Micro Labs
-
డోలో 650, రూ. వెయ్యికోట్ల ఫ్రీబీస్: ఐపీఏ సంచలన రిపోర్టు
న్యూఢిల్లీ: డోలో-650 తయారీదారు మైక్రో ల్యాబ్ డాక్టర్లకు వెయ్యి కోట్ల రూపాయల లంచాలు అందించిందన్న వార్త నిజం కాదా? దేశీయ ఫార్మా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) రిపోర్టు ఇదే తేల్చింది. వెయ్యికోట్ల రూపాయల ఉచితాలను అందించిందనేది కరెక్ట్ కాదని నేషనల్ ఫార్మా స్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)కి ఐపీఏ సమర్పించిన పరిశోధనా నివేదిక వెల్లడించింది. కంపెనీ వివరణలో సింగిల్ బ్రాండ్ డోలో, ఫ్రీబీస్‌పై రూ. 1000 కోట్లు ఖర్చు చేసిందనేది కరెక్టే. కానీ ఒక్క ఏడాదిలో అనేది సరైంది కాదని నివేదించింది. ఒక సంవత్సరంలో (మైక్రో ల్యాబ్స్) 1000 కోట్ల ఖర్చు చేసినట్టుగా తప్పుగా ప్రచారం చేశారని ఐపీఏ పేర్కొంది. కంపెనీ మొత్తం టర్నోవర్ రూ. 4500 కోట్లు, అందులో దాదాపు రూ. 2500 కోట్ల దేశీయ విక్రయాలు. గత నాలుగేళ్లలో దేశీయ విక్రయాలపై (ఏడాదికి ఏడాదికి అన్ని కార్యకలాపాలపై) సగటున రూ. 200 కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలో ఐపీఏ వెల్లడించింది. ఐపీఏ విచారణకు ప్రతిస్పందనగా మైక్రోల్యాబ్స్ అన్ని కార్యకలాపాలపై ఐదు సంవత్సరాల వ్యయాల రిపోర్టును అందించింది. ఇందులో 2020-21 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు, మార్కెటింగ్‌పై మొత్తం రూ. 186 కోట్లు వెచ్చించిందని, అందులో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టీమ్ ఖర్చులకు రూ. 65 కోట్లు, సైంటిఫిక్ అండ్ అకడమిక్ సేవలకు రూ. 67 కోట్లు, దాదాపు రూ. 53 కోట్లు వెచ్చించామని వివరించింది. అలాగే 2019-20లో కంపెనీ సేల్స్ అండ్ ప్రమోషన్ యాక్టివిటీస్ కోసం రూ.67 కోట్లు వెచ్చించింది. ఈ నివేదిక ప్రకారం, కంపెనీ గత ఐదేళ్లలో డోలో 650పై చేసిన మొత్తం ఖర్చులకు సంబంధించి, 2021లో మొత్తం 1152 లక్షలు వెచ్చించింది. 22 విజువల్ యాడ్స్, లిటరేచర్ అండ్ ప్రింట్ ప్రమోషనల్ ఇన్పుట్లు, బ్రాండ్ రిమైండర్స్, ఫిజిషియన్ శాంపిల్స్, సైంటిఫిక్ అండ్ అకడమిక్ సర్వీసెస్ కలిపి 2020-21లో ఈ ఖర్చు రూ. 712 లక్షలుగా ఉంది. డోలో650 సరైన మోతాదు అవునా కాదా, ధరల నియంత్రణలో ఉందా లేదా అనేదికూడా ఐపీఏ పరిశీలించింది. డోలో-650 ఎంజీ 2018లో ఇండియన్ ఫార్మకోపోయి ఆమోదించిందని తెలిపింది. ఇది జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాలో ఉందని స్పష్టం చేసింది. కాగా వైద్య సంఘాల ఫిర్యాదులను స్వీకరించిన ఎన్పీపీఏ, యూనిఫాం కోడ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (యుసిపిఎంపి) కింద దర్యాప్తు చేయాలని ఐపీఎను కోరింది. ఇందుకు ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ కాలంలో ఈ టాబ్లెట్లను సిఫారసు చేసేందుకుగాను వైద్యులకు వెయ్యి కోట్ల రూపాయల లంచం ఇచ్చిందన్న ఆరోపణలు, డోలో-650 మేకర్ మైక్రో ల్యాబ్స్ జూలైలో పన్ను ఎగవేత ఆరోపణలపై టాప్ మేనేజ్మెంట్ కార్యాలయాలు, నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు కూడా నిర్వహించింది. -
అది అసాధ్యం.. డోలో 650 మేకర్ల కీలక ప్రకటన
ఢిల్లీ/బెంగళూరు: డోలో-650 ప్రమోషన్లో భాగంగా.. వైద్యులకు రూ. వెయ్యి కోట్ల ఉచితాలు పంచిందని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు, ఈ విషయంపై నివేదిక సమర్పించాలంటూ కేంద్రానికి పదిరోజుల గడువుతో నోటీసులు సైతం జారీ చేసింది. అయితే.. ఈ ఆరోపణలు నిరాధరమైనవంటూ బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కొట్టిపారేసింది. కరోనా తారాస్థాయిలో ఉన్న సమయంలోనే డోలో అమ్మకాల ద్వారా రూ.350 కోట్ల వ్యాపారం జరిగిందని, అలాంటిది వాటి ప్రమోషన్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామనే ఆరోపణలు రావడం విడ్డూరంగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డోలో-650 అనేది NLEM (ధరల నియంత్రణ) పరిధిలోకే వస్తుంది. పైగా కేవలం కొవిడ్ ఏడాదిలోనే రూ. 350 కోట్ల బిజినెస్ జరిగితే.. అలాంటి బ్రాండ్ కోసం వెయ్యి కోట్ల రూపాయలతో మార్కెటింగ్ చేయడం అసలు సాధ్యమయ్యే పనేనా? అంటూ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ గోవిందరాజు ప్రశ్నిస్తున్నారు. అలాగే కరోనా టైంలో కేవలం డోలో-650 ట్యాబ్లెట్స్ మాత్రమే కాదని.. విటమిన్ ట్యాబ్లెట్స్ సైతం భారీగానే బిజినెస్ చేశాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారాయన. ఇదిలా ఉంటే డోలో 650 ప్రమోషన్లో భాగంగా.. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులకు వెయ్యి కోట్ల రూపాయాల తాయిలాలు ఇచ్చిందంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్ఆర్ఏఐ) అనే స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ఆరోపించింది. ఇటీవల డోలో–650 ఎంజీ తయారీ కంపెనీ ప్రాంగణాల్లో సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) సోదాలు చేసి ఈ అంశాన్ని బహిర్గతంచేసిందని సుప్రీంకోర్టుకు విన్నవించింది. పారాసెటమాల్ నిర్దిష్ట సూత్రీకరణలు(certain formulations) 500 mgm నియంత్రణలో ఉన్నట్లుగా ధర నియంత్రణలో చూపిస్తుంది. కానీ, 650 mgm పారాసెటమాల్ కిందకు రాదు. కాబట్టి వారు ఎక్కువ ధరలకు మందులను అమ్మవచ్చు అనేది సదరు ఎన్జీవో ఆరోపణ. ఇక దీన్నొక తీవ్ర అంశంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం, కేంద్రానికి నోటీసులు పంపింది. ఈ సందర్భంగా.. బెంచ్‌లో ఉన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ సైతం తనకు కూడా కరోనా టైంలో వైద్యులు డోలో-650నే రిఫర్ చేయడాన్ని గుర్తు చేశారు. ఇదీ చదవండి: Dolo-650ని సిఫార్సు చేస్తే.. చాలు!! -
కృత్రిమమేధతో సామాన్యులకు మేలు
సాక్షి, హైదరాబాద్: సామాన్యుల బాగు కోసం కృత్రిమమేధను వినియోగించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) తెలిపారు. దేశంలో మొదటగా కృత్రిమమేధ వినియోగంపై విధానపత్రం రూపొందించిన ఘనత తెలంగాణదేనని, టీ–ఎయిమ్ ద్వారా ఇప్పటికే 80కిపైగా కృత్రిమమేధ ఆధారిత స్టార్టప్‌లు పనిచేస్తుండగా టాస్క్ కార్యక్రమంలో భాగంగా 25 వేలమంది విద్యార్థులు, 4,500 మంది బోధన సిబ్బందికి ఈ అంశంపై శిక్షణ కూడా ఇప్పించామని పేర్కొన్నారు. ఈ ఏడాది రికార్డుస్థాయిలో లక్షమంది పాఠశాల విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులు కూడా అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణం, ప్రమాదాల నివారణలే లక్ష్యంగా ‘ఐ–రాస్తే’, కెమెరాలు, సెన్సర్లు, లైడార్ల సాయంతో కార్లు, ఇతర వాహనాల రవాణా కోసం బోధ్యాన్, బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మజీవుల జన్యుక్రమ విశ్లేషణ ద్వారా కోవిడ్ వంటి వ్యాధులను గుర్తించడం, ప్రమాదాన్ని అంచనావేయడం, కొత్త మందులను తయారు చేయడం వంటి పనుల కోసం ‘మైక్రోల్యాబ్’ప్రాజెక్టులను కేటీఆర్ ప్రారంభించారు. 2024 నాటికి రోడ్డు ప్రమాదాలను యాభై శాతం తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుండగా, ఐ–రాస్తే వంటి టెక్నాలజీలు ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో ఉపకరిస్తాయన్నారు. ఐ–రాస్తేను తాము ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, 14 బస్సుల్లో కెమెరాలు, సెన్సర్లు అమర్చి రహదారులపై ప్రమాదాలకు అవకాశమున్న ప్రాంతాలు (బ్లాక్‌స్పాట్స్), మౌలిక సదుపాయాల్లో ఉన్న లోపాలను గుర్తించే ప్రయత్నం చేశామని, త్వరలోనే 200 బస్సుల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఏదైనా వాహనాన్ని ఢీకొట్టే అవకాశం ఉంటే రెండు సెకన్ల ముందుగానే ఈ టెక్నాలజీ గుర్తించి అప్రమత్తం చేస్తుందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ, ఇంటెల్, ఉబెర్ల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై ముందుకు సాగుతామన్నారు. కృత్రిమ మేధదే భవిష్యత్తు కృత్రిమ మేధ భవిష్యత్తులో రవాణా, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అనేక రంగాలపై గణనీయ ప్రభావం చూపుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 2035 నాటికి కృత్రిమ మేధ ద్వారా గ్రాస్ వ్యాల్యూ అడిషన్ (స్థూల జాతీయోత్పత్తితో సరిపోల్చగల ప్రమాణం)ను 1.3 శాతం పెంచుతుందని నీతిఆయోగ్ అంచనా కట్టిందని, దీని విలువ ఏకంగా రూ.76 లక్షల కోట్లని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.జె.నారాయణన్, ఇంటెల్ కంట్రీ హెడ్ నివృతి, తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులతోపాటు ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగపు ఉన్నతాధికారి రమాదేవి, ఉబెర్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం బోధ్యాన్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ రహదారులను మ్యాప్ చేసే లక్ష్యంతో కెమెరాలు, లైడార్లు, సెన్సర్లతో కూడిన బోధ్యాన్ కారును కేటీఆర్ ఆసక్తిగా పరిశీలించారు. -
డోలో-650 కంపెనీపై పెద్ద ఎత్తున ఐటీ దాడులు
బెంగళూరు: కోవిడ్-19సంక్షోభంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన డోలో-650 తయారీ సంస్థ మైక్రో లాబ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆదాయపు పన్ను ఎగవేశారనే ఆరోపణలతో మైక్రో ల్యాబ్స్ కార్యాలయంపై ఐటీ శాఖ బుధవారం పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఏకంగా 200 మంది ఐటీ సిబ్బంది పాల్గనడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా మాధవనగర్‌లోని రేస్‌కోర్స్ రోడ్డులోని మైక్రో ల్యాబ్స్ నుంచి అధికారులు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవా సహా దేశవ్యాప్తంగా 200 అధికారులు ఏకకాలంలో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఆదాయానికి సంబంధించి పన్నులు ఎగ్గొట్టారనే అనుమానంతో సంస్థ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానాల ఇళ్లల్లో కూడా దాడులు చేపట్టినట్టు ఐటీ శాఖ. వెల్లడించింది. కాగా 2020లో కరోనా విజృంభణ కాలంనుంచి డోలో-650 ట్యాబ్లెట్ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. జ్వరాన్ని నియంత్రించే డోలో-650 జనంలోకి విపరీతంగా చొచ్చుకుపోయింది. ఫలితంగా అమ్మకాల్లో రికార్డుల్ని బ్రేక్ చేసింది. 350 కోట్ల టబ్లెట్ల విక్రయాలతోఏడాదిలో 400 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. 1983లో కుటుంబ వ్యాపారాన్ని స్వీకరించిన సురానా ఫార్మా రంగంలో అనుభవజ్ఞుడు -
మైక్రోల్యాబ్స్ నుంచి డెంగ్యూ నివారణకు క్యారిపిల్ కాప్యుల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వారిలో ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచే ‘క్యారిపిల్’ కాప్యుల్స్‌ను మైక్రోల్యాబ్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. బొప్పాయి ఆకుల రసం నుంచి తయారు చేసిన ఈ ఔషధాన్ని వినియోగించిన వారిలో ప్లేట్లెట్స్ సంఖ్య పెరగడం నిరూపితమైనట్లు మైక్రోల్యాబ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ జి అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో లాంఛనంగా విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకు మూడు చొప్పున ఐదు రోజులు వీటిని వినియోగిస్తే సరిపోతుందన్నారు. డెంగ్యూ వ్యాధితో హాస్పిటల్లో చేరితే సగటున రూ. 25,000 నుంచి రూ. 75,000 వరకు వ్యయం అవుతోందని, కానీ క్యారిపిల్ ఐదు రోజుల ఖర్చు రూ. 375 మాత్రమేనన్నారు. క్యారిపిల్ను తయారు చేసి విక్రయించడానికి ఆయుష్ అనుమతులు మంజూరు చేసిందని, వీటిని వినియోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు. నాలుగు దేశాల్లో 350 మందిపై, ఇండియాలో 30 మందిపై క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు మైక్రోల్యాబ్ సీనియర్ మేనేజర్ డాక్టర్ ప్రభు కస్తూరి తెలిపారు. విడుదల చేసిన తొలి నెలల్లో 40,000, మరుసటి నెలలో 1.8 లక్షలు క్యారిపిల్స్ను విక్రయించినట్లు జయరాజ్ తెలిపారు.