militia commander
-
కరుడుకట్టిన మిలిషియా కమాండర్ అరెస్టు
సాక్షి, కాకినాడ: తూర్పు మన్యంలో కరుడుకట్టిన మిలిషియా దళ కమాండర్ ముచ్చిక లక్ష్మయ్యను గురువారం తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శబరి దళంలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లక్ష్మయ్య.. నాలుగు హత్య కేసులతో పాటు 20 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. చింతూరు మండలానికి చెందిన 24 ఏళ్ల లక్ష్యయ్య నాలుగేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. మరో వైపు కొవ్వాసి దేవమ్మ అనే మావోయిస్టు దళ సభ్యురాలు జిల్లా పోలీసులకు లొంగిపోయింది. జిల్లా సరిహద్దులోని చత్తీస్ఘడ్ సుకుమా జిల్లాలో దేవమ్మ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. -
చర్లలో మిలీషియా కమాండర్ అరెస్టు
చర్ల: మావోయిస్టు మిలీషియా కమాండర్ ఒకరు పోలీసులకు పట్టుబడ్డారు. చర్ల మండలం కుర్గట్పాడ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం కూంబింగ్ చేపట్టిన కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్టులు తారసపడగా పోలీసులు వారిని వెంబడించారు. వారిలో పట్టుబడిన ఒకరిని చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించి, విచారణ చేపట్టారు. పట్టుబడిన వ్యక్తి చర్ల ఏరియా మిలీషియా కమాండర్ సోడి మూక అలియాస్ మూకయ్యగా తేలటంతో అతడిని భద్రాచలం కోర్టు ఎదుట హాజరుపరిచామని సీఐ సాయిరమణ, ఎస్సై రవీందర్ తెలిపారు. మూకయ్యపై సెల్‌టవర్ పేల్చివేత, ల్యాండ్మైన్ల ఏర్పాటు, ఒక వ్యక్తి హత్య కేసులు ఉన్నాయని వారు వివరించారు.