచిందంటే! -
WI Vs Ban: చేదు అనుభవాల నుంచి కోలుకుని.. బంగ్లాదేశ్ ఘన విజయం
Bangladesh tour of West Indies, 2022- 1st ODI: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. మొదటి వన్డేలో ఆతిథ్య విండీస్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. కాగా బంగ్లాదేశ్ ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్, టీ20 సిరీస్‌లను విండీస్ సొంతం చేసుకోవడంతో పర్యాటక బంగ్లాకు చేదు అనుభవం మిగిలింది. ఈ నేపథ్యంలో గయానా వేదికగా సాగిన మొదటి వన్డేలో గెలుపొంది ఊరట విజయాన్ని అందుకుంది బంగ్లాదేశ్. మ్యాచ్ సాగిందిలా... వరణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. ఇందులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పూరన్ బృందం.. 41 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో 33 పరుగులతో బ్రూక్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్ మాత్రమే పదికి పైగా పరుగులు చేశారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది వెస్టిండీస్ జట్టు. 6 వికెట్ల తేడాతో.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు.. కెప్టెన్, ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 33 పరుగులతో రాణించి మంచి పునాది వేశాడు. మరో ఓపెనర్ లిటన్ దాస్ విఫలమైనా(1).. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన న్ముల్ హుసేన్ 37, నాలుగో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా 41 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆఖర్లో నారుల్ హుసేన్ 20 పరుగులతో రాణించాడు. దీంతో 31. 5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి బంగ్లాదేశ్ విజయం సాధించింది. 9 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించిన బంగ్లా బౌలర్ మోహెదీ హసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన విండీస్ ఆటగాడు గుడకేశ్ మోటీ ఒక వికెట్ తీసి మధుర జ్ఞాపకం మిగుల్చుకున్నాడు. వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ మొదటి వన్డే: టాస్: బంగ్లాదేశ్- బౌలింగ్ వెస్టిండీస్ స్కోరు: 149/9 (41) బంగ్లాదేశ్ స్కోరు: 151/4 (31.5) విజేత: బంగ్లాదేశ్.. 6 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మెహెదీ హసన్(3 వికెట్లు) చదవండి: Rohit Sharma: అతడు అద్భుతం.. మాకు ఇదొక గుణపాఠం.. ఓటమికి కారణం అదే! IRE Vs NZ 1st ODI: భళా బ్రేస్‌వెల్.. ఐర్లాండ్‌పై కివీస్ విజయం Motie takes our #MastercardPricelessMoment of the match with his maiden International wicket! pic.twitter.com/47iHGOVUqB — Windies Cricket (@windiescricket) July 10, 2022 Motie takes his 1st International wicket! #WIvBAN #MenInMaroon Live Scorecard - https://t.co/pQMuJ0sNHj pic.twitter.com/iKOdfXOhY4 — Windies Cricket (@windiescricket) July 10, 2022 Congrats on your ODI debut Motie! All the best!👏🏿 #WIvBAN #MaroonMagic pic.twitter.com/ziGsRgSWFE — Windies Cricket (@windiescricket) July 10, 2022 -
కెరీర్ బెస్ట్ సాధించిన బంగ్లా బౌలర్.. ఐదో స్థానంలో బుమ్రా
దుబాయ్: ఐసీసీ బుధవారం ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో బంగ్లా బౌలర్లు దుమ్మురేపారు. స్పిన్నర్ మెహదీ హసన్ 3 స్థానాలు ఎగబాకి 725 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచి కెరీర్ బెస్ట్ సాధించాడు. మరో బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 652 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మెహదీ హసన్ రెండు మ్యాచ్‌లు కలిపి 7 వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ 6 వికెట్లు తీసి కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు హసన్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బంగ్లా నుంచి ఒక స్పిన్నర్ టాప్2లో నిలవడం ఇదే మూడోసారి. ఇంతకముందు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 2009లో తొలిసారి బౌలింగ్ విభాగంలో నెంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. ఇక 2010లో మరో బంగ్లా స్పిన్నర్ అబ్దుర్ రజాక్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 2లో నిలిచాడు. ఇక తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 737 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. అఫ్గన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్ 708 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆసీస్ బౌలర్ మాట్ హెన్రీ(691 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా 690 పాయింట్లతో ఒకస్థానం దిగజారి ఐదో స్థానంలో నిలిచాడు. బుమ్రా తప్ప మరో టీమిండియా బౌలర్ టాప్‌టెన్‌లో లేకపోవడం విశేషం. ఇక బ్యాటింగ్ విభాగానికి వస్తే బాబర్ అజమ్(865 పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి(857), రోహిత్ శర్మ 825 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 396 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి జడేజా 245 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. చదవండి: World Cup Super League: భారీ విజయం.. టాప్‌లో బంగ్లాదేశ్! ⬆️ Mehidy Hasan Miraz climbs to No.2 ⬆️ Mustafizur Rahman breaks into top 10 Huge gains for Bangladesh bowlers in the @MRFWorldwide ICC Men’s ODI Player Rankings 👏 pic.twitter.com/nr1PGH0ukT — ICC (@ICC) May 26, 2021\ -
ఏయ్ వేషాలు వేస్తున్నావా.. క్రికెటర్‌కు వార్నింగ్!
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్లు తమ డిమాండ్లను నేరవేర్చలాంటూ సమ్మెకు దిగి తమ పంతం నెగ్గించుకున్న తరుణంలో మరో వివాదం చోటు చేసుకుంది. భారత్ పర్యటనకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెటర్లతో సమావేశమై బీసీబీ చీఫ్ నజ్ముల్ హసన్.. ఆల్ రౌండర్ మెహిది హసన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన ఫోన్ కాల్‌ను మెహిదీ లిఫ్ట్ చేయకపోవడంపై సమావేశంలోనే హసన్‌ను తిట్టిపోశారు. ‘ ఏయ్ వేషాలు వేస్తున్నావా.. నీ నంబర్ డిలీట్ చేసేస్తా’ అంటూ ఫైర్ అయ్యారు. ‘ మెహిది.. సమావేశం ఉంటుందని తెలుసి కూడా నా ఫోన్ కాల్‌ను ఎత్తలేదు. ఇలాగైతే కష్టం. నీ నంబర్‌ను ఈ రోజు నుంచే నా కాంటాక్ట్స్ లిస్ట్ నుంచి తీసేస్తా. నీకు ఏమి చేయలేదని నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ రోజు నుంచి నీ నంబర్ నా దగ్గర ఉండదు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో మిగతా క్రికెటర్లపై కూడా నజ్ముల్ తీవ్రంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. (ఇక్కడ చదవండి: క్రికెటర్ల స్ట్రైక్ దెబ్బకు దిగొచ్చిన బోర్డు) ఇటీవల తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన గళం వినిపించకుండా స్టైక్‌కు దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్ల దెబ్బకు ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీబీ దిగొచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి క్రికెటర్లకు గురువారం స్పష్టమైన హామీ లభించడంతో స్ట్రైక్‌ను విరమించారు. ఈ మేరకు తమ క్రికెటర్లతో సుదీర్ఘ చర్చలు జరిపిన బీసీబీ.. సాధ్యమైనన్ని డిమాండ్లను నేరవేర్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 11 ప్రధాన డిమాండ్లతో నిరసన గళం వినిపించగా వాటిలో తొమ్మిది డిమాండ్లను తీర్చడానికి బీసీబీ ముందుకొచ్చింది. ఫలితంగా షకిబుల్ హసన్ నేతృత్వంలోని క్రికెటర్లు సమ్మె విరమించడంతో భారత్ పర్యటనకు మార్గం సుగమం అయ్యింది. దానిలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయగా బీసీబీ చీఫ్ తన ఆక్రోశాన్ని క్రికెటర్లపై చూపించారు.