MGR centenary celebrations
-
వీడియో : మద్యం-మనీ.. అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే
కోయంబత్తూర్ : అధికార పార్టీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఒకరు మద్యం, డబ్బు పంచుతూ అడ్డంగా బుక్కయిపోయారు. ఆ వీడియో వైరల్ కావటంతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంజీఆర్ జయంతి ఉత్సవాలను అన్నాడీఎంకే పార్టీ ఆదివారం ఘనంగా నిర్వహించింది. అయితే అందుకు జనాలను సమీకరించేందుకు ఎమ్మెల్యే ఆర్ కనకరాజ్ మద్యం, డబ్బును పంచారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సుమారు 60 బస్సుల్లో ఆయన ప్రజలను వేడుకలకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యే పక్కనే ఓ వ్యక్తి 2వేల రూపాయల నోట్ల కట్టలు పట్టుకుని రిజిస్టర్లో రాసుకుంటూ ఉండటం, ఆ పక్కనే మద్యం బాటిళ్ల కాటన్ డబ్బాల్లో ప్యాక్ చేసి ఉండటం కనిపించింది. దీనిపై ప్రతిపక్షాలు మాత్రం మరో వాదనను రేపుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ప్రలోభపెడుతున్నాడంటూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కనకరాజ్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు. ఎంజీఆర్ జయంతి వేడుకల కోసం వేదిక వద్దకు వచ్చే కార్యకర్తల సౌకర్యార్థం తాను డబ్బును కేటాయించినట్లు ఆయన చెబుతున్నారు. తమిళ ప్రజలు డబ్బు, మద్యానికి తలొగ్గే రకం కాదని.. ఆర్కేనగర్ ఉప ఎన్నికలలో అన్నాడీఎంకే పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. డబ్బు,మద్యం, మిల్క్ టోకెన్లు, చివరకు ఫోన్ రీఛార్జీ కూపన్లు, మొబైల్ వాలెట్ పేమెంట్లను కూడా పలువురు నేతలు పంపిణీ చేయటంతో ఎన్నిక రద్దైన విషయం తెలిసిందే. ఈ నెల 21న ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఈసీ నిర్వహించనుంది. -
మద్యం-మనీ.. అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే
-
సంక్రాంతికి కొత్త సీఎం?
► శశికళ కోసం 12న ముహూర్తం ► నేటి నుంచి జిల్లాల వారీగా తీర్మానాలు ► 17వ తేదీన ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలు తమిళనాడు ప్రజలు అత్యంత పవిత్ర దినంగా భావించే పొంగల్ పండుగ నాటికి శశికళను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ పరితపిస్తోంది. ఈనెల 12వ తేదీన సీఎంగా శశికళ బాధ్యతలు చేపట్టేలా పార్టీ అడుగులు వేస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణించిన నాటి నుంచే శశికళ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అమ్మ మరణంతో ఖాళీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులను శశికళకే కట్టబెట్టాలని పార్టీలోని అగ్రనాయకత్వం ఆశించింది. ఈ దశలో పేరుకు సీఎం పన్నీర్సెల్వంమైనా ప్రతిదీ శశికళ కనుసన్నల్లోనే సాగుతోంది. పన్నీర్‌సెల్వం సైతం దాదాపుగా ప్రతిరోజూ శశికళ వద్ద çహాజరీవేయించుకుంటున్నారు. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇక సీఎం సీటే తరువాయిగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆమెపై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మరీ ఎక్కువగా కాలికి బలపం కట్టుకుని ఊరువాడా తిరుగుతున్నారు. ఇతనికి మంత్రులు ఆర్పీ ఉదయకుమార్, కడంబూరు రాజా, సేవూరు రామచంద్రన్ తదితరులు తోౖడయ్యారు. కొత్త ఏడాదిరోజున అమ్మ సమాధి వద్దకు వెళ్లి నివాళుర్పించిన మంత్రులు శశికళను కలుసుకుని సీఎం బాధ్యతలు స్వీకరించాలని కోరారు. మంత్రులు ఓఎస్ మణియన్, తంగమణి వీరికి వంత పాడారు. ఈ ప్రయత్నాలకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు, పార్టీ అగ్ర నేతలంతా సోమవారం సాయంత్రం పోయెస్‌గార్డెన్ లో శశికళతో సమావేశమై మరోసారి ఒత్తిడి తెచ్చారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ శతజయంతి ఉత్సవాల ఈనెల ఈ ఉత్సవాల నాటికి శశికళను సీఎం చేసి ఆమె నేతృత్వంలో శతజయంతి ఉత్సవాలు సాగాలని ఆశిస్తూ నుంచి∙ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి శశికళనే సీఎం అనే తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీ సమావేశాలు ముగిసిన తరువాత రాష్ట్రస్థాయిలో భారీ సమావేశాన్ని నిర్వహించి చిన్నమ్మ శశికళను సీఎంగా ఎన్నుకోవాలని తీర్మానం చేయనున్నారు.