villagers anger
-
అలా చేసేందుకు ప్రయత్నించారు.. గొంతు విప్పిన ఓటింగ్ గ్రామస్తులు
కోహిమా: నాగాలాండ్ ఫైరింగ్ ఘటనలో భద్రతాదళాలు 13 మంది యువకులను చంపి, మిలిటెంట్లుగా చిత్రీకరించ చూశాయని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామస్తులు తెలిపారు. మృతదేహాలను దాచి, బట్టలు మార్చి, పక్కన ఆయుధాలను పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత గ్రామస్తులు గొంతు విప్పారు. ఓటింగ్ సిటిజెన్స్ ఆఫీస్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘డిసెంబర్ 4న 3:30గంటల సమయంలో బొగ్గుగనుల్లో పనిచేసే ఎనిమిది మంది యువకులతో పికప్ ట్రక్ గని నుంచి తిరిగి గ్రామానికి వస్తోంది. తెల్లారితే ఆదివారం సెలవురోజు. సాయంత్రం నాలుగున్నరకు అందులో ఉన్న ప్రయాణికుల గురించి ఏ వివరాలు తెలుసుకోకుండానే ట్రక్ మీద భద్రతాదళాలు దాడి చేశాయి. చదవండి: Nagaland Tragedy: నాగాలాండ్ నరమేథం తరువాత రోడ్డును బ్లాక్ చేసి... ట్రాఫిక్‌ను పాత పయనీర్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించాయి. ఎంతవరకూ పికప్ ట్రక్ గ్రామానికి రాకపోవడంతో ఆందోళనతో ఎదురుచూస్తున్నాం. తరువాత కాల్పులు జరిగాయని తెలిసింది. 8గంటలకు మేం వెళ్లేసరికి పికప్ ట్రక్ ఖాళీగా ఉంది. డ్రైవర్ సీటు ఎదురుగా అద్దానికి బుల్లెట్ దూసుకుపోయిన గుర్తులు కనిపించాయి. అంటే ట్రక్‌ను ఆపేందుకు వాళ్లు ముందుగా డ్రైవర్‌ను పాయింట్ బ్లాంక్‌లో కాల్చారు. తరువాత మోటార్‌బైక్‌లపై వెళ్లి భద్రతా బలగాల వాహనాలను పట్టుకునే ప్రయత్నం చేశాం. భద్రతా సిబ్బందిని అడిగితే తమకేమీ తెలియదన్నారు. అక్కడే ఓ టార్పాలిన్ కనిపించింది. దాన్ని తొలగించి చూస్తే... ఆరుగురు యువకుల మృతదేహాలు కనిపించాయి. వాళ్ల షర్ట్స్ తొలగించి ఉన్నాయి. మిలిటెంట్ల బట్టలు, బూట్లు వేసి ఆయుధాలను పెట్టే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై ప్రశ్నిస్తే... మాపైనా దాడికి దిగారు. కాల్పులు ప్రారంభించి మరికొందరిని చంపేశారు. ఇంకొందరిని గాయపరిచారు. జనాభాలోనూ, ప్రాంతంలోనూ మేం తక్కువ కావొచ్చు. కానీ... పోరాటంలో మా ప్రాణాలు ఇవ్వడానికైనా, శత్రువుల తలలు తీయడానికైనా సిద్ధంగా ఉంటాం’’ అని గ్రామస్తులు ఉద్ఘాటించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న నాగాలాండ్ పోలీసులు ఎస్పీఎఫ్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇండియన్ ఆర్మీ ఈ ఘటనపై మేజర్ జనరల్ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించింది. -
వీడియో వైరల్: ప్రియుడితో పారిపోయిందని.. సీరా పూసి.. గుండు కొట్టించి
-
వీడియో వైరల్: మైనర్ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని..
గాంధీనగర్: ప్రేమించిన వ్యక్తితో మైనర్ బాలిక పారిపోయిందని ఆమె పట్ల గ్రామస్తులు అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. పటాన్‌లోని హరిజ్ ప్రాంతానికి చెందిన 14 బాలిక ఓ యువకుడితో కలిసి పారిపోయింది. బాలిక పారిపోవడాన్ని తప్పుపట్టిన గ్రామస్తులు ఆమెను తీసుకొచ్చి దారుణంగా శిక్షించారు. యువతి చేసిన చర్య తమకు చెడ్డ పేరు తీసుకొస్తుందని భావించి ఆమెను చిత్రహింసలు పెట్టారు. ముఖమంతా ఇంకు పూశారు. యువతి ఏడ్చుకుంటూ..నన్ను వదిలేయండి అని గ్రామస్తులను ఎంత వుడకున్నా వారి చెవికి వినపడలేదు. చదవండి: 2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్‌కు అంతటితో ఆగకుండా యువతికి గుండు గీయించారు. ప్రియుడిని, బాలికను ఊరంతా ఊరేగించారు ఈ సంఘటనను మొత్తం స్థానికులు మొబైల్లో వీడియో రికార్డ్ శారు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాము వాడి గిరిజనులకు చెందినవారమని, గ్రామ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ విధంగా ప్రవర్తించామని గ్రామస్తులు చెబుతున్నారు. చదవండి: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళకు మరో బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించారు.. కాసేపటికే కాగా ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. పటాన్ ఎస్పీ అక్షయ్‌రాజ్ మక్వానా సంఘటన స్థలానికి చేరుకొని దీనితో సంబంధమున్న 35 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే బాలికకు మరో వ్యక్తితో పెళ్లి చేయాలని ఆమె తల్లి తండ్రులు ఒత్తిడి చేసినట్లు ఎస్పీ తెలిపారు. మైనర్‌ను తీసుకెళ్లిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే వాడి కమ్యూనిటీకి చెందిన తెగ సభ్యులు ఈ విధంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిని శిక్షిస్తారని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. -
'జన్మభూమి'ని బహిష్కరించిన నూజెండ్ల ప్రజలు
నూజెండ్ల : గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముత్తరాజుపాలెంలో శుక్రవారం నిర్వహిస్తోన్న జన్మభూమి సభను గ్రామస్తులు బహిష్కరించారు. తమ సమస్యలను పరిష్కరించనప్పుడు జన్మభూమి కార్యక్రమం ఎందుకని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులకు, రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు కార్యక్రమం నిర్వహించకుండానే వెళ్లిపోయారు.