merger day
-
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: చాడ
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి, చరిత్ర, వీరుల త్యాగాలు నేటి తరానికి తెలియకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన ఆయన జాతీయ జెండాను అవిష్కరించారు. అనంతరం చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... 1948 సెప్టెంబర్ 17న 225 ఏళ్ల రాచరిక వ్యవస్థ రద్దు చేసి ప్రజాస్వామ్య హక్కులు సాధించుకున్న రోజు అని గుర్తుచేశారు. భారత యూనియన్‌లో విలీనం అయిన రోజును వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిరాకరించటం శోచనీయమన్నారు. వేడుకలు నిర్వహించనందుకు సీఎం కేసీఆర్ యావత్తు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండున్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీలేదని చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సెప్టెంబర్ 17 ఉత్సవం ఎవరి సొంతం?
-
ఘనంగా హైదరాబాద్ విలీన దినోత్సవం
* సెప్టెంబర్ 17 తెలంగాణకు చారిత్రక దినోత్సవం: ఉత్తమ్ * ద్వంద్వ వైఖరి అవ లంబిస్తున్న కేసీఆర్: చాడ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు తమ తమ పద్ధతుల్లో నివాళులర్పించాయి. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు భట్టి విక్రమార్క, కె.జానారెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్, పొన్నాల లక్ష్మయ్య, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భారత్‌లో విలీనమైన రోజైనందున తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 అన్నది చారిత్రక దినోత్సవమని అన్నారు. ఇది కొన్ని శక్తులకు వ్యతిరేకమనే భావన సరైంది కాదన్నారు. మఖ్దూంభవన్‌లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాయుధపోరాటాన్ని సీఎం కేసీఆర్ నోటితో పొగుడుతూ, హైదరాబాద్ విమోచనను అధికారికంగా నిర్వహించకుండా నొసటితో వెక్కిరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించి, ప్రభుత్వపరంగా అధికార కార్యక్రమంగా చేయకుండా వ్యతిరేకిస్తూ కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. వచ్చే ఏడాది అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. మజ్లిస్‌కు భయపడి ఒక వర్గం ఓట్ల కోసమే దీనిని ప్రభుత్వం నిర్వహించడం లేదన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్‌రాజ్ గంగారాం, ఆహిర్, బీజేఎల్పీ నేత డా.కె.లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సారథ్య బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్: తెలంగాణ సారథ్య బృందం ఆధ్వర్యంలో గురువారం కోఠిలోని అశోక స్తూపం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు బాబురావువర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ విమోచనం నిజాం వ్యతిరేక పోరాటం వల్లే జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. సీఎం ఇప్పటికైనా విజ్ఞతను ప్రదర్శించి తెలంగాణ విమోచన దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ విమోచనంలో కాంగ్రెస్‌పార్టీ కీలకపాత్ర వహించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, పీసీసీ మాజీ అధ్యక్షులు నర్సారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు. -
విలీనం ఘనత కాంగ్రెస్ పార్టీదే: పొన్నాల
-
విలీనం ఘనత కాంగ్రెస్ పార్టీదే: పొన్నాల
హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసిన ఘనత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన తెలంగాణ విలీన దినోత్సవంలో ఆయన పాల్గొని జాతీయజెండా ఎగరేశారు. ఈ కార్యక్రమంలో జానారెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, వాళ్ల కుటుంబాలను ఆదుకుంటామన్న హామీని తెలంగాణ సర్కారు నిలబెట్టుకోవాలని పొన్నాల చెప్పారు. సెప్టెంబర్ 17 విలీనదినాన్ని అధికారికంగా నిర్వహించాలని గతంలో చెప్పిన కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ సాధించిన విజయాలు శాశ్వతం కావని, పోరాటాల చరిత్ర ఉన్న తెలంగాణ గతంలో పాలకులను తరిమికొట్టిన వాస్తవాన్ని టీఆర్ఎస్ మరిచిపోరాదని తెలిపారు. -
మత కోణంలో చూడొద్దు: కోదండరాం
-
మత కోణంలో చూడొద్దు: కోదండరాం
హైదరాబాద్: సెప్టెంబర్ 17ను విలీనదినంగా జరుపుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం తమ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, ప్రభుత్వం ప్రకటన చేస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. రేపు విలీన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా జరపాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. విలీనదినాన్ని మత కోణంలో చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విలీనదినాన్ని అధికారికంగా జరపాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాము రేపు గోల్కొండలో జాతీయ జెండా ఎగరేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఎంఐఎం ఒత్తిడితోనే విలీన దినోత్సవాన్ని నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకాడుతోందని ఆయన ఆరోపించారు.