'ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్ తీసుకున్నాడు'
న్యూఢిల్లీ: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఉద్దేశపూర్వకంగా నిషేధిత పదార్థాలు తీసుకున్నాడని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువసార్లు నిషేధిత డ్రగ్స్ టాబ్లెట్ రూపంలో నోటి ద్వారా తీసుకున్నాడని వెల్లడించింది. తనపై కుట్ర జరిగిందని ఆరోపించిన నర్సింగ్ ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యాడని తెలిపింది. అతడి నుంచి సేకరించిన అన్ని నమూనాలను క్షుణ్ణంగా పరిక్షించినట్టు వెల్లడించింది. అతడు నిషేధిత డ్రగ్స్ వాడినట్టు జూన్ 25 నిర్వహించిన డోపింగ్ టెస్టులో వెల్లడైందని గుర్తు చేసింది.
ఒకటి లేదా రెండు మెథాన్డీనోన్ టాబ్లెట్లు నోటి తీసుకున్నట్టు తేలిందని, దీన్ని నీటిలో కలిపి తీసుకున్నట్టు నిర్థారణ కాలేదన్నారు. అయితే తన మంచినీళ్ల సీసాలో ఎవరో నిషేధిత పదార్థాలు కలిపారని, తాను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తీసుకోలేదని నర్సింగ్ యాదవ్ అంతకుముందుకు అన్నాడు. దీనికి ఆధారాలు సమర్పించడంలో విఫలమవడంతో అతడిపై సీఏఎస్ నాలుగేళ్ల నిషేధం విధించింది. దీంతో అతడు రియో ఒలింపిక్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.