Mi Band 2
-
షావోమి న్యూ ఎంట్రీ.. ఎంఐ షూస్
సాక్షి,ముంబై : చైనా కంపెనీ షావోమి మరో ఎత్తుగడతో భారతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైపోయింది. స్మార్ట్ఫోన్లతో ఇండియాలో అడుగుపెట్టి స్మార్ట్‌ఫోన్ రంగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న షావోమి తాజాగా పాదరక్షల మార్కెట్‌పై కన్నేసింది. గత రెండు రోజులుగా ట్విటర్ ద్వారా ఊరిస్తూ వస్తున్న షావోమి అంచనాలకనుగుణంగానే ఎంఐ బ్రాండ్ ద్వారా 'ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2' పేరుతో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధర రూ.2,499గా నిర్ణయించింది. ఎంఐ ఇండియా వెబ్సైట్ ద్వారా ప్రీ ఆర్డర్ చేసినవారికి మార్చి 15 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది. బ్లాక్, గ్రే, బ్లు రంగుల్లో లభ్యమవుతున్నాయి. ఎం షూస్ 5ఇన్ 1 మౌల్డింగ్ టెక్నాలజీ, 5 రకాల మెటీరియల్స్‌తో మేళవించిన ఇంజనీరింగ్ టెక్నాలజీతో (షాక్ అబ్సార్బెంట్) , జారకుండా, దీర్ఘకాలం మన్నేలా వీటిని రూపొందించినట్టు కంపెనీ చెబుతోంది. పలు ఉత్పత్తులతో భారతీయ మార్కెట్లో విస్తరిస్తున్న షావోమి ఎంఐటీవీలు, ఎయిర్ ప్యూరిఫైర్లు, మాస్కులు, సన్ గ్లాసెస్, సూట్‌కేస్‌లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడిక యువజనమే టార్గెట్‌గా 'ఎంఐ మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2' లను రిలీజ్ చేసింది. Mi fans, here comes, the Mi Men's Sports Shoes 2. 👟 Unique Fishbone Structure 👟 5-in-1 Uni-Moulding technology 👟 Shock Absorbent Available at a special price. RT to spread the word! #BFF Show some ❤: https://t.co/rV0jopos68 pic.twitter.com/Bm9d6l7D3m — Mi India (@XiaomiIndia) February 6, 2019 -
ఒక్క రూపాయికే రెడ్మి నోట్4... షియోమి ఆఫర్ అదుర్స్
రెడ్మి ఫోన్ల సంచలన విక్రయాలతో రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వినియోగదారులకు సర్ ప్రైజింగ్ ఆఫర్లను ప్రకటించింది. ఒక్క రూపాయికే రెడ్ మి నోట్ 4 కొనుగోలు చేసుకునేలా రూ.1 ఫ్లాష్ సేల్ ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 6న నిర్వహించబోతున్న 'ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్' లో భాగంగా తమ యాప్ ద్వారా కొనుగోలు చేసే ఉత్పత్తులను ఒక్క రూపాయికే అందించనున్నట్టు షియోమి ప్రకటించింది. యాప్ తో ముడిపడి ఉన్న ఈ ఫెస్టివల్ కు షియోమి ఉత్పత్తులపై ఆఫర్లు పొందాలంటే కచ్చితంగా తమ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని, రిజిస్ట్రర్ చేసుకోవాల్సిందేనని ప్రకటించింది. ఎంఐ.కామ్ సైట్పైనా ఈ ఫెస్టివల్ ను కంపెనీ నిర్వహిస్తోంది. అయితే యాప్ ద్వారా మాత్రమే ఒక్క రూపాయి ఫ్లాష్ సేల్ ను చేపడుతోంది. ఈ విక్రయం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, కేవలం 20 రెడ్మి నోట్4 స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఒక్క రూపాయికి ఎంఐ స్టోర్ యాప్ లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటలకూ ఒక్క రూపాయి ఫ్లాష్ సేల్ ను చేపడుతోంది. ఈ సేల్ లో మాత్రం ఎంఐ బ్యాండ్ 2 లు రూపాయికి అందుబాటులో ఉంటాయి. అవి కూడా 40 యూనిట్లేనని తెలిపింది. అదేసమయంలో 10000ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంకులను 50 మేర విక్రయించనున్నట్టు ప్రకటించింది. వన్-డే ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా రెడ్మి 4ఏ, రెడ్మి నోట్ 4 ఫోన్లను విక్రయానికి అందుబాటులో ఉంచనుంది. ఇతర స్మార్ట్ ఫోన్లు రెడ్మి 3 ఎస్ ప్రైమ్, ఎంఐ 5, ఎంఐ మ్యాక్స్ ప్రైమ్ లపై కూడా ఆఫర్లు ప్రకటించింది. షియోమి ఇతర ఉత్పత్తులు ఎయిర్ ఫ్యూరిఫైయర్, ఇయర్ ఫోన్లు, ఎంఐ బ్యాండ్ వంటి అన్ని ఉత్పత్తులపైనా 500 రూపాయిల వరకు తగ్గింపును కంపెనీ ఇవ్వనుంది. గురువారం నిర్వహించబోయే ఈ సేల్ కు బుధవారం వరకు డిస్కౌంట్ కూపన్లు ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది. 10 గంటల నుంచి సేల్ ప్రారంభించి, స్టాక్ అయిపోయే వరకు ఈ సేల్ నిర్వహించనున్నట్టు పేర్కొంది. -
షియోమి ఎయిర్ ప్యూరిఫైర్2 వచ్చేసింది!
న్యూఢిల్లీ : చైనీస్ బహుళ జాతీయ కంపెనీ షియోమి రెండు కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. మి ఎయిర్ ప్యూరిఫైర్ 2 తో పాటు, వేరియబుల్ బ్యాండు మి బ్యాండు 2ను భారత వినియోగదారుల చెంతకు తీసుకొచ్చింది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్తో గృహోపకరణలోకి అడుగుపెట్టిన షియోమి, తాజాగా మి ఎయిర్ ప్యూరిఫైర్ 2 పేరుతో మరో ఉత్పత్తిని తీసుకొచ్చింది. రూ.9999కు ఈ మి ఎయిర్ ప్యూరిఫైర్ 2ను , మి డాట్ కామ్‌లో సెప్టెంబర్ 26 నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్ఫామ్లో దీన్ని అక్టోబర్ 2 నుంచి విక్రయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అదేవిధంగా మి బ్యాండు 2ను 1,999రూపాయలకు మి డాట్ కామ్‌లో సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్ 30 నుంచి కూడా ఈ బ్యాండును అమెజాన్‌లో కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించింది. పాత వెర్షన్‌తో పోలిస్తే మి ఎయిర్ ఫ్యూరిఫైర్ 2 డిజైన్ చాలా దృఢంగా ఉంటుందని కంపెనీ చెపుతోంది. మి ఎయిర్ ప్యూరిఫైర్ 2, భారత ఎయిర్ ప్యూరిఫైర్ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తుందని షియోమి వైస్ ప్రెసిడెంట్ హ్యగో బరా తెలిపారు. వై-ఫై కనెక్షన్‌తో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చని చెప్పారు. సంప్రదాయం ఎయిర్ ప్యూరిఫైర్ల మాదిరిగా కాకుండా మూలమూలలా గాలిని ఇది శుద్ధి చేస్తుందని 360 డిగ్రీల్లో ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతన్న వాటికంటే ఇది చాలా అధికం. ఎయిర్ ఫ్యూరిఫైర్ 2 గాలిలోని కాలుష్యాన్ని 99.7 శాతం వరకు తగ్గిస్తుందని షియోమి వెల్లడించింది.అంతే కాకుండా దీని క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ (సీఏడీఆర్) సామర్థ్యం గంటకు 330 క్యూబిక్ మీటర్లని పేర్కొంది. మి బ్యాండు 2 పేరుతో తీసుకొచ్చిన వేరియబుల్ బ్యాండు ఓలెడ్ డిస్ప్లేతో, తక్కువ బరువు కలిగి ఉంటుందని షియోమి తెలిపింది. ఇది చాలా స్లిమ్‌గా ఉంటుందని చెప్పింది. దీన్ని బ్యాటరీ లైఫ్ 20 రోజుల వరకు ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది.