meruga
-
దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు
– వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున – రాష్ట్ర రాజధానిలో రాజ్యాంగం అపహాస్యం తుని రూరల్ (తుని) : వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని రాజధానిలో కలిసి తమ బాధలు చెప్పుకున్న దళిత రైతులు వెళ్లిన ప్రాంతంలో పనుపు నీళ్లతో కడగడం అమానుషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా తునిలో వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎంపీపీ పల్లేటి నీరజ, పార్టీ పట్టణ కన్వీనర్ రేలంగి రమణగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలాంటి చర్యల ఫలితంగా భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత ద్రోహిగా వ్యహరిస్తున్నారని విమర్శించారు. దళిత రైతుల నుంచి, దళితేతర రైతుల నుంచి భూములను భయపెట్టి చేజిక్కించుకొని పరిహారం ఇవ్వకపోవడంతో భరోసా ఇచ్చి మనోధైర్యం కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటించారన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకోడానికి దళితులతోపాటు బాధితులు వస్తే ఆ ప్రాంతాల్లో పసుపు నీళ్లతో కడగడం దళితులను అవమానించడమేనని అన్నారు. దళితులు పట్ల బాబుకు ప్రేమ అనేది ఉంటే ఇలా వ్యవహరించిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకునే దమ్ము ఉందా అని అన్నారు. దళితుల పట్ల వ్యతిరేక ఆలోచన ధోరణితో ఉండడం వల్లే సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారన్నారు. హాస్టళ్లను, వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీలో రోగాలకు అందే చికిత్సలను కుదించడం వల్ల దళితులకు, గిరిజనలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తారని హెచ్చరించారు. కౌన్సిలర్లు చితకల రత్నకుమారి, కర్రి అమలావతి, కర్రి అమలావతి, సాపిరెడ్డి శేషమణి, పోకల లక్ష్మి, జిల్లా నాయకులు పల్లేటి అచ్చారావు, గారా శ్రీనివాసరావు, బోడపాటి శ్రీను, శివకోటి సింహాచలం, పెయ్యిల సూర్యారావు, మూర దేవదానం తదితరులు పాల్గొన్నారు. -
దళితులకు చంద్రబాబు ద్రోహం
తూర్పుదిగవల్లి(నూజివీడు రూరల్) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు ద్రోహం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. దళితవాడలోఅంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. తొలుత రమణక్కపేట అడ్డ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి తొలుత పూల మాల వేసి నివాళులర్పించారు. మేరుగ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాటించారని పేర్కొన్నారు. టీడీపి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని చెప్పారు. మహానేత ఆశయాలు నెరవేరాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్మోçßæన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతుందన్నారు. ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రిజర్వేషన్లు అంబేడ్కర్ కృషి ఫలితామేనని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం విలువ లేకుండా చేసిందని పేర్కొన్నారు. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మహానేత వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు విశ్రమించవద్దన్నారు. విగ్రహవిష్కరణ అనంతరం భారీ అన్నదానం చేశారు. కార్యక్రమంలో నూజివీడు, చాట్రాయి జెడ్పీటీసీ సభ్యులు బాణావతు రాజు, దేశిరెడ్డి రాఘవరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పల్లె రవీంద్రరెడ్డి, కోటగిరి గోపాల్, కలగర వెంకటేశ్వరరావు, సర్పంచి నక్కనబోయిన వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు బూరుగు ప్రతాప్ పాల్గొన్నారు. -
రాయపాటిని పరామర్శించిన అంబటి, మేరుగ
గుంటూరు(నగరంపాలెం): నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సతీమణి లీలాకుమారి చిత్రపటం వద్ద వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మంగళవారం నివాళులర్పించారు. గుంటూరు లక్ష్మీపురంలోని రాయపాటి నివాసానికి వెళ్లి పలువురు నాయకులు పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగర్జున తదితరులు లీలాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఎంపీ రాయపాటి సాంబశివరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి, స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ఐజీ ఏసురత్నం, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్, రిటైర్డు ఐజీ సీఆర్ నాయుడు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాంప్రసాద్, డాక్టర్ మండవ శ్రీనివాస్ తదితరులు రాయపాటిని పరామర్శించినవారిలో ఉన్నారు.