లూకా: వాయవ్య రష్యాలో మానసిక రోగుల ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. లూకా గ్రామంలోని ఓక్సోచీ సైకియాట్రిక్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 37 మంది మానసిక రోగులు మరణించారు. రోగులను కాపాడేందుకు ప్రయత్నించిన ఓ నర్సు కూడా ఆహుతి అయింది. ఆసుపత్రిలో ఓ రోగి మంచం వద్ద తొలుత ప్రారంభమైన మంటలు తర్వాత అంతటా వ్యాపించాయి. ఆ రోగి పొగ తాగడం వల్ల లేదా ఉద్దేశపూర్వకంగా మంచానికి నిప్పు పెట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మంచానికి నిప్పుపెట్టినట్లు భావిస్తున్న రోగి ‘పైరోమానియా (వస్తువులను కాల్చాలనే కోరికలు కలగడం)’ మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు స్థానికులు ‘ఏఎఫ్‌పీ’తో తెలిపారు.