Merit awards
-
ఆర్డర్‌ఆఫ్ మెరిట్ అవార్డ్స్-2017కు ఆన్లైన్ ఓటింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు ఆన్లైన్ ఓటింగ్‌లో పాల్గొనాలని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు రోశన్న ఆదివారం ఓప్రకటనలో కోరారు. ఈ విద్యా సంవత్సరం (2017–18) నుంచి రాష్ట్రంలోని అన్ని కళాశాలలల్లో విద్యార్థుల ప్రవేశాలు, పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాల మంజూరుకు జన్మభూమి వెబ్‌పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే జన్మభూమి వెబ్‌పోర్టల్‌లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్స్–17 కోసం ప్రిన్సిపాళ్లు, విద్యార్థులకు ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించనున్నారు. ట్విటర్ అకౌంట్ ద్వారా మాత్రమే ఓటింగ్ చేసే అవకాశం కల్పించారు. -
ప్రశంసలతో సరి!
టెన్త్‌లో ప్రతిభావంతులకు అందని ప్రోత్సాహక నగదు ఒక్కో విద్యార్థికి రూ.20 వేలు ఇస్తామన్న ప్రభుత్వం నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకోని విద్యాశాఖ పదోతరగతి విద్యార్థుల ప్రోత్సాహమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రతిభా అవార్డులు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రశంసా పత్రాలతోపాటు ఒక్కో విద్యార్థికి రూ.20 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. నాలుగు నెలల క్రితం తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి రాష్ట్రంలోని 13 జిల్లాల విద్యార్థులకు సీఎం చంద్రబాబు నాయుడు మొక్కుబడిగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అయితే ఇంతవరకు నగదు బహుమతి ఇవ్వలేదు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదనకు లోనవుతున్నారు. చిత్తూరు : ప్రతిభా అవార్డులక ఎంపికైన విద్యార్థుల పట్ల ప్రభుత్వం తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 2015 ఏడాది పదోతరగతి పరీక్షల్లో అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ప్రతిభా అవార్డులకు ఎంపిక చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో 4,050 మంది విద్యార్థులకు ఎంపికయ్యారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి ఒక్కో మండలం నుంచి ఆరుగురు చొప్పున 402 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరు, ఇద్దరు బీసీ విద్యార్థులు, ఇతరులు ఇద్దరిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రతిభా అవార్డుకింద ఒక్కో విద్యార్థికి ప్రశంసా పత్రంతోపాటు రూ.20 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు స్వీకరించే విద్యార్థితో పాటు వచ్చిన ఉపాధ్యాయుడి కూడా రవాణా ఖర్చులు సైతం చెల్లిస్తామని చెప్పింది. గత ఏడాది నవంబర్ 14న తిరుపతిలో ఆర్భాటంగా ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ సభ నిర్వహించారు. భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులందరితోపాటు వారి కుటుంబ సభ్యులనూ అక్కడికే పిలిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సరైన వసతులు కూడా ఏర్పాటుచేయలేదు. దీంతో వారు నానా తంటాలు పడ్డారు. విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేశారు. నగదు మొత్తాన్ని తరువాత విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని అధికారులు ప్రకటించారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఎంపికైన 402 మంది విద్యార్థులకు రూ.80.40లక్షలు, రవాణా ఖర్చుల కింద ఉపాధ్యాయులకు మరో రూ.4.92 లక్షలు కలిపి మొత్తం రూ.85లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే జమ చేయాల్సి ఉంది. కార్యక్రమం జరిగి ఇప్పటికి నాలుగు నెలలు పూర్తయింది. కానీ ప్రభుత్వం ఏ ఒక్క విద్యార్థికి కూడా పైసా చెల్లించలేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇదేనా ప్రోత్సాహం అంటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
యువతకు స్ఫూర్తి ప్రదాత చెవిరెడ్డి
పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ప్రశంసల జల్లు తిరుపతి రూరల్‌లో వైఎస్సార్ ప్రతిభా పురస్కారాల ప్రదానం తిరుపతి రూరల్: నిరంతరం ప్రజా అభ్యుదయ, సంక్షేమ కార్యక్రమాలతో రాజకీయాల్లో చురుకైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేటి యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ ప్రశంసించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సొంత నిధులతో ప్రారంభించిన వైఎస్సార్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం తి రుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి హైస్కూల్లో జరిగింది. ఈకార్యక్రమాని కి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సునీ ల్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఉన్నతి సాధ్యమన్నారు. విద్యను ప్రోత్సహించిన వారు చరిత్రలో మహనీయులు గా కీర్తించబడతారని, ఆకోవలోకే ఎమ్మె ల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిలుస్తున్నారని చెప్పారు. పేదలు, మధ్యతరగతి విద్యార్థులు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పెం చేందుకు, విద్యార్థులను ప్రోత్సహించేం దుకు వైఎస్సార్ ప్రతిభా పురస్కారాలను అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ టీచర్ల పిల్లలు కూడా ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారని, ఇది మం చి పరిణామం కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఈ ప్రమాణాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఆదిశగా ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. నైపుణ్యాలు, విద్యాజ్ఞానం అధికంగా చిన్నారుల్లో ఉంటాయనీ, వాటిని వెలికి తీసేం దుకు ప్రోత్సాహం అవసరముందన్నా రు. అందుకే వైఎస్ఆర్ పేరిట ప్రతిభా పురస్కారాలను విద్యార్థులకు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలి పారు. అంతకుముందు సర్పంచ్ భారతీరవి, ఎంపీటీసీ సుభాషిణిమోహన్లు ఎమ్మెల్యేలు సునీల్‌కుమార్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. దశాబ్దాల పాటు విద్యా బోధనల్లో విశేష సేవలందించిన విశ్రాంత టీచర్లను ఎమ్మె ల్యే చెవిరెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్‌నాయు డు, ఎంఈవో ప్రసాద్, ఆర్ఐ శంకర య్య, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, మునీశ్వరరెడ్డి, చిన్నియాదవ్, శ్రీరాములు, వీరనారాయణరెడ్డి, రవి, సింగిల్‌విండో డెరైక్టర్ జయచంద్రారెడ్డి, హెచ్ఎం శ్రీనివాసులు, భాను తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభకు పురస్కారం..
‘జ్ఞానసరస్వతి’ సేవలు ప్రశంసనీయం రవీంద్రభారతిలో శనివారం జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 121 మంది విద్యార్థినీ, విద్యార్థులు, ఐదుగురు హెచ్ఎంలు పురస్కారాలు అందుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినీ విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని వైపుల నుంచి వికాసం ఉంటుందన్నారు. సమాజానికి, దేశానికి ఉపయోగపడే పౌరులుగా విద్యార్థులు ఎదగాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే ఎవరెస్ట్ ఎక్కిన పూర్ణ, ఆనంద్లాగా రాణిస్తారన్నారు. విద్యార్థుల్లో అన్ని సామర్థ్యాలు పెంపొందించేందుకు జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ చేసే కృషి విలువకట్టలేనిదని తెలిపారు. హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్యభారతి స్వామిజీ మాట్లాడుతూ భారతీయుల్లో ఆధ్యాత్మికత మెండు అని తెలిపారు. ఆంగ్లేయుడు మెకాలే ఆంగ్లవిద్యను దేశంలో ప్రవేశపెట్టి మన సంస్కృతిని నాశనం చేశారన్నారు. సమాజానికి ఉపయోగపడే విద్యను అందరూ అభ్యసించాలని తెలిపారు. జిల్లా విద్యాధికారి సోమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి నిజాయితీతో చదవాలన్నారు. జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం జ్ఞానసరస్వతీ ఫౌండేషన్ వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ వారి ఉన్నతి కృషి చేస్తుందని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ జ్ఞానసరస్వతీ ఫౌండేషన్వారు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పొత్సహించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ, ప్రతిభా పురస్కారాలు అందజేయటం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 121 మంది విద్యార్థినీ-విద్యార్థులకు, జిల్లాలోని ఐదు మంది హెచ్ఎంలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఆరవ తరగతి విద్యార్థినీ శ్రీహిత పాడిన వందేమాతర గీతం ఆకట్టుకుంది. సంధ్య, వైష్ణవీ, శారద, ఓంకార్‌ల నృత్యప్రదర్శలు ఆలరించాయి. కార్యక్రమంలో జిల్లా ఆర్వీఎం ప్రోగ్రాం ఆఫీసర్ కిషన్‌రావు, ప్రముఖ వ్యక్తిత్వ వికాసనిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర, యోగా గురువు శశిధర్, డిప్యూటీ ఈవో హరిచందర్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విశ్వభాషగా తెలుగు
సాక్షి, సిటీబ్యూరో: ‘హరిత, పారిశ్రామిక విప్లం పూర్తి చేసుకొని సాంకేతిక, సమాచారం విప్లవంలో ఉన్నాం. ప్రస్తుతం అంతర్జాలంలోకి ఎక్కి తెలుగును విశ్వభాషగా రూపొందించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది’ అన్నారు రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ‘ఢిల్లీ తెలుగు అకాడమీ, రావడ ఫౌండేషన్ హైదరాబాద్’ సౌజన్యంతో ‘డీటీఏ అండ్ రావడ ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు’ ప్రదానోత్సవం శనివారం రవీంద్రభారతిలో జరిగింది. సంగీత సుధానిధి డి.వి.మోహన్‌కృష్ణ, ప్రముఖ సాహితీవేత్త పోతుకూచి సాంబశివరావు, ప్రజా వాగ్గేయకారుడు జయరాజులకు మంత్రి పురస్కారాలు ప్రదానం చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థి ఎన్.శశిధర్ తల్లి సుజాత, ఇంజినీరింగ్ విద్యార్ధి ఎ.సాయిశ్రీనివాస్, ఐదో తరగతి విద్యార్థి సాయికిరణ్‌లకు మెరిట్ స్కాలర్షిప్లు అందించారు. అదరహో: కార్యక్రమంలో కల్యాణి మ్యూజిక్ అకాడమీ 100 మంది విద్యార్థులతో నిర్వహించిన ‘శతవాద్య సంగీత విభావరి’ కళాభిమానులను పరవశులను చేసింది. రవళి, రవితేజలు 15 నిముషాల్లో నర్తించిన 6 భారతీయ సంప్రదాయ నృత్యాలు అబ్బురపరిచాయి. యూనిక్ వరల్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేంద్రగౌడ్ మాట్లాడుతూ... శతవాద్య సంగీత విభావరిని, నృత్యభారతిని ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘనతలను ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’కు కూడా పంపుతామన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు, డాక్టర్ గోపాలకృష్ణ, ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి ఎన్.వి.ఎల్.నాగరాజు పాల్గొన్నారు.