MGU
-
ఆదర్శ యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తాం
– కొత్త కోర్సులను ప్రారంభిస్తాం – యూనివర్సిటీకి ‘బి’గ్రేడ్ – 75శాతం హాజరుంటేనే పరీక్షలకు అనుమతి – ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ ఎంజీయు (నల్లగొండ రూరల్) మహాత్మాగాంధీ యూనివర్సిటీని రాష్ట్రంలోనే ఆదర్శ యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీసీ అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. మంగళవారం తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీకి న్యాక్ ‘బి’ గ్రేడ్ ప్రకటించిందని వెల్లడించారు. ఈ గుర్తింపు వలన యూనివర్సిటీకి, విద్యార్థులకు మంచి గుర్తింపు లభించడంతో పాటు విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.యూనివర్సిటీని సందర్శించిన న్యాక్ బృందం వసతులను పరిశీలించి ‘బి’గ్రేడ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. మూడు నెలల్లో గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గతంలో ఇన్చార్జి వీసీలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం వలన యూనివర్సిటీ అభివృద్ధి జరగడలేదని అన్నారు. పీహెచ్డీ, పీజీ కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. 75శాతం హాజరుంటేనే యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం భవన నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రభుత్వం కేటాయించిన 240 ఎకరాల యూనివర్సిటీ భూమి పూర్తిగా నల్లరేగడి కావడంతో నిర్మాణ ఖర్చు అధికమవుతుందన్నారు. కొండా బాపూజీకి నివాళులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, వీసీ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్, డైరెక్టర్ అంజిరెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ సేవలను కొనియాడారు. -
ఎంజీ యూనివర్సిటీకి న్యాక్ ‘బి’ గుర్తింపు
ఎంజీయు (నల్లగొండ రూరల్): మహాత్మగాంధీ యూనివర్సిటీకి నేషనల్ ఎసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) ‘బి’ గుర్తింపు నిచ్చింది. ఈ నెల 15న బెంగుళూరులో జరిగిన న్యాక్ 17వ సమావేశంలో యూనివర్సిటీకి 2.32 స్కోరుతో ‘బి’ గ్రేడ్‌కు ఎంపిక చేసింది. ఈ మేరకు యూనివర్సిటీకీ సమాచారాన్ని అందించింది. ‘బి’ గ్రేడ్ గుర్తింపుతో యూనివర్సిటీకి యూజీసీ, రూసా పథకాల నుంచి నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో యూనివర్సిటీ అభివృద్ధి వైపు అడుగులు పడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఫెలోషిప్ అవకాశాలతో యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికెట్‌కు దేశ, విదేశాల్లో గుర్తింపు లభించనుంది. జాతీయ సెమినార్లో కూడా పాల్గొనే అవకాశం లభిస్తుంది. మరో ఏడాది ఆగితే బాగుండేది యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు కోసం వెళ్లడం తొందరపాటుగానే విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు భావిస్తున్నాయి. పూర్తిస్థాయిలో వీసీలు లేకపోవడంతో ఇన్చార్జి వీసీల పాలనలో న్యాక్ గుర్తింపు కోసం వెళ్లడం వల్ల 2.32 స్కోరుతో ‘బి’ గ్రేడ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం వీసీగా ఆల్తాఫ్ హుస్సేన్ నియామకమైన నేపథ్యంలో మరో ఏడాది పాటు ఆగి న్యాక్ గుర్తింపు కోసం వెళ్తే సరైనవిధంగా గుర్తింపు వచ్చి, నిధులు బాగా వచ్చేవని భావిస్తున్నారు. పూర్తిస్తాయిలో గ్రంథాలయం అందుబాటులోకి రాకపోవడం, క్రీడామైదానం, కొత్త కోర్సు, ఇంజనీరింగ్ భవనాలు లేకపోవడం, పరిశోధనలు జరుగకపోవడం, పూర్తిస్థాయిలో ఫ్రొఫెసర్లు లేకపోవడం ప్రధాన లోపంగా భావించిన న్యాక్ ‘బి’ గ్రేడ్‌తో సర్టిపెట్టింది. ఏడాది పాటు ఆగితే వీసీ ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేసే అవకాశం ఉండి సరైన గుర్తింపు వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కొనసాగుతున్న యువజనోత్సవాలు
ఎంజీయూ (నల్లగొండ రూరల్) : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి ఎన్ఎస్ఎస్ యవజనోత్సవాలు రెండో రోజు ఆదివారం వైభవంగా కొనసాగాయి. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల నుంచి 300 మందికిపైగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. 11 సాంస్కృతిక అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.నరేందర్ రెడ్డి మాట్లాడారు. సమాజ అభివృద్ధికి యువశక్తి ఎంతో ముఖ్యమన్నారు. చదువుతోపాటు శీతాకాల శిబిరాలు, వేసవి శిబి రాలు నిర్వహిస్తూ గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేస్తుండడం అభినందనీ యమన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల రవి, అనురాధరెడ్డి,విద్యార్థులు పాల్గొన్నారు.