mijoram
-
రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..!
సక్సెస్‌కి మారుపేరుగా నిలవాలంటే జెండర్‌తో పని ఏముంది. పట్టుదల ఉండాలి...దానికి తగ్గ కృషి, వీటన్నింటికీ మించిన సంకల్పం ముఖ్యం. దీనికి ఆత్మ విశ్వాసాన్ని, కఠోర శ్రమను జోడించి సక్సెస్‌తో సలాం చేయించుకుంటూ ఈ విషయంలో మేమేం తక్కువ కాదంటోంది మహిళా శక్తి. వివక్షల్నీ, అడ్డంకుల్నీ అధిగమించి వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా శక్తికి, సాధికారతకు, నిదర్శనంగా నిలిచారు ముగ్గురు ధీర వనితలు. దేశం గర్వించేలా భారత నారీశక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. అక్షతా కృష్ణమూర్తి అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)తో కలిసి మార్స్ రోవర్‌ను నిర్వహించే తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ డా. అక్షతా కృష్ణమూర్తి. పెద్ద పెద్ద కలలు కనడం పిచ్చితనమేమీ కాదు.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. ఆశయ సాధనలో అలుపెరుగక పనిచేస్తూ పొండి... విజయం మీదే, నాదీ గ్యారంటీ అంటారామె. అంగారక గ్రహంపై రోవర్‌ను ఆపరేట్ చేయనున్న తొలి భారతీయ మహిళగా అవతరించిన తన సక్సెస్ జర్నీని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 13 ఏళ్ల క్రితమే నాసాలో పని చేయాలనేది ఆమె కల. భూమి ,అంగారక గ్రహంపై సైన్స్ అండ్ రోబోటిక్ ఆపరేషన్స్‌కు నాయకత్వం వహించాలనేది చిరకాల డ్రీమ్. అలా అమెరికా ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో లక్ష్యాన్ని సాధించేంతవరకు ఎవరేమన్నా పట్టించుకోలేదు. View this post on Instagram A post shared by Dr. Akshata Krishnamurthy | Rocket Scientist (@astro.akshata) కానీ ఇది అంత సులువుగా ఏమీ జరగలేదు. పీహెచ్డీ డిగ్రీనుంచి నాసాలో ఫుల్ టైం ఉద్యోగం వచ్చేదాకా ఎంతో కష్టపడ్డాను అని చెప్పారు. ఈ రోజు, అంగారక గ్రహంనుంచి అనేక శాంపిల్స్‌ను భూమికి తీసుకురావడానికి రోవర్‌తో సహా పలు కూల్ స్పేస్ మిషన్లలో పని చేస్తున్నాను అని పేర్కొన్నారు. అక్షత MIT (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుండి పీహెచ్డీ ఏశారు. నాసాలో చేరిన అతికొద్ది మంది భారతీయుల్లో ఆమె కూడా ఒకరు. నాసాలో ప్రధాన పరిశోధకురాలిగా గత ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. మహిళా ఆర్మీ డాక్టర్ కెప్టెన్ గీతిక కౌల్ సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లోని భారత సైన్యానికి చెందిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. స్నో లెపార్డ్ దళానికి చెందిన కెప్టెన్ గీతికా కౌల్ చరిత్ర సృష్టించారు. హిమాలయాల ఉత్తర భాగంలో ఉన్న సియాచిన్ బాటిల్ స్కూల్లో కఠినమైన ఇండక్షన్ శిక్షణను సక్సెస్‌ఫుల్‌గా ప పూర్తి చేసి మరీ ఈ కీలకమైన మైలురాయిని సాధించారు. అనేక అడ్డంకులను ఛేదించి అంకితభావంతో, దేశానికి సేవ చేయడం స్ఫూర్తిదాయకం. స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధి తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేసిన మరో మహిళా శక్తి స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాధి. మిజోరాంలో గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి కీలక పదవిలో పాధిని ఎంపిక చేశారు. 2015 బ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయిన Sqn లీడర్ మనీషా పాధిని భారత సాయుధ దళాల నుండి భారతదేశపు తొలి మహిళా సహాయకురాలుగా (ఎయిడ్-డే-క్యాంప్) నియమించారు.అధికారికంగా ఆమె బాధ్యతలను కూడా స్వీకరించారు. Sqn లీడర్ మనీషా పాధి మూడు కీలక పదవులను కూడా నిర్వహించారు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బీదర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పూణే, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, భటిండాలో పనిచేశారు. ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన మనీషా తండ్రి ఇన్స్పిరేషన్. ఆమె భర్త మేజర్ దీపక్ సింగ్ కర్కీ ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నారు. భువనేశ్వర్‌లోని CV రామన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన మనీషా 2015లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఏఐఎఫ్‌లో చేరారు. Squadron Leader Manisha Padhi appointed as Aide-De-Camp(ADC) to the Governor of Mizoram. Sqn Leader Manisha is India’s first Woman Indian Armed Forces officer to be appointed as Aide-De-Camp(ADC) to the Governor in the country: Governor of Mizoram (Source: Office of Governor of… pic.twitter.com/3wsWuI5hBW — ANI (@ANI) December 4, 2023 ఏడీసీ అంటే? గవర్నర్‌కు వ్యక్తిగత సహాయకురాలిగా అధికారిక పర్యటనలలో కూడా రాజ్యాంగ అధికారంతో వెంట ఉంటారు. ప్రతి గవర్నర్‌కు ఇద్దరు ADCలు ఉంటారు, ఒకరు సాయుధ దళాల నుండి , మరొకరు పోలీసు అధికారి. మిజోరంలో,రెండో ఏడీసీ రాష్ట్ర పోలీసు అధికారిగా జోనున్ తారా ఉన్నారు. -
భారత్‌లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి..
వైవిధ్యమైన సంస్కృతికి, గొప్ప వారసత్వ సంపదకు నిలయం భారత్. పర్యాటకులను కట్టిపడేసే ఎన్నో ప్రకృతి సోయాగాలు మన దేశంలో ఉన్నాయి. అయితే భారత ఉపఖండంలోని మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించడం ఒకేలా ఉండదు. ముఖ్యంగా 6 పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఇన్నర్ లోన్ పర్మిట్(ఐఎల్పీ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేకపోతే ఆ చోటుకు అసలు అనుమతించరు. ఐఎల్పీ పర్మిషన్ అంటే? ఇన్నర్ లోన్ పర్మిట్ అనేది కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో అమల్లో ఉన్నదే. ఇతర దేశాలతో సరిహద్దు పంచుకునే సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ పర్యటనలకు వెళ్లేవారికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఆదివాసీ తెగల సంక్షేమంతో పాటు పర్యాటకులకు భద్రత కల్పించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆరు ప్రదేశాలు ఇవే.. అరుణాచల్ ప్రదేశ్: గొప్ప సంస్కృతికి నిలయమైన ఈ ఈశాన్య రాష్ట్రం.. చైనా, భూటాన్, మయన్మార్ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. అందుకే ఈ ప్రాంతంలో పర్యటించాలనుకునే సందర్శకులు కోల్‌కతా, ఢిల్లీ, షిల్లాంగ్, గువాహటి రెసిడెంట్ కమిషనర్ల నుంచి ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో సందర్శకుడు రూ.100 చెల్లించాలి. నెల రోజుల పాటు అనుమతి ఉంటుంది. నాగలాండ్.. సంప్రదాయ తెగలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్‌తో సరిహద్దు కలిగి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతంలో పర్యటించాలనుకునే వారు ఢిల్లీ, కోల్‌కతా, కోహిమా, దిమాపూర్, షిల్లాంగ్, మొక్కోచుంగ్ డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవచ్చు. లక్షద్వీప్.. భారత్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇదీ ఒకటి. అందమైన బీచ్‌లు, రుచికరమైన ఆహారానికి నిలయం. ఈ ప్రాంతంలో పర్యటించాలంటే పోలీస్ క్లియరెన్స్‌తో పాటు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. మిజోరం.. ప్రకృతి సోయగాలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్, బంగ్లాదేశ్‌తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. ఆదివాసీలకు నిలయమైన ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఏఎల్పీ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిల్చార్, కోల్‌కతా, షిల్లాంగ్, ఢిల్లీ, గువాహటి లీయాసోన్ అధికారుల నుంచి దీన్ని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విమానంలో వెళ్తే.. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ప్రత్యేక పాసులు తీసుకోవాలి. సిక్కిం.. భారత్‌లోని అతిచిన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. హిమాలయాలకు ప్రవేశ ద్వారం. అందమైన పచ్ఛికభూములు, అద్భుతమైన వంటకాలు, అనేక మఠాలు, స్పటిక సరస్సులు, కట్టిపడేసే ప్రకృతి అందాలకు నిలయం. మునుపెన్నడూ పొందని అనుభూతిని పర్యాటకులు ఇక్కడ పొందుతారు. సిక్కింలోని సోమ్గో, బాబా మందిర్ ట్రిప్, సింగలీలా ట్రెక్, నాథ్లా పాస్, జోంగ్రీ ట్రెక్, తంగు చోప్తా వ్యాలీ ట్రిప్, యుమెసామ్‌డాంగ్, యమ్తాంగ్, జోరో పాయింట్ ట్రిప్ వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లద్దాక్.. ప్రతి పర్యాటకుడు ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతం ఇది. ఐఎల్పీ లేనిదే ఇక్కడకు రానివ్వరు. నుబ్రా వ్యాలీ, ఖార్డంగ్ లా పాస్, తో మోరిరి సరస్సు, పాంగాంగ్ త్సో సరస్సు, దాహ్, హను విలేజ్, న్యోమా, టర్టక్, డిగర్ లా, తంగ్యార్ వంటి ప్రదేశాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. -
గవర్నర్ గా నియమించినందుకు ధన్యవాదాలు : హరిబాబు
-
దేవుని మన్నింపు
దైవికం మిజోరామ్‌లో కొంతకాలంగా దైవానికీ, దుష్టశక్తికీ మధ్య పోరు సాగుతోంది. పద్దెనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో ఉన్న మద్య నిషేధాన్ని రద్దు చేయాలని కొందరు, నిషేధాన్ని కొనసాగించాల్సిందేనని కొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. ఈ రెండు వర్గాలలో ఎవరు దైవం వైపున, ఎవరు దుష్టశక్తి తరఫున ఉన్నట్లు? సాధారణంగా మద్యం ఆరోగ్యానికి హాని చేస్తుంది కనుక నిషేధాన్ని రద్దు చేయొద్దని కోరుతున్న వారిని దైవం వైపు ఉన్నట్లు అనుకోవాలి. నిషేధం రద్దు చేసి మద్యం అమ్మకాలను ప్రారంభించాలని కోరుతున్న వారిని దుష్టశక్తి ప్రేరేపిస్తుందని భావించాలి. ఎంచేతంటే దుష్టశక్తి పూర్తిగా దైవానికి వ్యతిరేకం కనుక మానవుల్ని కూడా దేవుడికి ఇష్టం లేని వాటి వైపు అది నడిపిస్తుంది కాబట్టి. అయితే మిజోరామ్‌లో వాదులాడుకుంటున్నవారు మామూలు ప్రజలు కాదు. మిజోరామ్ రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష శాసనసభ్యులు. మంత్రులన్నాక ప్రజా సంక్షేమం కోసం ఏదైనా చేయాల్సి ఉంటుంది. అందుకు డబ్బు కావలసి ఉంటుంది. అంత డబ్బును రాబడిగా పొందడానికి వాళ్లకు కనిపించింది ఎక్సైజ్ శాఖ ఒక్కటే! అందుకే వృత్తి ధర్మంగా (లేదా సేవా ధర్మంగా) ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్యంపై నిషేధాన్ని ఎత్తివేయడమే ఉత్తమ మార్గంగా కనిపించింది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో వృత్తి ధర్మం, లేదా సేవాధర్మం దేవుని అభీష్టానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుడికి ఇష్టం లేదు. కానీ ప్రజల కోసం తప్పడం లేదు. ఏం చేయాలి? మంచైనా, చెడైనా ముఖ్యమంత్రి చెప్పినట్లు చెయ్యాలి. సరిగ్గా అదే పని చేశారు లాల్జిర్లియానా. లాల్జిర్లియానా మిజోరామ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి. అసెంబ్లీలో ఆయన సీటు ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా సీటు పక్కనే ఉంటుంది. లాల్జిర్లియానాకు వ్యక్తిగతంగా మద్యనిషేధాన్ని రద్దు చేయడం ఇష్టం లేనప్పటికీ, వాదోపవాదాల అనంతరం అయన ‘మిజోరామ్ లిక్కర్ (ప్రొహిబిషన్ అండ్ కంట్రోల్) బిల్లు’ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మద్య నిషేధాన్ని తొలగించడం దేవునికి ఇష్టం లేని కార్యమని తను నమ్మినప్పటికీ ఒక రాజకీయ అనివార్యత ఆయన్ని అటువైపుగా నడిపించింది. బలహీనమైన గొంతుతో ఆయన బిల్లుపై ప్రకటన చేసినప్పుడు నలభైమంది సభ్యులు గల మిజోరామ్ అసెంబ్లీలో కనీసం సగంమంది ఆయనకు మద్దతు పలికారు. నిషేధం కారణంగా కల్తీ మద్యం తాగి ఎంతోమంది యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కనుక, నిఖార్సయిన మద్యాన్ని అందుబాటులోకి తెస్తే కల్తీ మద్యం మరణాలు తగ్గుతాయని వారు అభిప్రాయపడ్డారు. విపక్షానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ అభిప్రాయాన్ని ఖండిస్తూ, ‘‘మద్యం అందుబాటులోకి వస్తే యువత నైతికంగా పాడైపోతుంది. అది మరణం కంటే ఘోరం. ఇంతటి ఘోరానికి పాల్పడుతున్నందుకు దేవుడు మనల్ని క్షమించడు’’ అన్నారు. దేవుడి మాట రాగానే మంత్రి జోడింత్లువంగ పైకి లేచారు. ఒకప్పుడు ఆయనదీ లిక్కర్ బిజినెస్సే. మద్యనిషేధాన్ని రద్దు చేసే బిల్లును సమర్థిస్తూ ఆయన, ప్రధాన ప్రతిపక్షం ‘మిజో నేషనల్ ఫ్రంట్’ వ్యవస్థాపకులు లాల్డెంగా గతంలో ఎప్పుడో చేసిన ప్రసంగంలోని రెండు మాటలను సభకు గుర్తు చేశారు. ‘‘మీ నాయకుడే అలా అన్నాక ఇంకా దేవుడి ప్రస్తావన ఎందుకు?’’ అన్నారు. ఇంతకీ ఏమిటీ రెండు మాటలు అంటే : ‘‘మద్యపానం మంచిదని చెప్పలేం, చెడ్డదని చెప్పలేం. అదొక కృత్యం. దీని గురించి మనం వెళ్లి ఏ మతాన్నీ సంప్రదించనవసరం లేదు. ఎందుకంటే మనది లౌకిక ప్రభుత్వం’’ అన్నారట లాల్డెంగా. చివరికి బిల్లు పాస్ అయింది. స్వయానా ఎక్సైజ్ మంత్రికే ఇష్టం లేకున్నా మద్యం బిల్లు మిజోరామ్‌లో మద్యపానానికి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కోసం, లేదా రాబడి కోసం, లేదా ప్రజాసంక్షేమం కోసం బల్ల మీద బిల్లు పెట్టిన మంత్రి లాల్జిర్లియానా బిల్లు పెట్టే ముందరి ఆదివారం ఏం చేశారో తెలుసా? అక్కడికి సమీపంలోని ఆర్మ్డ్వెంగ్ ప్రాంతంలోని చర్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల ముగింపులో లేచి నిలబడి, అందరికీ వినబడేలా గద్గద స్వరంతో దేవుడిని మన్నించమని కోరారు! ‘‘సర్వశక్తి సంపన్నుడివైన ప్రభువా... ఈవారం నేను మద్యపాన నిషేధాన్ని రద్దుచేసే బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నాను. అది నీ అభీష్టానికి విరుద్ధమైనట్లయితే, అది నాకు అసాధ్యం అయ్యేలా నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఏదైనా అవాంతరం తెప్పించు’’ అని ప్రార్థించారు. కారుణ్యమూర్తి అయిన దేవుడు ఆయనకు ఏ అవాంతరమూ సృష్టించకపోవచ్చు. కానీ దేవునికి ఇష్టం లేదన్న ఆయనలోని స్పృహ చాలు ఆయనను దేవుని మన్నింపునకు అర్హుడిని చేసేందుకు. - మాధవ్ శింగరాజు