ఎంజీయూ (నల్లగొండ రూరల్) : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి ఎన్‌ఎస్‌ఎస్ యవజనోత్సవాలు రెండో రోజు ఆదివారం వైభవంగా కొనసాగాయి. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల నుంచి 300 మందికిపైగా ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. 11 సాంస్కృతిక అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.నరేందర్ రెడ్డి మాట్లాడారు. సమాజ అభివృద్ధికి యువశక్తి ఎంతో ముఖ్యమన్నారు. చదువుతోపాటు శీతాకాల శిబిరాలు, వేసవి శిబి రాలు నిర్వహిస్తూ గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేస్తుండడం అభినందనీ యమన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల రవి, అనురాధరెడ్డి,విద్యార్థులు పాల్గొన్నారు.