MG. gopal
-
మంచి ప్రాజెక్టులకు టీటీడీ సహకారం
తిరుపతి, న్యూస్‌లైన్ : సమాజానికి ఉపయోగపడే మంచి ప్రాజెక్ట్‌లతో ముందుకు వ స్తే పరిశోధనలకు టీటీడీ ఆర్థిక సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ ఆయుర్వేద విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాల 31వ వార్షికోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఈవో మాట్లాడుతూ పరిశోధనలకు పెద్దపీట వేయాలని విద్యార్థులకు సూచించారు. అందుకు అనువైన అవకాశాలు స్విమ్స్, బర్డ్స్, ఇతర ఆస్పత్రుల మధ్య ఉన్న ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు మాత్రమే ఉన్నాయన్నా రు. ఎక్కడాలేని విధంగా ఇక్కడ ఆస్పత్రికి అనుబంధంగా ఫార్మసీ కూడా ఉండడం విశేషమన్నారు. ఆయుర్వేద విద్యార్థులకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, చదువులు పూర్తిచేసిన వారు ఉద్యోగం కోసం డిస్పెన్సరీలు ప్రారంభించాల్సిన ఆవసరం లేదన్నారు. సమాజానికి ఉపయోగపడే మంచి ప్రాజెక్ట్‌లతో ముందుకు వస్తే పరిశోధనలకు టీటీడీ ఆర్థిక సహకారం అందిస్తుందఆయుర్వేద ఆస్పత్రి, కళాశాల అభివృద్ధికి టీటీడీ అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మ ప్రసంగిస్తూ ఆయుర్వేద కళాశాలలో పరిశోధనలకు స్విమ్స్ సహకరిస్తుందని చెప్పారు. తిరుపతి ఆయుర్వేద కళాశాలలో చదివిన వారికి ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించాలని, యూజీ, పీజీ సీట్ల పెంపునకు సహకరించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రాజయ్య కోరారు. కార్యక్రమంలో ఆయుర్వేదం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్వతి, కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామిరెడ్డి, స్టూడెంట్ రెప్రజెంటేటివ్ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కళాశాల ఆవరణలో నిర్మించిన ధ న్వంతరీ హాల్‌ను ఈవో గోపాల్ ప్రారంభించారు. -
ముదిరిన టీటీడీ వీఐపీ పాస్‌ల వివాదం
తిరుమల: కలియుగ పుణ్యక్షేత్రమైన టీటీడీలో వీఐపీ పాస్‌ల వివాదం ముదిరింది. బుధవారం టీటీడీ ఆలయానికి దర్శనానికి వచ్చిన వారిలో ఎవరెవరికీ వీఐపీ పాస్‌లను జారీ చేసారో ఆ జాబితా చూపించాల్సిందిగా మంత్రి రామచంద్రయ్య టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్‌ను కోరారు. వీఐపీ పాస్‌ల విషయమై ఆయన ఈవో గోపాల్‌ను కలిసినట్టు తెలిసింది. కానీ, టీటీడీ వీఐపీ పాస్‌ల జాబితా వివరాలను అందించే విషయంలో టీటీడీ పాలక మండలి విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
శ్రీవారి కల్యాణోత్సవాల్లో.. అవినీతి నిజమే!
తిరుపతి, న్యూస్‌లైన్: శ్రీవారి కల్యాణోత్సవాల్లో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స నివేదికలో తేటతెల్లమైంది. మూడు రోజులుగా వీజీవో హనుమంతు తన సిబ్బందితో కలసి కల్యాణోత్సవ రికార్డులను పరిశీలించారు. మంగళవారం ఈవో బంగ్లాలో జరిగిన సమీక్షలో ఈ నివేదికను వీజీవో అందజేశారు. కల్యాణోత్సవాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విచారణలో తేలినట్లు సమాచారం. శ్రీవారి కల్యాణోత్సవాల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈవో ఎంజీ.గోపాల్ విజిలెన్స ఇటీవల విచారణకు ఆదేశించిన విషయం విదితమే. గత ఏడాది జనవరిలో ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశవిదేశాల్లో 170 కల్యాణోత్సవాలను నిర్వహించినట్లు చూపించారు. రూ.3 కోట్లకు పైగా నిధులు టీటీడీ నుంచి విడుదలైనట్లు రికార్డులు చెబుతున్నాయి. కల్యాణోత్సవానికి ముందు అడ్వాన్సగా తీసుకునే లక్షలాది రూపాయల్లో ఖర్చు పోను మిగిలిన మొత్తాన్ని టీటీడీ ఖాతాలోకి జమచేయడం లేదని గుర్తించారు. ముంబైలో కల్యాణోత్సవం జరిగితే తిరుపతి నుంచి వంటవారు వెళ్లినట్లు, బెంగళూరు నుంచి పూల డెకరేషన్లు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కో రకమైనƒ ఏర్పాట్లు చేసినట్టు బిల్లులు చూపించారు. కల్యాణోత్సవానికి వచ్చే భక్తులు శ్రీవారికి పట్టుచీరలు, ఇతర కానుకలు సమర్పిస్తుంటారు. ఇవేవీ ఖజనాకు జమచేయకుండా స్పెషలాఫీసర్ స్వాహా చేసినట్లు గుర్తించారు. టీటీడీకి సమర్పించిన బిల్లుల్లో అడ్రస్‌లు సక్రమంగా లేకపోవడంతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సమీక్షలో జేఈవో, సీవీఎస్వో, ఎఫ్అండ్సీవో, విజిలెన్స వీజీవో, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇకపై జేఈవో సమక్షంలోనే కల్యాణాలు అక్రమాలు జరిగాయని నిర్ధారించిన టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తీవ్రస్థాయిలో స్పందించినట్లు తెలుస్తోంది. సమీక్షలో శ్రీకల్యాణోత్సవం ప్రాజెక్టు స్పెషలాఫీసర్ కోరాడ రామకృష్ణను మందలించారు. ఇకపై ప్రాజెక్టు స్పెషలాఫీసర్‌గా కొనసాగే అర్హత లేదన్నారు. అతని స్పెషలాఫీసర్ కాలపరిమితి మరికొంత సమయం ఉండడంతో అంతవరకు తాత్కాలికంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై కల్యాణోత్సవాలు జేఈవో సమక్షంలోనే జరగాలని ఈవో ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ అన్నారు. గరుడ వాహనసేవను రాత్రి 8 గంటలకు ఆరంభించి రాత్రి ఒంటిగంట వరకు ఊరేగిస్తూ భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పిస్తామన్నారు. అక్టోబర్ 5 నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై బుధవారం ఈవో ఎంజీ.గోపాల్ ‘సాక్షి’తో మాట్లాడారు.బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు వీక్షించేందుకు 225 గ్యాలరీలు సిద్ధం చేశామన్నారు. ఇందులో లక్షా 85 వేల మంది వాహనసేవలు కళ్లారా దర్శించే అవకాశముందన్నారు. నిర్ణీత వేళల్లో వాహన సేవలు నిర్వహిస్తామని, గరుడ వాహనసేవ రోజున వచ్చే ప్రతి ఒక్కరికీ ఉత్సవమూర్తిని దర్శించే అవకాశం కల్పిస్తామన్నారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో కొత్త స్వర్ణరథం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బస్సుల సంఖ్య ను పెంచుతామన్నారు. భక్తుల సేవకు ఈసారి నిరంతరం పని చేసే సెంట్రల్ కమాండెంట్ కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇక్కడే అన్ని విభాగాలతో కూడిన అత్యవససర సేవలు ఉంటాయన్నారు.