కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి: చాడ | chada venkatareddy fires on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి: చాడ

Published Thu, May 18 2017 12:12 PM | Last Updated on Tue, Aug 14 2018 2:34 PM

కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి: చాడ - Sakshi

కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి: చాడ

హైదరాబాద్‌: వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు కొట్టేసిన వారసత్వ జీవోపై కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు గురువారం ఉదయం సింగరేణి భవన్‌ ముందు ధర్నా చేశారు.

కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గూండా మల్లేష్‌, ఐఎన్‌టీయూసీ నేత జనక్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ధర్నాకు  అనుమతి ఇవ్వకుండా సీఎం కేసీఆర్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చాడా మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement