అమిత్‌షా అడ్డదారులు తొక్కుతున్నారు: చాడా
Published Thu, May 25 2017 1:07 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
జనగామ: కేంద్రం రూ.లక్ష కోట్లు రాష్ట్రానికి ఇచ్చిన విషయం నిజమైతే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలి.. ఒకవేళ అబద్ధమైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తన మాటలు వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు జనగామలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ వైఖరి ఎంటో స్పష్టం చేయాలన్నారు. లక్ష కోట్ల విషయం నిజమైతే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని.. లేకపోతే అమిత్‌షా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసమే అమిత్‌షా అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు.
Advertisement
Advertisement