NSS
-
పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య తగ్గుతున్న ‘డిజిటల్ డివైడ్’
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న ‘డిజిటల్ డివైడ్ ’అనేది క్రమంగా తగ్గుతోంది. రోజువారీ జీవన విధానం, అలవాట్లలో వచ్చిన మార్పులుచేర్పులతోపాటు అందరికీ ఆధునిక సాంకేతిక పరిజాŠక్షనం అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణం. డిజిటల్ విప్లవం అనేది వివిధ రూపాల్లో విస్తరించడంతో అందరికీ అన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యాలు మెరుగుపడడంతోపాటు స్మార్ట్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ గాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో ఆధునిక సాంకేతికతను పట్టణ, గ్రామీణ తేడాలు లేకుండా ఉపయోగించుకోగలుగుతున్నారు. 95.1 శాతం కుటుంబాలు (గ్రామీణ ప్రాంతాల్లో 94.2 శాతం, పట్టణాల్లో 97.1 శాతం) టెలిఫోన్/ మొబైల్ సౌకర్యాలు కలిగి ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. గతంతో పోలి్చతే..ఇది మెరుగైన పరిస్థితి కాగా, మొబైల్ టెక్నాలజీ వినియోగంలో రాబోయే రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్యఉన్న చిన్న వ్యత్యాసం కూడా చెరిగిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 79వ రౌండ్ నేషనల్ నేషనల్ శాంపిల్ సర్వే తాజాగా 79వ రౌండ్ నేషనల్ నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్)లో భాగంగా 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య కాలంలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ నిర్వహించిన కాంప్రహెన్సివ్ అన్యూవల్ మాడ్యువల్ సర్వేలో అనేక అంశాలు, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండమాన్, నికోబార్‌లోని కొన్ని గ్రామాల్లో మినహా దేశవ్యాప్తంగా సర్వే చేశారు. ఈ సర్వేలో భాగంగా మొత్తం 3,02,086 కుటుంబాలను (గ్రామీణ ప్రాంతాల్లో 1,73,096, పట్టణ ప్రాంతాల్లో 1,28,990) కలిశారు. మొత్తంగా 12,99,988 (గ్రామాల్లో 7,85,246 మంది, పట్టణాల్లో 5,14,742 మంది) మంది నుంచి వివరాలు సేకరించారు.మొబైల్, ఇంటర్నెట్ వినియోగం, ఐసీటీ స్కిల్స్, ఔట్ ఆఫ్ ప్యాకేట్ మెడికల్ ఎక్స్పెండీచర్, విద్య తదితర అంశాలపై ఈ సర్వే జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా 95.7 శాతం గ్రామీణ యువత (పట్టణాల్లో 97 శాతం) మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. 15–25 ఏళ్ల మధ్యనున్న గ్రామీణ యువత 82 శాతం (పట్టణాల్లో 92 శాతం) ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. సర్వేలోని ముఖ్యాంశాలు ⇒ 15–24 ఏజ్ గ్రూప్‌లో 78.4 శాతం యువత అటాచ్డ్ఫైల్స్తో మెసేజ్ పంపగలుగుతున్నారు. ఈ వయసులోని వారే 96.9 శాతం (వీరితో పురుషులు 97.8%, మహిళలు 95.9%) చదవడం, రాయడంతో పాటు సాధారణ ⇒ గణాంకాలు చేస్తున్నారు. 71.2 శాతం మంది కాపీ అండ్ పేస్ట్ టూల్స్ వినియోగిస్తున్నారు. 26.8 శాతం మాత్రమే ఆన్లైన్ సెర్చ్, ⇒ ఈ–మెయిల్స్ పంపడం, ఆన్లైన్ బ్యాంక్ నిర్వహణ చేయగలుగుతున్నారు. దేశంలో 9.9 శాతం కుటుంబాలకు (పట్టణ ప్రాంతాల్లో 21.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.2 శాతం) డెస్్కటాప్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు కలిగి ఉన్నారు. ⇒ 18 ఏళ్లకు పైబడిన వారిలో 94.6 శాతం మందికి వ్యక్తిగత, ఉమ్మడి బ్యాంక్ ఖాతా, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్స్‌లో అకౌంట్, మొబైల్ మనీ సరీ్వస్ ప్రొవైడర్ ఖాతా కలిగి ఉన్నారు. ⇒ తాము నివసిస్తున్న ప్రాంతాల నుంచి 500 మీటర్లలోపు దూరంలోనే లోకెపాసిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ (బస్సు,కారు, టాక్సీ, ఆటో వంటివి) సౌకర్యాలు 93.7 శాతం పట్టణ ప్రాంత జనాభాకు అందుబాటులో ఉన్నాయి. -
సీఆర్పీల ఉద్యమబాట!
ఏళ్లుగా నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నా తగిన గుర్తింపు రావడం లేదని భావించిన సీఆర్పీలు ఉద్యమబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి సారించకపోవడంతో ఆందోళనలకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం నిర్వహించే ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లారు. కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం నూతన విద్యావిధానాలు అమలు చేస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో కీలకమైన విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీ(క్లస్టర్ రిసోర్స్ పర్సన్)ల సమస్యలను పట్టించుకోవ డం లేదు. పదేళ్లుగా విధుల్లో ఉన్నా ఉద్యోగ భద్రత లేకపోవడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త నియామకాలు లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఉపాధ్యాయ ఎన్నికల సమయంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన మేరకు న్యాయం జరుగుతుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. 2021 జూన్ నుంచి పెంచిన వేతనాలు అమలు చేస్తున్నా సమాన పనికి సమాన వేతనం మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగిలింది. ఉమ్మడి జిల్లాలో 203 మంది.. జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులకు వా రధి ఉంటూ.. పాఠశాలలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు అనుసంధానంగా పనిచేసేందుకు వీలుగా సీఆర్పీలను ప్రభుత్వం నియమించింది. పదేళ్ల క్రితం రాత పరీక్షల ద్వారా ప్రతీ మండలానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ఎమ్మార్సీ కా ర్యాలయ పనులు, పాఠశాలల పర్యవేక్షణ పనులు అప్పగించారు. అయితే ఉపాధ్యాయులు కార్యాలయాల్లో పనిచేస్తే విద్యార్థులు నష్టపోతారనే ఉద్దేశంతో విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను అత్యవసర పరిస్థితులు, ఎన్నికల విధులు, జనాభా లెక్కల విధులకు మాత్రమే వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 2011లో నూతన విధానం తీసుకువచ్చారు. దీనికి అనుగుణంగా టీటీసీ, బీఈడీ విద్యార్హతతో 2012లో రాత పరీక్షలు, ఇంటర్వూలు నిర్వహించి సర్వ శిక్ష కార్యక్రమం కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో ఒక్కో సీఆర్పీని నియమించారు. ఇందులో కొంత మంది వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాలు వదిలిపెట్టారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 232 కాంప్లెక్స్‌లకు 203 మంది సీఆర్పీలు విధులు నిర్వర్తిస్తున్నారు. 18కి పైగా విధులు ప్రస్తుతం సీఆర్పీలు క్షేత్రస్థాయిలో 18కి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాంప్లెక్స్ హెచ్ఎంలకు సహా యంగా ఉంటూనే బడిబయట పిల్లల గుర్తింపు, 18 నుంచి 25 పాఠశాలల పర్యవేక్షణ, ఎస్ఎంసీ సమావేశాల నిర్వహణ, కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విధులు, మధ్యాహ్న భోజన అమలు పరిశీలన, సమగ్ర శిక్ష కార్యక్రమాల నిర్వహణ, ఎమ్మార్సీ కార్యాలయం, పాఠశాలల మ ధ్య అనుసంధాన కర్త, విద్యార్థుల ఆధార్ నమోదు, ఎన్నికల విధులు, యూడైస్, చైల్డ్ ఇన్ఫోలో వివరాల నమోదు తదితర పనులు చేయాలి. వీటితోపాటు జిల్లాస్థాయి అధికారులు ఆదేశాల మేరకు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇటీవల స్వచ్ఛ విద్యా పురస్కార్‌కు సంబంధించి ఫొటోలు తీసుకోవడం, ఉపాధ్యాయుల డేటా అప్డేట్ చేయడం వంటి బాధ్యతలను కూడా వీరికే అప్పగించారు. ఉద్యోగ భద్రత లేక.. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి పనికి తగిన వేతనం చెల్లించాలని సీఆర్పీలు డిమాండ్ చేస్తున్నారు. జాబ్‌చార్ట్ ప్రకారం వీరు 15 నుంచి 18 పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది కొరతతో 18 నుంచి 25 స్కూళ్ల బాధ్యతలు అప్పగించారు. ఖాళీలను భర్తీచేసి పనిభారం తగ్గించాలని కోరుతున్నారు. ప్రస్తు తం వీరికి కేంద్ర ప్రభుత్వం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భాగస్వామ్యంతో వేతనాలు చెల్లిస్తున్నారు. అంతకు ముందు వీరికి రూ.15వేలు చెల్లించగా, 2021 నుంచి 30 శాతం పెంచారు. దీని ప్రకారం రూ.19,500 అందాల్సి ఉన్నా రూ.150 కోత విధించారు. రెగ్యులర్ చేయాలి పదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అర్హతలు ఉన్నా ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. వెంటనే సీఆర్పీలను రెగ్యులర్ చేయాలి. అప్పటివరకు స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో పేస్కేల్ అమలు చేయాలి. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి అందరూ తరలిరావాలి. -
ఎన్ఎస్ఎస్ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ సేవా పథకం ద్వారా అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎన్ఎస్ఎస్ అధికారులు, వలంటీర్లు రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డు గ్రహీతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి ఎం.శీతల్రెడ్డి, వర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్‌కు చెందిన వలం టీర్లు మెంత్రి సౌజన్య, వి.హరికృష్ణ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. ఏపీ నుంచి నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆరి్డనేటర్, ప్రస్తుతం డిప్యుటేషన్‌పై రాష్ట్ర సచివాలయంలో స్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డా.రమేష్‌రెడ్డి, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆదిరెడ్డి పరదేశి నాయుడు పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఆంధ్రా యూనివర్సిటీ హిందీ విభాగానికి చెందిన వాలంటీర్ బందుల మహేంద్రనాథ్, ట్రైనింగ్ ఓరియెంటేషన్ సెంటర్‌కు చెందిన వాలంటీర్ కొటికలపూడి జగదీశ్వరి అవార్డులు దక్కించుకున్నారు. అవార్డు స్ఫూర్తిని నింపింది.. ఈ అవార్డు ఎంతో స్ఫూర్తిని నింపిందని, ప్రజలకు ఎన్ఎస్ఎస్ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో 44 వేల మంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉంటే అవార్డు దక్కించుకున్న 10 మందిలో తాను ఉండటం ఆనందాన్ని ఇచ్చిందని ఆదిరెడ్డి పరదేశి పేర్కొన్నారు. -
మరోసారి పాక్‌ను హెచ్చరించిన అమెరికా
వాషింగ్టన్: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్కడి ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు. అమెరికా కొత్త జాతీయ భద్రతా వ్యూహాన్ని (ఎన్ఎస్ఎస్) ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగ్ర నిరోధక చర్యల కోసం పాక్‌కు ఏటా భారీగా నిధులు ఇస్తున్నామని, వాళ్లు తప్పకుండా సాయం చేయాలని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు ఆదేశాల మేరకు ట్రంప్ సోమవారం ఎన్ఎస్ఎస్ను ఆవిష్కరించారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నంత కాలం ఆ దేశంతో కుదుర్చుకునే ఒప్పందాలు వృథాయేనని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ట్రంప్ పాకిస్థాన్‌పై విమర్శలు ఆపడం లేదు. లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్‌ను మళ్లీ అరెస్టు చేయాలన్న అమెరికా సూచనను పాక్ పట్టించుకోలేదు. అయినా పాక్‌పై కఠిన చర్యలకు మాత్రం ట్రంప్ వెనుకాడుతున్నారు. పాక్ మాత్రం ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూనే ఉండటం గమనార్హం. -
రాష్ట్రస్థాయి బెస్ట్ ఎన్ఎస్ఎస్ వలంటీర్‌గా అంజలి
–శ్రీకాకుళంలో అవార్డు ప్రదానం కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రస్థాయి ఉత్తమ జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)వలంటీర్‌గా కర్నూలుకు చెందిన కె. అంజలి ఎంపికయ్యింది. శనివారం ఆమెకు శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ గోకుల్ కృష్ణ, స్టేట్ లైసెన్స్ ఆఫీసర్ రామచంద్రరావు చేతుల మీదుగా అవార్డు అందజేశారు. బనగానపల్లికి చెందిన హోటల్ వ్యాపారి కె. బద్రీనాథ్, కె. సుధ కుమార్తె అయిన కె. అంజలి కర్నూలులోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. కళాశాలలో విద్యనభ్యసించే సమయంలో ఆమె ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనింది. ఆమె చేసిన సేవలకు 2015–16 సంవత్సరానికి గాను రాష్ట్ర అధికారులు ఉత్తమ అవార్డు పురస్కారం అందజేశారు. -
సామాజిక సేవలో ఎన్ఎస్ఎస్
దామరచర్ల సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు, ఉపా«ధ్యాయులు, మేథావులు పాల్గొనేలా చేసి వారిలో దేశ భక్తిని, సేవాతత్పరతను పెంపొందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిందే జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్). స్వాతంత్య్ర సంగ్రామంలో సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలు విద్యార్థుల పాత్రతో విజయవంతం అయ్యాయి. మహాత్ముని శత జయంతి సందర్భంగా1969 సెప్టెంబర్ 24న తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ సూచనల మేరకు ఎన్ఎస్ఎస్ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలోని 47 యూనివర్సిటీల్లో ఎన్ఎస్ఎస్ శిబిరాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో సుమారు 2లక్షల మంది ఎన్.ఎస్.ఎస్ వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. పథకం ఉద్దేశం.. సమాజ సేవద్వారా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నదే లక్ష్యం. స్వేచ్ఛ, సమానత్వం, జాతీయ సమైక్యత, లౌకిక సామ్యవాద, గౌరవ భావం ఏర్పర్చడం. అసమానతలు, క్రూరత్వాన్ని నిరోధించడం. దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను కాపాడడం. సమాజంపై అవగహన ఏర్పర్చుకోవడం. సమస్యలు కనుగొనడం, వాటి నివారణకు కృషి చేయడం. సామాజిక సృహ, సమాజ సేవ, పౌరబాధ్యతలు పెంచడం. పాఠశాలకు సమాజానికి సంబంధాన్ని పెంపొందించడం. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచడం. ఎన్ఎస్ఎస్ విధులివే.. పచ్చదనం పరిశుభ్రత, ఆరోగ్య కార్యక్రమాలు, వ్యక్తి నిర్మాణ కార్యక్రమాలు, చట్టం, న్యాయం, వలంటీర్లకు శిక్షణ, భావ వ్యక్తీకరణ కార్యక్రమాలు. పల్స్‌పోలియో, వివిధ ప్రత్యేక దినోత్సవాలు, వారోత్సవాలు నిర్వహించడం. ప్రత్యేక శిబిరాలు ప్రతి ఎన్ఎస్ఎస్ యూనిట్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక ని«ధిని కేటాయించింది. గ్రామాల్లోని మురికివాడల్లో విద్యార్థులు ఏటా వారం రోజులు ఉండి శ్రమదానం చేయాలి. వీటి ద్వారా పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం, మొక్కలు నాటడం, నీటి వినియోగంపై గ్రామస్తులకు వివరించడం, బాణామతి, చేతబడులు వంటి మూఢ నమ్మకాలపై కళాప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేయాలి. పౌష్టికాహారం ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి.ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి. శిబిరాల్లో 240 గంటలు పనిచేసిన విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. విద్యార్థులు ముందుండాలి – డాక్టర్ రాజేశ్వర్‌నాయక్ (ప్రోగ్రామ్ అధికారి) సమాజ సేవలో విద్యార్థులు ముందుండాలి. సేవల ద్వారా విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి చెందుతారు. జాతీయ సేవకు ఈశిబిరాలు దోహదం చేస్తాయి. సేవాతత్పరత కలిగిన విద్యార్థులే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ తప్పనిసరి. చైతన్యవంతులను చేయొచ్చు – కె.ప్రశాంత్, వ్యవసాయ విద్యార్థి ఎన్ఎస్ఎస్ శిబిరాల çసందర్భంగా సామాజిక సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేసే వీలు కలుగుతుంది. సామాజిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడం వలన మనలో భావ వ్యక్తీకరణకు దోహదపడుతుంది. సమాజంపై అవగాహన పెరుగుతుంది. -
సేవాస్ఫూర్తి .. చైతన్యదీప్తి
జిల్లాలో విస్తరిస్తున్న జాతీయ సేవా పథకం 85 కళాశాలల్లో 165 యూనిట్లు, 16,500 మంది వలంటీర్లు నేడు ఎన్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం రాయవరం: విద్యార్థి దశ నుంచే సేవా భావం, క్రమశిక్షణ, సమాజంపై అవగాహన కల్పించేందుకు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమ కళాశాలలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలోను, ప్రజలను సమాజ సేవ పట్ల చైతన్యపర్చడంలోను ఎన్ఎస్ఎస్ వలంటీర్ల కృషి వెల కట్టలేనిది. సమాజంలో ఉన్నవారిని చైతన్యపర్చడంతో పాటు, సమాజ సేవను తమ సేవగా భావించే భావజాలం విద్యార్థి దశ నుంచే అలవాటు చేయడం ద్వారా దేశ భవిష్యత్తుకు పునాదులు వేసినట్లవుతుంది. ప్రతిఫలం ఆశించకుండా సేవా మార్గం పట్టేవారే ఎన్ఎస్ఎస్లో వలంటీర్లుగా చేరతారు. సమాజాభ్యుదయమే ధ్యేయంగా సేవలందిస్తున్న జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)ను 1969 సెప్టెంబరు 24న ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఎన్ఎస్ఎస్సౌ ‘సాక్షి’ కథనం. ఇంతింతై వటుడింతై అన్నట్టు.. జాతీయ సేవా పథకాన్ని 1969 సెప్టెంబరు 24న ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈ పథకం రోజు రోజుకూ విస్తరిస్తోంది. ప్రారంభంలో జిల్లాలో 10 నుంచి 15 యూనిట్లు ఉండగా ప్రస్తుతం 25 జూనియర్ కళాశాలల్లో, 60 డిగ్రీ కళాశాలల్లో 165 యూనిట్లు ఉన్నాయి. మొత్తం 16,500 మంది విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో వలంటీర్లుగా కొనసాగుతున్నారు. సేవా కార్యక్రమాలు ఇలా.. ఈ ఏడాది జాతీయ సేవా పథకం కార్యక్రమాలకు సుమారుగా రూ.1.30 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక శిబిరాల నిర్వహణకు రూ.22,500 చొప్పున కేటాయిస్తారు. 2015–16 సంవత్సరంలో 165 ప్రత్యేక సేవా శిబిరాలను నిర్వహించారు. దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక శిబిరాల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక శిబిరాలతో సామాజిక చైతన్యం.. కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబాటు ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తాయి. ఆయా గ్రామాల్లో వారం రోజులు పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. విద్యార్థులు(వలంటీర్లు) రోజూ ఏదో ఒక రూపంలో ప్రజలకు సేవలందిస్తారు. ఇంటింటికీ వెళ్లి పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. మూఢ నమ్మకాలపై చైతన్యవంతం చేస్తారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని వివరిస్తారు. తాగునీటి వనరులను ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి క్లోరినేషన్ చేస్తారు. వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తారు. ప్రభుత్వ పథకాలు పొందడంపై అవగాహన కల్పిస్తారు. ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం, ఓటు విలువ తెలియజేయడం, ఉన్నత లక్ష్యాలు, సమాజానికి మేలు చేసే వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తారు. చదువు విలువను తెలియజేసి, అక్షరాస్యతను పెంపొందిస్తారు. యూనిట్ల బలోపేతమే లక్ష్యం.. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 165 యూనిట్లను బలోపేతం చేయడమే లక్ష్యం. ప్రతి యూనిట్లో 100 మంది విద్యార్థులను చేర్చుకుంటున్నాం. ప్రత్యేక క్యాంపునకు 50 మందిని తీసుకువెళ్తాం. ఎన్ఎస్ఎస్లో చేరిన విద్యార్థుల్లో వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయి. ప్రస్తుత యువత రక్తదానానికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజలకు సామాజిక విలువను తెలియజేస్తున్నారు. ప్రజా చైతన్యంతో పల్లెలు ప్రగతిబాట పడతాయి. – డాక్టర్ పి.వి.కృష్ణారావు, ఎస్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి -
యువదళం.. సేవా కెరటం
– భక్తుల సేవలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు – శ్రీశైలంలో దాదాపు 600 మంది వలంటీర్ల సేవలు – సేవలతో భక్తులు, అధికారుల మెప్పు పొందుతున్న వైనం ఊరుకాని ఊరు వచ్చిన వారికి ఓ చిన్న మంచి మాట.. కాస్తంత సాయం.. ఎంతో తృప్తిని కలిగిస్తాయి. అలాంటి సాయానికి తాము సదా సిద్ధమని జాతీయ సేవా పథక(ఎన్ఎస్ఎస్) వలంటీర్లు ముందుకొచ్చారు. గొంతెండిన వారికి దప్పిక తీర్చుతూ.. దారి తెలియని వారికి దారి చూపుతూ.. నడవలేని వారికి సాయం చేస్తూ.. దూరప్రాంతాల నుంచి వస్తున్న వారికి మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. పుణ్య స్నానం చేయడానికి వచ్చిన భక్తుల సేవలో తరించి ప్రజల మెప్పు పొందుతున్నారు. కష్ణా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు సేవ చేసేందుకు పాతాళగంగ, లింగాలగట్టు స్నాపు ఘాట్ల వద్ద దాదాపు 600 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, చిన్నారులు వలంటీర్ల సాయంతో సాఫీగా పుణ్యస్నానాలు చేస్తున్నారు. వలంటీర్ల సేవలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగడం లేదు. అధికారులకు తోడుగా వలంటీర్ల సేవలతో భక్తులకు పుణ్య స్నానాలు చేయడం సులభంగా ఉంది. శ్రీశైలంలో కర్నూలులోని ఫర్మెన్, కర్నూలు డిగ్రీ కాలేజ్‌లతోపాటు ఇండియర్ రెడ్‌క్రాస్ సొసైటీ, సున్నిపెంట డిగ్రీకళాశాల వలంటీర్లు భక్తులకు సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి అలుపు సొలుపులేకుండా విధులు నిర్వహిస్తున్నారు. – శ్రీశైలం (కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) సేవ చేయడంటే ఇష్టం: లోకేష్‌కుమార్, డిగ్రీ థర్డ్ ఇయర్, చిత్తూరు. మాది చిత్తూరు జిల్లా. అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సేవ చేయడమంటే ఇష్టం. అందుకోసమే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో వలంటీరుగా చేరాను. ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. పుష్కర భక్తులకు సేవ చేయడం సంతోషంగా ఉంది. దేశ సేవకు ఎప్పుడు ముందుంటాను: ప్రవీణ్‌కుమార్, డిగ్రీ ఫస్టియర్, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, కర్నూలు దేశ సేవ చేసేందుకే ఎన్ఎస్ఎస్లో చేరాను. శ్రీశైలానికి కృష్ణాపుష్కర భక్తులకు సేవచేయడానికి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మా సేవలను భక్తులు గుర్తిస్తే సంతోషిస్తా. వద్ధులకు స్నానం చేయిస్తుంటే ఆనందంగా ఉంది: గాయత్రీ, బీకామ్, ఫస్టియర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సున్నిపెంట వృద్ధులు, మహిళలకు పుష్కర స్నానం చేయించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. కొంతమంది కోపించుకున్నా ఆనందంగా వారిని ఘాట్ దగ్గరకు తీసుకెళ్లి స్నానం చేయిస్తున్నాం. అధికారులు మా సేవలను గుర్తించి ప్రశంసిస్తుంటే నాలో సామాజిక బాధ్యత ఇంకా పెరిగింది. -
విద్యతో పాటూ సేవాభావం ఉండాలి
సంగారెడ్డి రూరల్:దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యతో పాటు సేవాభావం కలిగి ఉండాలని స్థానిక ఎమ్మెల్యే చింతాప్రభాకర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లిలోని పీఎస్అర్ గార్డెన్లో గురువారం నిర్వహించిన జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) శిబిరం ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని సమాజంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కషి చేయాలన్నారు. తెలంగాణ అభివద్ధికి కషి చేస్తూ సామాజిక రుగ్మతలను తొలగించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జోగిపేట జూనియర్ కళశాల ప్రిన్సిపాల్ కేవీ రావు మాట్లాడుతూ దేశభక్తి ప్రమాణికంగా ఎన్ఎస్ఎస్ పనిచేస్తుందన్నారు. వాలంటర్లు క్రమశిక్షణతో పాటు ప్రణాళికబద్దంగా చదివి పైకిఎదగాలన్నారు. అనంతరం ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ గోకుల్ కష్ణ, ఎన్ఎస్ఎస్ రాష్ట్ర అధికారులు విష్టుదత్త, ఎమ్ఎస్ఎన్ రెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్‌ను ఘనంగా సన్మనించారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, ఎంఈఓ వెంకటేశం, లయన్స్‌క్లబ్ అధ్యక్షులు రామప్ప, ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ అల్లం రెడ్డి, ఇన్చార్జ్ రవితేజ, సీడీసీ డైరెక్టర్ జైపాల్‌నాయక్, ఎన్ఎస్ఎస్ వాలంటర్లు పాల్గొన్నారు. -
ఎన్ఎస్ఎస్లో ఏం జరుగుతోందో ?
జాతీయ అవార్డులపై వివరాలు లేవు తూతూ మంత్రంగానే కార్యక్రమాలు విభాగం పనితీరుపై అసంతృప్తి విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం విభాగంలో ఏమి జరుగుతోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. అడుగడుగుగా గోప్యత కనిపిస్తోంది. ఎన్ఎస్ఎస్లో అత్యుత్తమ అవార్డులుగా పరిగణించే ఇందిరాగాంధీ జాతీయ సేవా పురస్కారాలపై సమాచారం చివరి వరకు గోప్యంగా ఉంచారు. ఏయూ పరిధిలో ముగ్గురికి (ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి ఇ.పి.ఎస్.భాగ్యలక్ష్మి, వలంటీర్లు ఎస్.ఇంద్రజ, ఎం.చంటి) జాతీయ స్థాయి అవార్డులు లభిం చాయి. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో వీరు అవార్డులను స్వీకరించారు. దీనికి సంబంధించిన సమాచారం అక్టోబర్ చివరి వారంలోనే ఏయూ ఎన్ఎస్ఎస్ అధికారులకు అందినప్పటికీ బయటకు వెలువరించలేదు. అభినందనలు లేవు: జాతీయ స్థాయిలో వర్సిటీకి పేరుతీసుకువచ్చే ఈ అవార్డులు సాధించినపుడు ఉన్నతాధికారులకు తెలియజేయడం, వారి ద్వారా అవార్డు సాధించిన వారిని అభినందించి పంపడం రివాజుగా వస్తోంది. దీనికి భిన్నంగా ఈ సంవత్సరం ఎవరికి అవార్డులు లభించాయనే విషయాన్ని ఎన్ఎస్ఎస్ అధికారులు వెల్లడించలేదు. ఎందుకీ గోప్యత: అవార్డుల విషయంలో ఈ సంవత్సరం అధికారులు గోప్యంగా వ్యవహరించడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. గతేడాది వివరాలను వర్సిటీ అధికారులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అవార్డులు తీసుకున్న తరువాత ఢిల్లీ ఏపీ భవన్లో విలేకరుల సమావేశంలో విజేతలను వీసీ రాజు స్వయంగా అభినందించారు. అటువంటిది ఈ సంవత్సరం ఎందుకిలా చేశారో? ఎన్ఎస్ఎస్ విభాగమే సమాధానం చెప్పాల్సి ఉంది. ఇందిరను మరిచారు: ఇందిరాగాంధీ పేరుతో ప్రతీ సంవత్సరం అవార్డులు స్వీకరించడం ఏయూ ఎన్ఎస్ఎస్కు పరిపాటిగా మారింది. అటువంటి ఆమెకు నివాళి అర్పించడాన్ని ఎన్ఎస్ఎస్ అధికారులు విస్మరించారు. అవార్డులు తీసుకుంటున్నామనే సమాచారం ఉన్నప్పటికీ కార్యాలయంలో కనీసం ఇందిర చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించలేదు. ఎన్నో కార్యక్రమాలను అలవోకగా నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ విభాగానికి ఇందిర చిత్రపటానికి పూలమాల వేయడం పెద్ద విషయం కాదు. గురువారం ఇందిరమ్మ జయంతి రోజున ఎన్ఎస్ఎస్ అధికారులంతా వర్సిటీ ప్రాంగణంలో ఉన్నప్పటికీ కార్యక్రమం నిర్వహించక పోవడం విడ్డూరం. అవగాహన కల్పించలేరా? ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ఇందిరాగాంధీ అవార్డుపై చెప్పే సమయంలోనైనా ఆమె గురించి తెలపాల్సిన అవసరం ఉంది. జయంతి, వర్ధంతులు నిర్వహించడం ద్వారా వలంటీర్లలో ఇందిరాగాంధీ కార్యదక్షత, సేవా నిరతి, పట్టుదలను అలవరచడం సాధ్యమవుతోంది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులకే శిక్షణ అందించే ఏయూ ఎన్ఎస్ఎస్ విభాగం ఇటువంటి విషయాలను ఎందుకు విస్మరిస్తున్నారు. తూతూ మంత్రంగా కార్యక్రమాలు ఏయూ ఎన్ఎస్ఎస్ విభాగం తూతూ మంత్రంగా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వర్సిటీ ఆచార్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మెప్పు కోసమే కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. కొన్నాళ్లగా చెప్పుకోద గ్గ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. విభాగం పనితీరుపై విద్యార్థులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
నిధులున్నా.. విడుదల కావు
- కేయూ పరిధిలో వింతపోకడలు - బిల్లుల కోసం నిరీక్షిస్తున్న ప్రోగ్రాం ఆఫీసర్లు - ప్రారంభంకాని ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలు - మూలుగుతున్న రూ.1.69కోట్లు - ఇన్చార్జీల పాలనతోనే అస్తవ్యస్తం..! కేయూక్యాంపస్ : కేయూ పరిధిలో జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన ప్రోగ్రాం ఆఫీసర్లకు బిల్లుల చెల్లింపులో యూనివర్సిటీ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రోగ్రాం అధికారులు ఏటా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. ఒక్కో శిబిరానికి యూనివర్సిటీ ద్వారా రూ.22,500 చొప్పున ఎన్ఎస్ఎస్ ద్వారా చెల్లిస్తుంది. విద్యార్థులు వారంపాటు గ్రామాలు, ఇతర ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. వీరికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ భోజనం, వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తారు. శిబిరం ముగిశాక ఖర్చుకు సంబంధించిన బిల్లులను యూనివర్సిటీకి సమర్పిస్తారు. అధికారులు పరిశీలించి నిధులు మంజూరు చేస్తారు. మంజూరైన నిధులు.. కేయూ పరిధిలో 2014-15 విద్యాసంవత్సరం లో వివిధ కళాశాలల్లో 350కిపైగా ఎన్ఎస్ఎస్ యూనినట్లు నమోదై ఉన్నాయి. గతేడాది అక్టోబర్ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రో గ్రాం ఆఫీసర్లు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. వీటి తాలూకు వివరాలు, బిల్లుతో కూడిన ఫైలును ప్రోగ్రాం ఆఫీసర్లు యూనివర్సిటీ అధికారులకు సమర్పించారు. ఇప్పటి వరకు ముగ్గురు ఇన్చార్జీ వీసీలు మారారు. వారి వద్ద ఆ ఫైలు ముందుకు కదలలేదు. ఇటీవల ఇన్చార్జీ వీసీగా చిరంజీవులు బాధ్యలు చేపట్టగా ఆయన వద్దకు ఈ ఫైలు వెళ్లింది. సుమారు 200 కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ యూనిట్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలు గడిచినా ఒక్కరూపారుు విడుదల కావడంలేదు. విశేషం ఏమిటంటే.. ప్రభుత్వం ద్వారా యూనివర్సిటీకి రూ.1.69 కోట్లు మంజూరైనా విడుదల ఎందుకు చేయడంలేదో అర్థం కావడంలేదు. బిల్లులపై ఆడిట్‌తోనే..! గత విద్యాసంవత్సరంలోని బిల్లులు కావడంతో ఇవి సరైనవా, కాదా? అనే విషయంపై ఆడిట్ చేరుుంచారని తెలిసింది. ఇదే బిల్లుల విడుదలలో జాప్యానికి కారణమని తెలుస్తోంది. మరోవైపు.. తమకు బిల్లులు చెల్లించాలంటూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు నెలల కొద్దీ కేయూ ఆర్డినేటర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది బిల్లులు అందకపోవడంతో ఈవిద్యాసంవత్సరంలో ఒక్క ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం కూడా నిర్వహించలేకపోయూరు. మిగతా అంశాల మాదిరిగానే ఇన్చార్జీల పాలనలో ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలు సైతం నీరుగారిపోతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. -
కొనసాగుతున్న యువజనోత్సవాలు
ఎంజీయూ (నల్లగొండ రూరల్) : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి ఎన్ఎస్ఎస్ యవజనోత్సవాలు రెండో రోజు ఆదివారం వైభవంగా కొనసాగాయి. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల నుంచి 300 మందికిపైగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. 11 సాంస్కృతిక అంశాలపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె.నరేందర్ రెడ్డి మాట్లాడారు. సమాజ అభివృద్ధికి యువశక్తి ఎంతో ముఖ్యమన్నారు. చదువుతోపాటు శీతాకాల శిబిరాలు, వేసవి శిబి రాలు నిర్వహిస్తూ గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేస్తుండడం అభినందనీ యమన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల రవి, అనురాధరెడ్డి,విద్యార్థులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారులకు ఇందిర అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం) ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న అధికారులు, వాలంటీర్లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మంగళవారం ఇందిరాగాంధీ ఎన్ఎస్ఎస్ అవార్డులను అందించారు. వీరిలో ఏపీకి చెందిన ఏడుగురు అధికారులున్నారు. ఎన్ఎస్ఎస్ బెస్ట్ పోగ్రాం కోఆర్డినేటర్ అవార్డును ప్రొఫెసర్ కే రామకృష్ణ(ఓయూ), ఎన్ఏడీ పాల్(ఏయూ)లు అందుకున్నారు. బెస్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ అవార్డును డాక్టర్ ఎన్.కిరణ్‌చంద్ర(భీమవరం), ఆర్.శ్రవణ్‌కుమార్(హన్మకొండ)లు పొందారు. బెస్ట్ వలంటీర్ అవార్డును కోకిలా కైలాశ్‌పాండే(హైదరాబాద్), మహ్మద్‌అజార్(వరంగల్), రాజీవ్‌ఠాగూర్‌మోతా(విశాఖ)లు అందుకున్నారు. -
ఇద్దరికి ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డులు
కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డులకు కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. భార త ప్రభుత్వ కేంద్ర యువజన క్రీడల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయసేవా పథకం (ఎన్ఎస్ఎస్)లో సామాజిక సేవాకార్యక్రమంలో చురుకుగా భాగస్వాములైన ప్రోగ్రాం అధికారులు, వలంటీర్లకు ఏటా ఇందిరాగాంధీ జాతీయ అవార్డులు అందజేస్తుంటారు. ఈ మేరకు కాకతీయ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ పీఓ శ్రావణ్‌కుమార్, కేయూ లో ఎంఏ ఇంగ్లిష్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వలంటీర్ మహ్మద్ అజమ్ అవార్డులకు ఎంపికయ్యా రు. ఈనెల19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించనున్న జాతీయ సమైక్యత దినోత్సవంలో ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. ఈ సందర్భంగా వీరిని కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్‌లాల్, డాక్టర్ మనోహరాచారి అభినందించారు. 23 ఏళ్లుగా ఎన్ఎస్ఎస్ పీఓ వరంగల్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ 23 ఏళ్లుగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నా రు. వలంటీర్లలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించడంతోపాటు వివిధ సామాజిక సేవకార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఎంఏ హిందీ పూర్తిచేసి 1984లో కరీంనగర్ జిల్లా బెజ్జంకి కళాశాలలో హిందీ లెక్చరర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. 1991 నుంచి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములతున్నారు. 2005 లో డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హన్మకొండ కేడీసీలో హిందీ లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తూనే ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్వయంగా 15 సార్లు రక్తదానం చేసి వలంటీర్లలో అపోహలు తొలగించేందుకు కృషి చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24న రాష్ట్రస్థాయి ఎన్ఎస్ఎస్ అవార్డును కూడా అందుకున్నారు. ఇప్పు డు ఏకంగా ఇందిరాగాంధీ ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రశంసాపత్రంతోపాటు *90వేల నగదు రాష్ట్రపతి చేతులమీదుగా అం దుకోనున్నారు. ఇందులో *70 వేలు కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగానికి ఆయన వెచ్చించాల్సి ఉంటుంది. ఆరేళ్లుగా వలంటీర్.. కరీంనగర్ జిల్లాకు చెందిన మహ్మద్ ఆజమ్ ఆరేళ్లుగా ఎన్ఎస్ఎస్ వలంటీర్‌గా వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. మేఘాలయ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలోని జాతీయసమైక్యత శిబిరాలు, అంతర్రాష్ట్ర యువజన సదస్సులు, ప్రత్యేక శీతాకాల శిబిరాలో ప్రతిభ కనబర్చాడు. 2009లో వరద బాధితుల కోసం ఎన్ఎస్ఎస్ నాయకత్వంలో *10వేలు, పుస్తకాలు సేకరించారు. జిల్లాస్థాయి ఎన్ఎస్ఎస్ యు వజనోత్సవాల్లో బంగారు పతకం సాధించిన ఆజమ్ ఈ ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ వలంటీర్ అవార్డు అం దుకున్నారు. ప్రస్తుతం అవార్డు కింద *15వేలు నగ దు పారితోషికం, ప్రశంసాపత్రం అందుకుంటారు.