
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: చాడ
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి, చరిత్ర, వీరుల త్యాగాలు నేటి తరానికి తెలియకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన ఆయన జాతీయ జెండాను అవిష్కరించారు.
అనంతరం చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... 1948 సెప్టెంబర్ 17న 225 ఏళ్ల రాచరిక వ్యవస్థ రద్దు చేసి ప్రజాస్వామ్య హక్కులు సాధించుకున్న రోజు అని గుర్తుచేశారు. భారత యూనియన్‌లో విలీనం అయిన రోజును వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిరాకరించటం శోచనీయమన్నారు. వేడుకలు నిర్వహించనందుకు సీఎం కేసీఆర్ యావత్తు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండున్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీలేదని చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.