కేసీఆర్‌ను కమ్యూనిస్టు అనడం హాస్యాస్పదం | chada venkatreddy fired on cm kcr and ktr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను కమ్యూనిస్టు అనడం హాస్యాస్పదం

Published Sat, Mar 25 2017 3:40 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

కేసీఆర్‌ను కమ్యూనిస్టు అనడం హాస్యాస్పదం - Sakshi

కేసీఆర్‌ను కమ్యూనిస్టు అనడం హాస్యాస్పదం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అసలైన కమ్యూనిస్టు అని మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత పేర్కొనడం హాస్యాస్పదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సమస్యలపై నిరసనలు తెలిపే అవకాశం లేకుండా ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ ను ఎత్తేసి ప్రజాస్వామ్యం గొంతు నులిమారని ధ్వజమెత్తారు. బీసీలకు గొర్రెలిస్తే కమ్యూనిస్టు అవుతారా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని ప్రకటించి ఆ తర్వాత వారిని ఎన్‌కౌంటర్‌ చేయడమే కమ్యూనిస్టు లక్షణమా అని నిలదీశారు. ధర్నాచౌక్‌ తరలింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement