హ్యాకింగ్‌తో పాక్‌కు రహస్యాలు | Hacking secrets to Pakistan | Sakshi
Sakshi News home page

హ్యాకింగ్‌తో పాక్‌కు రహస్యాలు

Published Sat, Sep 20 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

హ్యాకింగ్‌తో పాక్‌కు రహస్యాలు

హ్యాకింగ్‌తో పాక్‌కు రహస్యాలు

ఐఎస్‌ఐ అధికారులకు సైన్యం గుట్టుమట్లు
అనుష్కా ఐఎస్‌ఐ అధికారిణి అని గుర్తింపు
ఇండియా సిమ్ కార్డు ద్వారానే సంభాషణలు
 పటన్‌ను విచారించిన ఆర్మీ అధికారులు

 
 హైదరాబాద్: పాక్‌కు సైనిక రహస్యాల చేరవేత ఉదంతంలో వురికొన్ని వివరాలు బయుటపడ్డారుు. బ్రౌజింగ్ హ్యాకింగ్‌తోనే మిలటరీ అధికారుల కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లలో ఉన్న రహస్యాలు పాక్‌కు చేరారుు. అనుష్కా అగర్వాల్‌గా పటన్‌కు పరిచయుమైన వుహిళ పాక్ ప్రభుత్వ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ)కు చెందిన అధికారిణిని అని తేలింది. మన దేశ మిలటరీ అధికారులకు మహిళల పేరుతో ప్రేమిస్తున్నట్లు నటించి వలలో వేసుకునే కొత్త పద్దతికి ఐఎస్‌ఐ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఓ ఐఎస్‌ఐ మహిళా అధికారిణి పటన్‌కుమార్ పొద్దార్‌ను టార్గెట్ చేసింది. వీరి వుధ్య జరిగిన ఛాటింగే కొంప ముంచింది. కంప్యూటర్‌లో పటన్ ఈ-మెయిల్ తెరవగానే అనుష్కా బ్రౌజింగ్ హ్యాకింగ్ ద్వారా ఈ కంప్యూటర్ హార్డ్ డెస్క్‌లో ఉన్న మిలటరీకి చెందిన రహస్య పత్రాలను ఇతర కీలక వివరాలను తస్కరించింది.

ఇండియాకు చెందిన సిమ్‌కార్డులనే ఉపయోగించిన అనుష్కా పాక్, భారత్ సరిహద్దులోకి వచ్చి మాట్లాడేదని తేలింది. భారత ఆర్మీ రహస్యాలను హ్యాకింగ్ ద్వారా పాక్ రాబట్టుకోవడాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుష్కా ఉదంతంతో అప్రమత్తమైన రక్షణ శాఖ మిలటరీ అధికారుల కంప్యూటర్లకు లాక్ నంబర్ ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత సెంటర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. చంచల్‌గూడ జైలులో ఉన్న పటన్‌ను ఆర్మీ అధికారులు శుక్రవారం నాలుగు గంటల పాటు విచారించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగింది. ఆర్మీ బ్రిగేడియర్ సిద్దన్న బృందం పటన్‌ను నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టింది. పటన్ ఏఏ అధికారి కార్యాలయాల కంప్యూటర్లను ఉపయోగించాడనే విషయాన్ని విచారణలో తెలుసుకున్నట్లు సమాచారం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement