
ముదిరిన టీటీడీ వీఐపీ పాస్ల వివాదం
తిరుమలలో కొలువైన దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుని ఆలయమైన టీటీడీలో వీఐపీ పాస్ల వివాదం ముదిరింది.
తిరుమల: కలియుగ పుణ్యక్షేత్రమైన టీటీడీలో వీఐపీ పాస్ల వివాదం ముదిరింది. బుధవారం టీటీడీ ఆలయానికి దర్శనానికి వచ్చిన వారిలో ఎవరెవరికీ వీఐపీ పాస్లను జారీ చేసారో ఆ జాబితా చూపించాల్సిందిగా మంత్రి రామచంద్రయ్య టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ను కోరారు. వీఐపీ పాస్ల విషయమై ఆయన ఈవో గోపాల్ను కలిసినట్టు తెలిసింది. కానీ, టీటీడీ వీఐపీ పాస్ల జాబితా వివరాలను అందించే విషయంలో టీటీడీ పాలక మండలి విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.