Meizu
-
సూపర్ ఫీచర్లు, బడ్జెట్ధర : మెయ్‌జు 16ఎక్స్ఎస్
బీజింగ్: అధునాతన ఫీచర్లతో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ సంస్థ మెయ్‌జు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 16ఎక్స్ఎస్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ప్రధానంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్ కెమెరా సహా ట్రిపుల్ రియర్ కెమెరాలను రియర్ సైడ్‌లో ఏర్పాటు చేసింది. ఇంకా భారీ స్క్రీన్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫాస్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందిస్తోంది. అదీ బడ్జెట్ ధరలో. రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను రూ.17,150 గా నిర్ణయించింది. మెయ్‌జు 16ఎక్స్ఎస్ ఫీచర్లు 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 1080 x 2232 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9.0 పై 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 48+8+5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరా 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి 5కి పోటీగా స్మార్ట్‌ఫోన్, బడ్జెట్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి సంస్థ మెయిజు నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో ఎం 6పేరుతో ఈ డివైస్‌ను ఆవిష్కరించింది. దాదాపు ఆరు నెలల క్రితం చూనాలో లాంచ్ చేసిన కంపెనీ ఇపుడు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. రూ .7,699 ధరలో అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. రెండు వేరియంట్లలో (2జీబీ ర్యామ్/6జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్/32 స్టోరేజ్)ఇది లభ్యం. మెయుజు ఎం6 ఫీచర్లు 5.2 అంగుళాల డిస్ప్లే 16: 9 కారక నిష్పత్తి 720 x 1280 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1 2జీబీ ర్యామ్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే అవకాశం 3070ఎంహెచ్ బ్యాటరీ aunches Meizu M6 in India at Rs 7,699; comes with 13MP camera -
బడ్జెట్ ధరలో మెయ్‌జు ఎం5సీ...
'ఎం5సీ' పేరిట మెయ్‌జు త్వరలోనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. భారత మార్కెట్లో జూన్ 30న విడుదల చేయనుందని తాజాగా అంచనాలు వెలువడుతున్నాయి. తన ఎం సిరీస్‌లో భాగంగా బడ్జెట్దరలో దీన్ని లాంచ్ చేయనుంది. దీని ధర రూ. 7699 గా ఉండొచ్చని తెలుస్తోంది. కాగా గ్లోబల్ మార్కెట్లో బ్లూ, బ్లాక్, పింక్, రెడ్, గోల్డ్ కలర్స్ లో ఇది లభ్యమవుతోంది. మెయ్‌జు ఎం5సీ ఫీచర్లు 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 8 ఎంపీ రియర్ కెమెరా, విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
మెయ్‌జు ఎం5 స్మార్ట్‌ఫోన్ లాంచ్..ధర?
సుదీర్ఘ విరామం తర్వాత మెయ్‌జు తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎం5' ను విడుదల చేసింది. భారత మార్కెట్ లో దీని ధరను రూ.10,499 లుగా కంపెనీ ప్రకటించింది. బ్లూ, షాంపైన్ గోల్డ్ కలర్ వేరియంట్లలో టాటాసిలిక్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. అలాగే 2జీబీ, 3 జీబీ వేరియంట్లలో అక్టోబర్ లో చైనాలో లాంచ్ చేసిననప్పటికీ 3 జీబీ ఎంను మాత్రమే ప్రస్తుతం భారత్ లో లాంచ్ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్బట్, హోమ్ బటన్ క్రింద అమర్చింది. పాలీ కార్బోనేట్బాడీతో డిజైన్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ లో కుడి అంచున పవర్ , వాల్యూమ్ బటన్లను, 3.5 ఎంఎ ఆడియో జాక్, స్పీకర్లు, చార్జింగ్ పోర్ట్ కిందిభాగాన పొందుపర్చింది. ఇక మిగిలిన స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. మెయ్‌జు ఎం5 ఫీచర్లు 5.2 ఇంచ్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.0 ఎల్ఈ 3070 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం చైనాలో లాంచ్ చేసిన చాలా తక్కువ సమయంలోనే దీన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టామని మొయిజు సౌత్ ఆసియా మార్కెటింగ్ హెడ్ లియాన్ జాంగ్ ప్రకటించింది. కీలక మార్కెట్ గా ఉన్న భారతకు మంచి ఆదరణ లభిస్తోందని ఈ నేపథ్యంలో కొన్ని నెలల కాలంలోనే దీన్ని భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. -
ఐఫోన్ 6ఎస్‌ను పోలిన మరో కొత్త ఫోన్!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ మీజూ ఐఫోన్ 6ఎస్‌ను పోలిన ఫోన్ 'ది మీజూ ప్రో 6'ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్లో ఇంతవరకు ఏ మొబైల్ కంపెనీ విడుదల చేయని డెకా కోర్ ప్రాసెసర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. 5.2 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌తో హెచ్డీ రిజల్యుషన్, 7.2 ఎమ్ఎమ్ మందంతో ప్రో 6 విడుదలయింది. ఐఫోన్ బాడీ డిజైన్‌తో తయారైన ఈ ఫోన్లో అతి చిన్న యాంటెనా మాత్రమే మార్పు. ఐఫోన్లో తొలిసారి ప్రవేశపెట్టిన 3డి ప్రెస్ ఆప్షన్‌ను కూడా ఇందులో ఉంచింది మీజూ. దీంతో స్క్రీన్ మీద ఎక్కువసేపు నొక్కి ఉంచడం వల్ల ఫోన్‌తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలుగుతుంది. 32 జీబీ, 64 జీబీ రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను మిజో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. 21 మెగా పిక్సల్ కెమెరాలో కస్టమ్ లెన్స్‌ను ఉపయోగించారు. 10 ఎల్ఈడీ ఫ్లాష్ లైట్లను వినియోగించారు. 4జీ సపోర్ట్‌తో పాటు యూఎస్బీ సీ టైప్ కంపాటబులిటీ ఈ ఫోన్ ప్రత్యేకత. సెక్యురిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందుకు అమర్చారు. 2,650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఒక గంటలో ఛార్జ్ అవుతుందని మీజూ ప్రతినిధులు తెలిపారు. నలుపు, సిల్వర్, గోల్డ్ రంగుల్లో మొబైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 32 జీబీ వేరియంట్ ధర రూ.25,719లు కాగా, 64 జీబీ రూ.28,807లు కంపెనీ తెలిపింది.