militents
-
మణిపూర్ విషయంలో మద్దతివ్వండి.. భారత ఆర్మీ విజ్ఞప్తి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రజలు తమకు సహాయం చేయాలని భారత ఆర్మీ కోరింది. సహాయక చర్యలందించడానికి తాము వెళ్లకుండా మహిళా ఉద్యమకారులు రోడ్లపై అడ్డంకులు సృష్టిస్తున్నారని, తమ కార్యకలపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆర్మీ తెలిపింది. ఇలాంటి అనవసర జోక్యం వల్ల భద్రతా బలగాలు సరైన సమయానికి చేరుకోలేకపోతున్నాయని ఆర్మీ ట్విట్టర్లో సోమవారం ఓ వీడియో విడుదల చేసింది. ‘‘శాంతి పునరుద్ధరణకోసం కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాల ప్రజలను ఇండియన్ ఆర్మీ కోరుతోంది. మణిపూర్‌కు సాయం చేసేందుకు మాకు సాయం చేయండి’’ అంటూ ట్వీట్ చేసింది. తూర్పు ఇంఫాల్‌లోని ఇథం గ్రామంలో ఆర్మీ, మహిళల నేతృత్వంలోని ఓ సమూహం మధ్య శనివారం రోజంతా ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ఆర్మీ 12 మంది ఉగ్రవాదులను వదిలిపెట్టింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తరువాత ఆర్మీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 2015లో 6 డోగ్రా యూనిట్‌పై ఆకస్మిక దాడితో సహా అనేక దాడుల్లో పాల్గొన్న మైతీ మిలిటెంట్ గ్రూప్ అయిన కంగ్లీ యావోల్ కన్న లుప్ (కేవైకేఎల్)కు చెందిన 12 మంది సభ్యులు గ్రామంలో దాగి ఉన్నారని వారు తెలిపారు. భద్రతా సిబ్బంది ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో మే 3న ’ఆదివాసి సంఘీభావ యాత్ర’ నిర్వహించిన తర్వాత మొదట ఘర్షణలు చెలరేగడం, ఈశాన్య రాష్ట్రంలో మైతీ, కుకీ కమ్యూనిటీల మధ్య చెలరేగిన హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కార్యకలాపాలకు సహకరించండి అంటూ ఆర్మీ విజ్ఞప్తి చేస్తోంది. Women activists in #Manipur are deliberately blocking routes and interfering in Operations of Security Forces. Such unwarranted interference is detrimental to the timely response by Security Forces during critical situations to save lives and property. 🔴 Indian Army appeals to… pic.twitter.com/Md9nw6h7Fx — SpearCorps.IndianArmy (@Spearcorps) June 26, 2023 ఇది కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ సీఎంకు తప్పిన పెను ప్రమాదం -
50 మంది ఉగ్రవాదుల లొంగుబాటు
కాబూల్: బాడ్ఘిస్ ప్రావిన్స్‌లో ఆదివారం 50 ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ అధికారుల ఎదుట లొంగియారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు ధృవీకరించారు. లొంగిపోయిన వారిలో తాలిబన్ కీలక కమాండర్ ముల్లా తూపాన్ కూడా ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ముల్లా తూపాన్ సుమారు 300 మంది ఉగ్రవాదులను పెంచిపోషించాడు. ముల్లా తూపాన్ లొంగుబాటు బాడ్ఘిస్ ప్రావిన్స్‌తో పాటు పక్కనున్న ప్రాంతాల్లో కూడా తాలిబన్‌కు కోలుకోని దెబ్బ అని అధికారులు చెబుతున్నారు. ఆయుధాలను కూడా పోలీసులకు అప్పగించారు. -
‘బిడ్డా.. ఇంటికి రా’ అని పోస్టు పెట్టాడు.. అంతలోనే!
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 18 ఏళ్ల ఫర్హాన్ వనీ కూడా ప్రాణాలు విడిచాడు. కుల్గామ్ జిల్లాలోని ఖుద్వానీ గ్రామానికి చెందిన ఫర్హాన్ వనీ గత ఏడాది మధ్యలో మిలిటెన్సీలో చేరాడు. గత నవంబర్‌లో అతని తండ్రి గులం మహమ్మద్ వనీ ఫేస్బుక్లో కొడుకును ఉద్దేశించి భావోద్వేగమైన పోస్టు పెట్టాడు. ‘బిడ్డా హింసను విడనాడి.. ఇంటికి తిరిగిరా’ అంటూ హృదయాన్ని పిండేసిరీతిలో విజ్ఞప్తి చేశాడు. ‘బిడ్డా.. నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లిన నాటినుంచి నా శరీరం నా మాట వినడం లేదు. నువ్వు చేసిన దానికి బాధతో నేను అల్లాడిపోతున్నాను. అయినా నువ్వు ఇంటికి తిరిగి వస్తావన్న నమ్మకం నాలో ఉంది’ అని గులాం నవంబర్ 24న వనీ ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశాడు. ‘చిరునవ్వుతో కూడిన నీ ముఖాన్ని నేనెంతగా మిస్ అవుతున్నానో వివరించలేను. నువ్వు వెళ్లి ఆరు నెలలు అవుతోంది. నీ ఆలోచన లేకుండా ఒక్క నిమిషం కూడా నాకు గడవడం లేదు. నువ్వు బాగున్నావని, బాగుంటావని ఆశతో బతుకుతున్నాను. నేను నీ తండ్రిని. నేను కాకపోతే ఈ విషయాన్ని ఎవరు నీకు చెప్తారు.. నేను చనిపోతానేమో అనిపిస్తోంది. నాకు మరో మార్గం లేదు. నీకు నేను చాలా చెప్పాల్సి ఉంది. ఎంతో నేర్పించాల్సి ఉంది. తిడుతూ నీకు సాయం చేయాల్సి ఉంది’ అంటూ హృదయాన్ని కదిలించేరీతిలో గులాం ఈ పోస్టు పెట్టారు. వనీ తల్లి కూడా కొడుకు కోసం ఎంతో తపించిపోతున్నదని, నువ్వు ఎంచుకున్న మార్గాన్ని వదిలి ఇంటికి తిరిగి రావాలని, గడిచిందంతా మరిచిపోవాలని, నువ్వు ఎంచుకున్న మార్గం వల్ల నువ్వు శాశ్వతంగా దూరం అయ్యే అవకాశం కూడా ఉందని, కాబట్టి త్వరగా ఇంటికి తిరిగిరావాలని వేడుకుంటూ గులాం ఈ పోస్టు పెట్టాడు. మిలిటెన్సీలో చేరిన ఫుట్‌బాలర్ మజిద్ ఖాన్.. తన తల్లిదండ్రులు ఫేస్బుక్లో పెట్టిన పోస్టు చూసి.. తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నేపథ్యంలో గులాం కూడా అదే ఆశతో ఈ పోస్టు పెట్టాడు. పోలీసులు కూడా మిలిటెన్సీలో కలిసిపోయిన స్థానిక యువకులు, విద్యార్థులు తిరిగి జనజీవనస్రవంతిలో కలువాలని, వారిపై ఎలాంటి కేసులు, విచారణలు ఉండవని భరోసా ఇస్తున్నారు. అయినా, అతని పోస్టు వృథానే అయింది. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఫర్హాన్ వనీ మృతిచెందడం ఆయన కుటుంబంలో విషాదం నింపింది. -
కశ్మీర్లో జవాన్ దారుణ హత్య
శ్రీనగర్: ప్రాదేశిక సైన్యంలో పనిచేస్తున్న ఇర్ఫాన్ అహ్మద్ దార్ (23) అనే జవాన్‌ను దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో మిలిటెంట్లు అపహరించి క్రూరంగా హత్య చేశారు. భారీ సంఖ్యలో బుల్లెట్లు తగిలిన దార్ మృతదేహాన్ని సోపియాన్‌లోని ఓ పళ్ల తోటలో గుర్తించామని అధికారులు శనివారం వెల్లడించారు. బందిపోరా జిల్లాలో విధులు నిర్వర్తించే దార్ ఈ నెల 26 వరకు సెలవు తీసుకుని సోపియాన్‌కు వచ్చాడనీ, ఉగ్రవాదులే అతణ్ని అపహరించి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారన్నారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. -
పాక్ లో బస్సు పై కాల్పులు
-
'పాక్ ప్రజలకు అండగా ఉందాం'
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపి 47 మంది షియా మైనారిటీలను హతమార్చడాన్ని అత్యంత దారుణ చర్యగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఉగ్ర కాల్పుల్లో మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి విపత్కర సమయంలో పాకిస్థాన్ ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం కరాచీలోని సఫోరా గోథ్ ప్రాంతంలో షియా వర్గంవారు ప్రయాణిస్తోన్న బస్సుపై తెహ్రీక్- ఏ- తాలిబన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది మహిళలు సహా 47 మంది దుర్మరణం చెందారు. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అరెర్ట్ ప్రకటించింది.