రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారులకు ఇందిర అవార్డులు | Indira Gandhi NSS Award | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారులకు ఇందిర అవార్డులు

Published Wed, Nov 20 2013 3:40 AM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM

రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారులకు ఇందిర అవార్డులు - Sakshi

రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్ అధికారులకు ఇందిర అవార్డులు

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న అధికారులు, వాలంటీర్లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మంగళవారం ఇందిరాగాంధీ ఎన్‌ఎస్‌ఎస్ అవార్డులను అందించారు. వీరిలో ఏపీకి చెందిన ఏడుగురు అధికారులున్నారు. ఎన్‌ఎస్‌ఎస్ బెస్ట్ పోగ్రాం కోఆర్డినేటర్ అవార్డును ప్రొఫెసర్ కే రామకృష్ణ(ఓయూ), ఎన్‌ఏడీ పాల్(ఏయూ)లు అందుకున్నారు. బెస్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ అవార్డును డాక్టర్ ఎన్.కిరణ్‌చంద్ర(భీమవరం), ఆర్.శ్రవణ్‌కుమార్(హన్మకొండ)లు పొందారు. బెస్ట్ వలంటీర్ అవార్డును కోకిలా కైలాశ్‌పాండే(హైదరాబాద్), మహ్మద్‌అజార్(వరంగల్), రాజీవ్‌ఠాగూర్‌మోతా(విశాఖ)లు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement