వీడియో వైరల్‌: మైనర్‌ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని.. | Gujarat: Head Tonsured, Villagers punish Woman For Eloping With Lover | Sakshi
Sakshi News home page

Gujarat: ప్రియుడితో పారిపోయిందని మైనర్‌ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ఇంకు పూసి.. గుండు కొట్టించి

Published Sat, Nov 13 2021 3:26 PM | Last Updated on Sat, Nov 13 2021 6:01 PM

Gujarat: Head Tonsured, Villagers punish Woman For Eloping With Lover - Sakshi

గాంధీనగర్‌:  ప్రేమించిన వ్యక్తితో మైనర్‌ బాలిక పారిపోయిందని ఆమె పట్ల గ్రామస్తులు అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. పటాన్‌లోని హరిజ్‌ ప్రాంతానికి చెందిన 14 బాలిక  ఓ యువకుడితో కలిసి పారిపోయింది. బాలిక పారిపోవడాన్ని తప్పుపట్టిన గ్రామస్తులు ఆమెను తీసుకొచ్చి దారుణంగా శిక్షించారు. యువతి చేసిన చర్య తమకు చెడ్డ పేరు తీసుకొస్తుందని భావించి ఆమెను చిత్రహింసలు పెట్టారు. ముఖమంతా ఇంకు పూశారు. యువతి ఏడ్చుకుంటూ..నన్ను వదిలేయండి అని గ్రామస్తులను ఎంత వుడకున్నా వారి చెవికి వినపడలేదు. 
చదవండి: 2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్‌కు

అంతటితో ఆగకుండా యువతికి గుండు గీయించారు. ప్రియుడిని, బాలికను ఊరంతా ఊరేగించారు ఈ సంఘటనను మొత్తం స్థానికులు మొబైల్‌లో వీడియో రికార్డ్‌ శారు. వీటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాము వాడి గిరిజనులకు చెందినవారమని, గ్రామ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ విధంగా ప్రవర్తించామని గ్రామస్తులు చెబుతున్నారు. 
చదవండి: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళకు మరో బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించారు.. కాసేపటికే

కాగా ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. పటాన్‌ ఎస్పీ అక్షయ్‌రాజ్‌ మక్వానా సంఘటన స్థలానికి చేరుకొని దీనితో సంబంధమున్న 35 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే బాలికకు మరో వ్యక్తితో పెళ్లి చేయాలని ఆమె తల్లి తండ్రులు ఒత్తిడి చేసినట్లు ఎస్పీ తెలిపారు. మైనర్‌ను తీసుకెళ్లిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే వాడి కమ్యూనిటీకి చెందిన తెగ సభ్యులు ఈ విధంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిని శిక్షిస్తారని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement