military secrets
-
హ్యాకింగ్‌తో పాక్‌కు రహస్యాలు
ఐఎస్ఐ అధికారులకు సైన్యం గుట్టుమట్లు అనుష్కా ఐఎస్ఐ అధికారిణి అని గుర్తింపు ఇండియా సిమ్ కార్డు ద్వారానే సంభాషణలు పటన్‌ను విచారించిన ఆర్మీ అధికారులు హైదరాబాద్: పాక్‌కు సైనిక రహస్యాల చేరవేత ఉదంతంలో వురికొన్ని వివరాలు బయుటపడ్డారుు. బ్రౌజింగ్ హ్యాకింగ్‌తోనే మిలటరీ అధికారుల కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లలో ఉన్న రహస్యాలు పాక్‌కు చేరారుు. అనుష్కా అగర్వాల్‌గా పటన్‌కు పరిచయుమైన వుహిళ పాక్ ప్రభుత్వ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు చెందిన అధికారిణిని అని తేలింది. మన దేశ మిలటరీ అధికారులకు మహిళల పేరుతో ప్రేమిస్తున్నట్లు నటించి వలలో వేసుకునే కొత్త పద్దతికి ఐఎస్ఐ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఓ ఐఎస్ఐ మహిళా అధికారిణి పటన్‌కుమార్ పొద్దార్‌ను టార్గెట్ చేసింది. వీరి వుధ్య జరిగిన ఛాటింగే కొంప ముంచింది. కంప్యూటర్లో పటన్ ఈ-మెయిల్ తెరవగానే అనుష్కా బ్రౌజింగ్ హ్యాకింగ్ ద్వారా ఈ కంప్యూటర్ హార్డ్ డెస్క్‌లో ఉన్న మిలటరీకి చెందిన రహస్య పత్రాలను ఇతర కీలక వివరాలను తస్కరించింది. ఇండియాకు చెందిన సిమ్‌కార్డులనే ఉపయోగించిన అనుష్కా పాక్, భారత్ సరిహద్దులోకి వచ్చి మాట్లాడేదని తేలింది. భారత ఆర్మీ రహస్యాలను హ్యాకింగ్ ద్వారా పాక్ రాబట్టుకోవడాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుష్కా ఉదంతంతో అప్రమత్తమైన రక్షణ శాఖ మిలటరీ అధికారుల కంప్యూటర్లకు లాక్ నంబర్ ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత సెంటర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. చంచల్‌గూడ జైలులో ఉన్న పటన్‌ను ఆర్మీ అధికారులు శుక్రవారం నాలుగు గంటల పాటు విచారించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగింది. ఆర్మీ బ్రిగేడియర్ సిద్దన్న బృందం పటన్‌ను నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టింది. పటన్ ఏఏ అధికారి కార్యాలయాల కంప్యూటర్లను ఉపయోగించాడనే విషయాన్ని విచారణలో తెలుసుకున్నట్లు సమాచారం. -
ఆసిఫ్‌అలీని జైలులోనే విచారించండి
సీసీఎస్ పోలీసులకు కోర్టు ఆదేశాలు పటన్‌ను విచారించేందుకు సిద్ధమైన ఆర్మీ హైదరాబాద్: సైనిక రహస్యాలను బహిర్గతం చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌పై ఉన్న ఆసిఫ్‌అలీని ఈ నెల 16, 17 తేదీల్లో జైలులోనే విచారించాలని నాంపల్లి కోర్టు సీసీఎస్ పోలీసులను ఆదేశించింది. ఆసిఫ్‌అలీని ఐదు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ ఇటీవల కోర్టు ఆదేశించిన ఆనంతరం తన ఆరోగ్యం బాగులేదని ఆసిఫ్అలీ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు పై విధంగా తిరిగి ఆదేశాలు జారీ చేసింది. ఆసిఫ్‌అలీని విచారిస్తే అనుష్కఅగర్వాల్ ఎవరు అనే విషయం తెలుస్తుందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. అనుష్క ట్రాప్‌లో పడి మిలటరీ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసిన ఉదంతంలో ప్రధాన నిందితుడైన సికింద్రాబాద్ ఆర్డిలరీ సెంట ర్ సుబేదార్ పటన్‌కుమార్ పొద్దార్‌ను గత నెల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పటన్, ఆసిఫ్అలీలు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా, పటన్‌ను ఆర్మీ అధికారులు విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్మీ అతని కస్టడీ కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సాంకేతిక అడ్డంకుల కారణంగా కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అన్ని సవరించుకుని సోమవారం తిరిగి పిటిషన్ వేయడానికి ఆర్మీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
పతన్ కుమార్ కేసులో అసిఫ్ అలీ అరెస్ట్
హైదరాబాద్ : ఫేస్బుక్ పరిచయంతో సైనిక రహస్యాలను విదేశీయులకు చేరవేసిన ఆర్మీ అధికారి పతన్ కుమార్ పోద్దార్ కేసుకు సంబంధించి రెండో నిందితుడు అసిఫ్ అలీని ...సీసీసీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్‌పై అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ యూనిట్లో ఆసిఫ్ అలీ ఆర్మీ జవాన్. కాగా పతన్ కుమార్ పోద్దార్‌ను అనుష్క అగర్వాల్ మహిళ పేరుతో నమ్మించి, మోసం చేసింది ఆసిఫ్ అలీయేనని పోలీసుల విచారణలో తేలిన విషయం విదితమే. పోద్దార్తో ఫోన్లో మాట్లాడే మహిళ ఆసిఫ్అలీ భార్య అని విచారణలో వెల్లడి అయ్యింది. ఆసిఫ్ అలీ భార్య పాకిస్తాన్‌కు చెందిన మహిళగా విచారణలో తేలింది. దాంతో అసిఫ్ అలీని యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
అనుష్క కాదు అలీ!
హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పటన్ కుమార్ పోద్దార్ సైనిక రహస్యాలను బహిర్గతం చేసిన కేసులో అనుష్క అనే మహిళే లేదని సైనికాధికారుల విచారణలో తేలింది. పటన్ కుమార్‌ను మహిళ పేరుతో నమ్మించి, మోసం చేసింది అసిఫ్ అలీ అనే మరో సైనికుడేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మీరట్ సైనిక విభాగంలో పని చేస్తున్న అలీని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయాలు వెల్లడయ్యాయి. అలీ భార్య పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి. ఆమె ద్వారా ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థతో అలీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనుష్క అనే పేరుతో సికింద్రాబాద్‌లోని ఈఎంఈ యూనిట్లో సుబేదార్‌గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన పటన్‌కుమార్ పొద్దార్ నాయక్‌ను పరిచయం చేసుకున్నాడు. అప్పుడప్పుడు అతని బ్యాంకు ఖాతాలో డబ్బు కూడా జమ చేస్తూ ఉండేవాడు. విశ్వసనీయ సమాచారం మేరకు వీరి మధ్య ఫేస్బుక్ సంభాషణే ఎక్కువగా జరిగేది. ఒక్కసారి మాత్రం ఫోన్లో మాట్లాడారు. అయితే అప్పుడు అలీనే ఓ మహిళతో మాట్లాడించాడు. ఆ మహిళ అలీ భార్యగా భావిస్తున్నారు. అలీ భార్య పాకిస్తాన్‌కు చెందిన మహిళ. అలీనే మహిళగా చెప్పి, తరచూ డబ్బు ఇస్తూ పటన్‌కుమార్ నుంచి దేశ మిలటరీకి సంబంధించిన కీలకమైన రహస్యాలను తెలుసుకున్నాడు. ఏడాది కాలంగా పటన్ 104 పేజీల రహస్యాలను పంపినట్లు విచారణలో తేలింది. అయితే అలీకి సంబంధించి, అతని భార్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. మిలటరీ, పోలీసు అధికారులు ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. -
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నిజాలు!
హైదరాబాద్: తీగలాగితే డొంక కదిలినట్లు మిలటరీ అధికారి పటన్ కుమార్ పొద్దార్ నాయక్‌ను ప్రశ్నిస్తుంటే అనేక విషయాలు బయటపడుతున్నాయి. గతంలో జమ్మూకాశ్మీర్, నాసిక్‌లలో పనిచేసిన పటన్ పోలీసుల విచారణలో పలు కీలక వివరాలు తెలిపాడు. పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు అనుష్క అగర్వాల్ అనే మహిళా ఉగ్రవాది ద్వారా దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై సికింద్రాబాద్‌లోని ఈఎంఈ యూనిట్లో సుబేదార్‌గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన పటన్‌కుమార్ పొద్దార్ నాయక్‌ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలు: పొద్దార్ నాయక్‌కు అనుష్క అగర్వాల్‌తో 2013 నుంచి ఫేస్బుక్లో చాటింగ్ చేస్తున్నాడు. ఆర్మీ మిస్సైల్, ఆయుధ నిల్వల కర్మాగారం వివరాలను, ఫోటోలను పంపాలని అనుష్క అతనిని కోరింది. ఆర్మీకి సంబంధించిన కీలక వివరాలు, అధికారుల కదలకలను అతను అనుష్కకు పంపాడు. 40 మంది కీలక విభాగాల్లో అధికారుల వివరాలను కూడా అతను ఆమెకు తెలిపాడు. పతాన్ అకౌంట్లో ఆమె 5 సార్లు పది లక్షల రూపాయలను డిపాజిట్ చేసింది. దేశంలో ఉన్న 12 యూనిట్ల బ్రిగేడియర్ల పేర్లు, వారు ఉండే ప్రదేశాల వివరాలను ఆమెకు పంపాడు. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఆర్మీ సమాచారాన్ని కూడా నాయక్ ఫోన్లో ఆమెకు చెప్పాడు. భారత ఆర్మీ కీలక వివరాలు వెల్లడిస్తే లండన్ తీసుకెళ్తానని అతనికి అనుష్క చెప్పింది. పటన్ మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తుంటాడు. చైనాలో విదేశీ రాయబార కార్యాలయంలో ఉండే ధరమ్వీర్ సింగ్, సుబేదార్ బీఎస్ రెడ్డిలు అతనిని ఎమ్ఎల్ఎమ్ సెక్యూర్డ్ లైఫ్ వ్యాపారంలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే పోద్దార్ నాయక్ నుంచి పోలీసులు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు ఖాతాలోని 3 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనిపై అఫిషియల్ సీక్రెట్ యాక్ట్ 3,4,5 సెక్షన్లు,1977 ప్రైజ్ చిట్స్ మనీ సర్క్యులేషన్ బాన్నింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే అనుష్క అగర్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ రాజస్థాన్ రాజధాని జైపూర్ అడ్రస్‌తో ఉందని పోలీసులు వెల్లడించారు. ఆమె భారత్‌కు చెందిన వ్యక్తా? లేక పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తా? అనేది తెలియవలసి ఉంది. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతునట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. -
ఏడాదిగా సుబేదార్కు అనుష్కతో ఆర్థిక లావాదేవీలు
ఫేస్బుక్ పరిచయంతో సైనిక రహస్యాలను విదేశీయులకు చేరవేసిన ఆర్మీ అధికారి పతన్కుమార్ పొద్దార్ నాయక్ (40)ను తమకు ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు ఏడాది కాలం నుంచి అపరిచిత వ్యక్తితో పతన్కుమార్కు ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయని, మూడు నాలుగు నెలల నుంచి వీరిమధ్య ఫేస్బుక్లో చాటింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. పతన్కుమార్ నుంచి రెండు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నామని, వాటన్నింటినీ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించామని సీసీఎస్ పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే.. ఇంతకీ అసలా అపరిచిత వ్యక్తి పాకిస్థాన్ వ్యక్తా, ఇండియా వ్యక్తా అనేది తేలాల్సి ఉందన్నారు. కాగా ఎన్ఐఏ, ఐబీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎఫ్లు కూడా పతన్ కుమార్‌ను తమకు అప్పగించాలని ఇప్పటికే కోరుతున్న విషయం తెలిసిందే.