Mental patients
-
ఒకే కుటుంబంలో రెండో పింఛన్
సాక్షి, అమరావతి : కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో రెండో వ్యక్తి లేదా మహిళకు కూడా పింఛన్ మంజూరు చేసేందుకు అనుమతి తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఒక కుటుంబానికి ఒక పింఛను విధానాన్ని అమలు చేసిన నేపథ్యంలో తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నిబంధనలను సరళతరం చేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. 80 శాతం కంటే అంగ వైకల్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే కుటుంబంలో రెండో వ్యక్తికి పింఛన్ మంజూరుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. కిడ్నీ రోగులు, తీతీవ్రమైన మానసిక వ్యాధితో బాధ పడేవారు, ఎయిడ్స్ రోగుల విషయంలో కూడా అదే కుటుంబంలో రెండో వ్యక్తికి కూడా పింఛన్ మంజూరుకు వీలు కల్పిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. పింఛన్ మంజూరుకు కుటుంబ ఆదాయంతో పాటు పలు అర్హత ప్రమాణాలలో మినహాయింపు ఇస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు నిబంధనలలో మార్పులు చేసింది. పింఛన్ నిబంధనలు ఇవీ.. ►గ్రామీణ ప్రాంతంలో నెలకు గరిష్టంగా రూ.10,000, పట్టణాల్లో రూ.12,000 ఆదాయం ఉన్నా కూడా పింఛన్ పొందేందుకు అర్హులు. ►గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి, లేదా పది ఎకరాల మెట్ట భూమి ఉన్నప్పటికీ పింఛన్ పొందేందుకు అర్హత ఉంటుంది. రెండూ కలిపి 10 ఎకరాలలోపు ఉంటే కూడా అర్హులే. ►ప్రస్తుతం వృద్ధాప్య, చేనేత, దివ్యాంగ, మత్స్యకార, కల్లుగీత కేటగిరీల్లో పింఛన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే, వెంటనే అతని భార్యకు వితంతు పింఛన్ మంజూరు. -
మానసిక రోగులకు హాఫ్‌వే హోంలు!
సాక్షి, హైదరాబాద్: మానసిక అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో దీర్ఘకాలం చికిత్స పొంది ఆరోగ్యవంతులైన వారికి పునరావాసం కల్పించడానికి హాఫ్ వే హోంల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికోసం అవసరమైన ప్రణాళికను 15 రోజుల్లోగా తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి అధికారులను ఆదేశించారు. మానసిక రుగ్మతలతో దీర్ఘకాలం చికిత్స పొంది ఆరోగ్యవంతులైనప్పటికీ ఆసుపత్రిలోనే మగ్గుతున్న వారి కోసం హాఫ్ వే హోంలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. హాఫ్ వే హోంల ఏర్పాటుపై మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మానసిక ఆరోగ్యం కుదుటపడిన వారిని వీటిల్లో చేర్చి, వారికి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఇవ్వనున్నామన్నారు. హాఫ్‌వే హోంలకు సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎర్రగడ్డ మానసిక వైద్య చికిత్సాలయాన్ని సందర్శించి నిర్మాణ నమూనాను రూపొందించడంతో పాటు నిర్మాణానికి, నిర్వహణకు అవసరమైన నిధుల అంచనాలను సమర్పించాలన్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణను ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. మానసిక సమస్యలకు సంబంధించి జీవన శైలి, ఒత్తిడిని తట్టుకోవడం తదితర అంశాలన్నీ శిక్షణలో ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సైక్రియాటిస్టుల మ్యాపింగ్‌ను చేపట్టాలని, ప్రైవేటు సైక్రియాటిస్టుల సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. జిల్లాల్లో మెంటల్ హెల్త్ బోర్డుల ఏర్పాటుకు అనుమతి కోసం హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాయాలని, మెంటల్ హెల్త్‌కు సంబంధించిన ఔషధాలు అందుబాటులో ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీన్‌దయాళ్ డిజెబుల్డ్ రిహాబిలిటేషన్ పథకం నుండి నిధులు పొందేలా ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీని ఏర్పాటు చేశామని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలియజేశారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వైద్య, పారామెడికల్ సిబ్బంది శిక్షణకు సంబంధించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న తరహాలో కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని, మెంటల్ హెల్త్ స్క్రీనింగ్‌కు సంబంధించి నిర్దిష్ట విధానాన్ని రూపొందించి వైద్య సేవలు అందిస్తామని ఆమె వివరించారు. ఈ రంగంలో సేవలు అందిస్తున్న ఎన్జీవోలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జగదీశ్వర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా, వికలాంగ సంక్షేమశాఖ కమిషనర్ శైలజ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మూడు తరాలను పీడిస్తున్న పీడకల
మహి సైని... వయసు మూడేళ్లు.. పుట్టుకతోనే శారీరక, మానసిక వైకల్యం ఆ పాపను మంచానికే పరిమితం చేసింది. అందరిలా నడవలేదు. ఏ పనికీ చేతుల్ని ఉపయోగించలేదు. సైని తల్లి పింకి వయసు 22 సంవత్సరాలు. ఆమె కూడా శారీరక, మానసిక దుర్బలురాలే. ఆలియా... వయసు 12 ఏళ్లు. ఆమె పరిస్థితి కూడా ఇంతే. వీల్‌చైర్‌లోనే ఆ అమ్మాయి జీవితం గడిచిపోతోంది. వీరి దుస్థితికి కారణం... 34 ఏళ్ల క్రితం జరిగిన భోపాల్ విషవాయు దుర్ఘటన. ఆనాటి ప్రమాదంలో విడుదలయిన విషవాయువును పీల్చిన వారి సంతానం కావడమే వీరు చేసిన పాపం.మూడు దశాబ్దాల కిందట జరిగిన ఈ ప్రమాదం ఫలితాలు మూడు తరాల ప్రజలు అనుభవిస్తున్నారు. ఆనాటి దుర్ఘటన బాధితుల్లో చాలా మంది ఇప్పటికీ కోలుకోలేదు.వారి పిల్లల పిల్లలపైనా ఆ విషం ప్రభావం చూపుతోంది. ఇప్పటికీ నెలకు పాతిక, ముప్పయి మంది ఆ కారణంగానే చనిపోతున్నారంటే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితులు న్యాయం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. భోపాల్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడం కోసం భోపాల్‌లోని లోయర్ లేక్ వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ పిల్లలంతా పాల్గొన్నారు. ‘భోపాల్ దుర్ఘటన మూడు తరాలుగా వెంటాడుతోంది. ప్రమాద ప్రాంతంలో ఉంటున్న వారు, వారి పిల్లలు పలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కొందరు శారీరకంగా ఇబ్బందులు పడుతోంటే మరి కొందరు మానసిక రోగులుగా మారారు.’అంటూ ఆవేదన వెలిబుచ్చారు రషీదా బీ, చంపాదేవి.భోపాల్ దుర్ఘటన బాధితుల పిల్లల కోసం వారు చింగరి ట్రస్ట్ పేరుతో పునరావాస కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ దుర్ఘటన ప్రభావంతో శారీరక, మానసిక వైకల్యాలతో పుట్టిన 12 ఏళ్ల లోపు పిల్లలకు ఇక్కడ ఆశ్రయం కల్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ 961 మంది పిల్లలు ఉన్నారు. వీరందరికీ ఏదోరకంగా భోపాల్ దుర్ఘటనతో సంబంధం ఉందని చంపాదేవి చెప్పారు. విషవాయు ప్రభావంతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల భూగర్భజలాలు విషపూరితమయ్యాయి. మునిసిపల్ నల్లాలు లేకపోవడంతో ఆక్కడి ప్రజలు ఇప్పటికీ ఆ నీటినే తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాధితులకు సరైన చికిత్స అందడం లేదు. బాధితులకు తప్పుడు వైద్యం భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు వైద్యం అందించడంలో పొరపాట్లు జరిగాయని, దాని వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని‘భోపాల్ గ్యాస్ ట్రాజెడీ,ఆఫ్టర్ 3 ఇయర్స్’పేరుతో వచ్చిన పుస్తకంలో వెల్లడించింది. 1984,డిసెంబర్ 2వ తేదీ అర్థరాత్రి దాటాక భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో విషవాయువు లీకయింది. మిథైల్ ఐసోసైనేడ్ (మిక్) అనే ఆ విషవాయువు పట్టణమంతా కమ్ముకుంది.8 వేల మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వందల మంది ఆస్పత్రుల్లో చనిపోయారు.5లక్షల మందికిపైగా విషవాయు ప్రభావానికి గురయ్యారు (అప్పటి భోపాల్ జనాభా 8.5 లక్షలు). ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ దుర్ఘటన గురించి తెలియగానే జర్మనీకి చెందిన వైద్య నిపుణుడు హుటాహుటిన ప్రమాద స్థలికి వచ్చారు. బాధితులను పరీక్షించారు. మిక్ గ్యాస్‌కు విరుగుడుగా సోడియం థియోసల్ఫేట్ ఇంజక్షన్లు ఇవ్వాలని సూచించారు.అయితే,కొన్ని రోజులకే దీన్ని వాడటం ఆపేశారు.కార్బైడ్ కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే ఈ మందు ఆపేశారని, దాంతో బాధితులకు సరైన చికిత్స అందకుండా పోయిందని ఆ పుస్తకంలో వివరించారు. -
19 మంది మానసిక వికలాంగుల ఊచకోత
జపాన్‌లో ఉన్మాది ఘాతుకం సగమిహర : జపాన్‌లో ఓ ఉన్మాది మానసిన వికలాంగులపై పైశాచిక దాడికి పాల్పడ్డాడు. తాను గతంలో పని చేసిన మానసిక రోగుల శరణాలయంలోకి చొరబడి 19 మంది మానసిక రోగులపై కత్తులతో దాడి చేసి హతమార్చాడు. మరో 25 మందిని తీవ్రంగా గాయపరిచాడు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. టోక్యోకు 50 కి.మీ. దూరంలోని సగమిహరలోని సుకూయ్ యామయూరిఎన్ శరణాలయంలో మంగళవారం తెల్లవారజామున ఈ దారుణం జరిగింది. కత్తులను తెచ్చుకున్న దుండగుడు మూసిఉన్న కిటికీని పగలగొట్టి లోపలికి చొరబడ్డాడు. రోగులపై కత్తులతో దాడి చేసి పలువురి గొంతులను కోశాడు. తర్వాత పోలీసుల వద్దకెళ్లి లొంగిపోయాడు. నిందితుణ్ని సతోషు ఉమత్సు(26)గా గుర్తించారు. దేశంలోని వికలాంగులందరినీ చంపేయాని అతడు జపాన్ పార్లమెంట్‌కు లేఖ రాసినట్టు తెలిసింది. ప్లాస్టిక్ సర్జరీ కోసం తనకు రూ. 33 కోట్లు అందజేస్తే సాధారణ జీవితం గడుపుతానని అతను పేర్కొన్నట్టు తెలిసింది. -
శ్రీకాకుళం జిల్లాలో మానసిక రోగి వీరంగం
టెక్కలి : శ్రీకాకుళం జిల్లా టెక్కటి మండలం కోటబొమ్మాళిలోని ప్రసిద్ధ కొత్తమ్మతల్లి అమ్మవారి ఆలయంలో గురువారం ఓ మానసిక రోగి వీరంగం సృష్టించాడు. అమ్మవారి విగ్రహం చేతులను ధ్వంసం చేయటంతోపాటు పలువురిపై దాడి చేసి గాయపరిచాడు. వివరాలు.. సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన విశ్రాంత బీపీఎమ్ ఉదండరావు ప్రసాదరావు కుమారుడు రవికుమార్ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం విశాఖపట్నం వెళ్లేందుకు తండ్రి ప్రసాదరావు అతడితో పాటు కోటబొమ్మాళి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే రైలు వెళ్లిపోవడంతో బస్సులో వెళ్లేందుకు ఊళ్లోకి వచ్చారు. ఈ సమయంలో పరారైన రవికుమార్ కొత్తమ్మతల్లి ఆలయానికి చేరుకుని భవానీస్వాములు అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని తినేశాడు. తర్వాత అమ్మవారి విగ్రహం ఎదురుగా నగ్నంగా నృత్యం చేయడంతో పూజారి కమ్మకట్ల సరోజని వారించటానికి యత్నించారు. దీంతో రవికుమార్ ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. అనంతరం అమ్మవారి విగ్రహం చేతులను ధ్వంసం చేశాడు. అక్కడే ఉన్న ఇనుప రాడ్డు తీసుకుని కోళ్ల సూరి అనే యాచకునిపై దాడిచేసి గాయపరిచాడు. అడ్డుకునేందుకు యత్నించిన భవానీస్వామి కామిల్లి కొండలరావు చేయి విరగ్గొట్టాడు. అనంతరం ఎదురుగా ఉన్న చెట్టు, రాళ్లకు తల కొట్టుకుని గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రవికుమార్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు, అక్కడ నుంచి విశాఖపట్నం మానసిక ఆస్పత్రికి తరలించారు. -
ఎర్రగడ్డ మానసిక రోగుల పరారీ
-
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి 11 మంది రోగుల పరారీ
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మానసిక రోగుల చికిత్సాలయం (మెంటల్ ఆస్పత్రి)లో కలకలం చెలరేగింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదకొండు మంది మానసిక రోగులు ఆస్పత్రి నుంచి తప్పించుకున్నారు. వారిలో ఏడుగురిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి ఆచూకీ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక్కడి జైల్ బ్యారెక్‌లో మొత్తం 60 మంది రోగులు ఉంటారు. అక్కడినుంచే మొత్తం 11 మంది రోగులు పరారయ్యారు. ఆస్పత్రికి ఉన్న గ్రిల్స్ తొలగించుకుని మరీ వారు పరారు కావడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరారీ వెనుక ఖురేషీ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. కాగా, ఆక్సిజన్ సిలిండర్‌తో గోడను పగుల గొట్టి పరారైనట్లు సమాచారం. అర్ధరాత్రి రెండు గంటల తర్వాత వీరంతా ఒకరి తర్వాత ఒకరిగా పరారయ్యారు. నగరంలోని పాతబస్తీకి చెందిన ఖురేషీ, వరంగల్ జిల్లాకు చెందిన జీవరత్నం, తిరుమలేష్ తదితరులున్నారు. గతంలోనూ ఆరుగురు ఇక్కడినుంచి తప్పించుకున్నారు. అంతకుముందు గుర్తుతెలియని వ్యక్తి మహిళావార్డులో ప్రవేశించారు. మొత్తమ్మీద ఇక్కడ భద్రతాపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. పోలీసులకు ఫోన్లు చేసినా ఎవరూ స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు. ఇక పాతబస్తీకి చెందిన ఖురేషీ అనే వ్యక్తి ఈ మొత్తం సంఘటనకు సూత్రధారి అని భావిస్తున్నారు. అతడు ఇక్కడినుంచి పారిపోయి పాతబస్తీలోని మీర్ చౌక్ వైపు వెళ్లినట్లు చెబుతున్నారు. అతడు తన రెండో భార్యను తీసుకుని ముంబై వైపు పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
రష్యా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 37 మంది మృతి
లూకా: వాయవ్య రష్యాలో మానసిక రోగుల ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. లూకా గ్రామంలోని ఓక్సోచీ సైకియాట్రిక్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 37 మంది మానసిక రోగులు మరణించారు. రోగులను కాపాడేందుకు ప్రయత్నించిన ఓ నర్సు కూడా ఆహుతి అయింది. ఆసుపత్రిలో ఓ రోగి మంచం వద్ద తొలుత ప్రారంభమైన మంటలు తర్వాత అంతటా వ్యాపించాయి. ఆ రోగి పొగ తాగడం వల్ల లేదా ఉద్దేశపూర్వకంగా మంచానికి నిప్పు పెట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మంచానికి నిప్పుపెట్టినట్లు భావిస్తున్న రోగి ‘పైరోమానియా (వస్తువులను కాల్చాలనే కోరికలు కలగడం)’ మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు స్థానికులు ‘ఏఎఫ్‌పీ’తో తెలిపారు.