Patan
-
గుజరాత్ లోని పఠాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
వీడియో వైరల్: మైనర్ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని..
గాంధీనగర్: ప్రేమించిన వ్యక్తితో మైనర్ బాలిక పారిపోయిందని ఆమె పట్ల గ్రామస్తులు అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. పటాన్‌లోని హరిజ్ ప్రాంతానికి చెందిన 14 బాలిక ఓ యువకుడితో కలిసి పారిపోయింది. బాలిక పారిపోవడాన్ని తప్పుపట్టిన గ్రామస్తులు ఆమెను తీసుకొచ్చి దారుణంగా శిక్షించారు. యువతి చేసిన చర్య తమకు చెడ్డ పేరు తీసుకొస్తుందని భావించి ఆమెను చిత్రహింసలు పెట్టారు. ముఖమంతా ఇంకు పూశారు. యువతి ఏడ్చుకుంటూ..నన్ను వదిలేయండి అని గ్రామస్తులను ఎంత వుడకున్నా వారి చెవికి వినపడలేదు. చదవండి: 2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్‌కు అంతటితో ఆగకుండా యువతికి గుండు గీయించారు. ప్రియుడిని, బాలికను ఊరంతా ఊరేగించారు ఈ సంఘటనను మొత్తం స్థానికులు మొబైల్లో వీడియో రికార్డ్ శారు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాము వాడి గిరిజనులకు చెందినవారమని, గ్రామ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ విధంగా ప్రవర్తించామని గ్రామస్తులు చెబుతున్నారు. చదవండి: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళకు మరో బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించారు.. కాసేపటికే కాగా ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. పటాన్ ఎస్పీ అక్షయ్‌రాజ్ మక్వానా సంఘటన స్థలానికి చేరుకొని దీనితో సంబంధమున్న 35 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే బాలికకు మరో వ్యక్తితో పెళ్లి చేయాలని ఆమె తల్లి తండ్రులు ఒత్తిడి చేసినట్లు ఎస్పీ తెలిపారు. మైనర్‌ను తీసుకెళ్లిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే వాడి కమ్యూనిటీకి చెందిన తెగ సభ్యులు ఈ విధంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిని శిక్షిస్తారని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. -
హ్యాకింగ్‌తో పాక్‌కు రహస్యాలు
ఐఎస్ఐ అధికారులకు సైన్యం గుట్టుమట్లు అనుష్కా ఐఎస్ఐ అధికారిణి అని గుర్తింపు ఇండియా సిమ్ కార్డు ద్వారానే సంభాషణలు పటన్‌ను విచారించిన ఆర్మీ అధికారులు హైదరాబాద్: పాక్‌కు సైనిక రహస్యాల చేరవేత ఉదంతంలో వురికొన్ని వివరాలు బయుటపడ్డారుు. బ్రౌజింగ్ హ్యాకింగ్‌తోనే మిలటరీ అధికారుల కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లలో ఉన్న రహస్యాలు పాక్‌కు చేరారుు. అనుష్కా అగర్వాల్‌గా పటన్‌కు పరిచయుమైన వుహిళ పాక్ ప్రభుత్వ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు చెందిన అధికారిణిని అని తేలింది. మన దేశ మిలటరీ అధికారులకు మహిళల పేరుతో ప్రేమిస్తున్నట్లు నటించి వలలో వేసుకునే కొత్త పద్దతికి ఐఎస్ఐ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఓ ఐఎస్ఐ మహిళా అధికారిణి పటన్‌కుమార్ పొద్దార్‌ను టార్గెట్ చేసింది. వీరి వుధ్య జరిగిన ఛాటింగే కొంప ముంచింది. కంప్యూటర్లో పటన్ ఈ-మెయిల్ తెరవగానే అనుష్కా బ్రౌజింగ్ హ్యాకింగ్ ద్వారా ఈ కంప్యూటర్ హార్డ్ డెస్క్‌లో ఉన్న మిలటరీకి చెందిన రహస్య పత్రాలను ఇతర కీలక వివరాలను తస్కరించింది. ఇండియాకు చెందిన సిమ్‌కార్డులనే ఉపయోగించిన అనుష్కా పాక్, భారత్ సరిహద్దులోకి వచ్చి మాట్లాడేదని తేలింది. భారత ఆర్మీ రహస్యాలను హ్యాకింగ్ ద్వారా పాక్ రాబట్టుకోవడాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుష్కా ఉదంతంతో అప్రమత్తమైన రక్షణ శాఖ మిలటరీ అధికారుల కంప్యూటర్లకు లాక్ నంబర్ ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత సెంటర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. చంచల్‌గూడ జైలులో ఉన్న పటన్‌ను ఆర్మీ అధికారులు శుక్రవారం నాలుగు గంటల పాటు విచారించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగింది. ఆర్మీ బ్రిగేడియర్ సిద్దన్న బృందం పటన్‌ను నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టింది. పటన్ ఏఏ అధికారి కార్యాలయాల కంప్యూటర్లను ఉపయోగించాడనే విషయాన్ని విచారణలో తెలుసుకున్నట్లు సమాచారం.